India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాతకక్షలతో కత్తితో దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లిలో చోటుచేసుకుంది. మల్లయ్య అనే వ్యక్తిపై అంజన్న అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లయ్యను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం తెలిపారు. ఈరోజు ఉదయం రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాల సేకరణ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ఫిర్యాదులు అందించేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం ఎగువ నుంచి 3,271 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి నీటి పంపింగ్ కొనసాగిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.627 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈనెల 17 నాటికి జూరాలకు ఎగువ నుంచి భారీగా నీరు చేరనుందని అధికారులు అంటున్నారు.
ఆదిలాబాద్-పటాన్‌చెరు రైల్వేలైన్ సర్వే పనులు కల్హేర్ మండలంలో NH-161 వెంట నిర్వహించారు. మహాదేవుపల్లి, మాసాన్‌పల్లి, దేవునిపల్లి, బాచేపల్లి మీదుగా నిజాంపేట్ మీదుగా లైన్ వేయనున్నారు. మొత్తం 317KM రైల్వేలైన్ ఏర్పాటుకు ద.మ రైల్వే అప్పట్లో రూ.5,700 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 2వ విడత సర్వే చేస్తున్నారు. దీనికి 12ఏళ్ల క్రితం సర్వే చేయగా.. తిరిగి అదే మార్గంలో సర్వే చేసి గుర్తులు వేస్తున్నారు.
కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని MP బండి సంజయ్ అన్నారు. ఆదివారం KNRలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రెండు సార్లు కార్పొరేటర్‌గా పని చేసిన తనను గుర్తించి సన్మానించడం గౌరవంగా ఉందన్నారు. స్మార్ట్‌సిటీ కింద రూ.765 కోట్లు ఇప్పిటికే వచ్చాయని, ఇంకా రూ.176 కోట్లు రావాల్సి ఉందన్నారు. ప్రణాళిక అమలుకు మంత్రి పొన్నం, MLA గంగుల కమలాకర్‌తో పాటు.. CM రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తానని తెలిపారు.
మహిళా కండక్టర్‌పై ప్రయాణికురాలు దాడి చేసిన ఘటన ఆదివారం వైరాలో జరిగింది. భద్రాచలం నుంచి ఖమ్మంకు వస్తున్న ఆర్టీసీ బస్సులో సుజాతనగర్ వద్ద అరుణ ఆమె భర్త ఎక్కారు. ఈ క్రమంలో భర్త వైరాలో దిగిపోయాడు. వీరిద్దరి టికెట్ భర్త వద్దే ఉండిపోవడంతో టికెట్ ఉండాలని అరుణకు కండక్టర్ సూచించారు. దీంతో క్షణికావేశంతో అరుణ కండక్టర్‌పై దాడి చేసి దుర్భాషలాడింది. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి బడి ఈడు పిల్లలను బడిలోనే ఉంచాలనే ఉద్దేశంతో NLG జిల్లాలో ప్రభుత్వం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరిలో ఆపరేషన్ స్మైల్-10 పూర్తికాగా ఈ నెల 1 నుంచి ఆపరేషన్ ముష్కాన్ కొనసాగుతోంది. జిల్లాలోని పలు పరిశ్రమలు, దుకాణాలు ఇతర ప్రదేశాల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్న 34 మంది బాల కార్మికులను గుర్తించి పనుల నుంచి విముక్తి కల్పించారు.
ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి స్నేహితులు అండగా నిలిచారు. అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ సిబ్బంది వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి స్నేహితులు ముందుకొచ్చారు. 2014 బ్యాచ్‌కు చెందిన SIలు ఆ కుటుంబానికి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. వారిలో ఉమ్మడి NZB జిల్లాకు చెందిన పలువురు SIలు కూడా ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. విద్యాలయంలో సంగీతం/నృత్యం, టీజీటీ సంస్కృతం, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ విభాగాల్లో నాలుగు పోస్టులు ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈరోజు ఉదయం నిర్వహించే ఇంటర్వ్యూలకు ద్రువపత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.
ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించినందుకు ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై నివేదిక సిద్ధం చేసి నిపుణుల కమిటీకి అందజేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీ కిందికి తీసుకువస్తే నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
Sorry, no posts matched your criteria.