India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వేలాది మంది తరలిరాగా సోమవారం కూడా భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పలువురు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కిక్కిరిసిపోయారు.
మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ములకలకాల్వ మేజర్ కాల్వ కింద బోరు నీటి ఆధారంతో సాగు చేయగా పంట పొట్ట దశకు వచ్చే వరకు నీరు పారింది. తాజాగా బోర్లలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఎండిన పంటకు నిప్పు పెట్టాడు. ఐదెకరాల్లో సాగుకు రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టినట్టు వాపోయాడు.
మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. MBNR-245, NRPT-205, కొడంగల్-56,WNPT-218, GDWL-225, NGKL-101, కొల్లాపూర్-67, అచ్చంపేట-79, కల్వకుర్తి-72, షాద్ నగర్-171 ఓటర్లు ఉన్నారు. 83 ZPTCలు, 888 MPTCలు, 449 వార్డు కౌన్సిలర్లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 19 ఎక్స్అఫీషియో హోదాలో ఓటు వేయనున్నారు.
కోదాడ పట్టణంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడు మహమ్మద్ అమన్ క్యాన్సర్ వ్యాధి బారినపడి ఇబ్బంది పడుతున్నాడు. HYDలోని ఓ ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అమర్ వైద్యానికి రూ.20 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంత స్థోమత లేని తండ్రి రియాజ్ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకును కాపాడాలని వేడుకుంటున్నాడు.
నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి, సోదరుడు ధర్మపురి అర్వింద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలని తమకు ఓటేయాలని ఆయన కోరారు.
కరీంనగర్, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండిసంజయ్, గోమాస శ్రీనివాస్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించిబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలి- బీజేపీకి ఓటేయాలని కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర మండలాల రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సాగర్ రెండో జోన్ నుంచి సాగర్ జలాలు అందించేందుకు అధికారులతో రూపకల్పన చేయించారు. ఇందుకు రూ.800 కోట్లతో భారీ సాగునీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల రెండు మండలాల్లోని 33,025 ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందించనున్నారు.
ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ తన సొంతూరు చల్లగరిగేలో గ్రంథాలయం నిర్మాణం చేపట్టారు. పురస్కారానికి గుర్తుగా తన సతీమణి సుచిత్ర ఆలోచన మేరకు గ్రామంలోని గ్రంథాలయాన్ని ఆంగ్ల అక్షరం ‘O’ ఆకారంలో రెండంతస్తుల్లో నిర్మిస్తున్నారు. 80శాతం పనులు పూర్తి అయ్యాయి. మరికొద్ది రోజుల్లో గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు.
నగరానికి మణిహారంగా భావిస్తున్న HYD చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. చర్లపల్లి టెర్మినల్లో రూ.430 కోట్ల అంచనాతో ప్రయాణికులకు అనేక వసతులు కల్పిస్తున్నారు. 3 రైల్వే లైన్లుగా ఉన్న చర్లపల్లిలో ఇప్పుడు 9 ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బస్ బేలు, ప్రవేశమార్గాలు, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తున్నారు.
నగరానికి మణిహారంగా భావిస్తున్న HYD చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. చర్లపల్లి టెర్మినల్లో రూ.430 కోట్ల అంచనాతో ప్రయాణికులకు అనేక వసతులు కల్పిస్తున్నారు. 3 రైల్వే లైన్లుగా ఉన్న చర్లపల్లిలో ఇప్పుడు 9 ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. బస్ బేలు, ప్రవేశమార్గాలు, పార్కింగ్ స్థలం ఏర్పాటు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.