India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒‘కాంగ్రెస్ జన జాతర’ సభకు తరలి వెళ్లిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు,శ్రేణులు
✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా BRS నాయకుల “రైతు దీక్ష”
✒పెబ్బేర్:జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
✒BJPకి 400 సీట్లు పక్కా:DK అరుణ
✒పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా !
✒తలకిందులుగా తపస్సు చేసిన BRSకు ఒక్క సీటు రాదు:మంత్రి జూపల్లి
✒ఉమ్మడి జిల్లాలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
✒నేడు ‘షబ్-ఎ- ఖాదర్’..రాత్రంతా జాగారం
HYD దుర్గంచెరువు వద్దకు వచ్చేవారు సెల్ఫీలు దిగేందుకు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లకూడదని మాదాపూర్ సీఐ మల్లేశ్ తెలిపారు. సెల్ఫీల కోసం రోడ్లపైకి రావడంతో తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సెల్ఫీల కోసం దుర్గంచెరువు మీదకు వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. SHARE IT

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లక్షెట్టిపేట రికార్డు స్థాయిలో 91.44 శాతం మున్సిపాలిటీ పన్నులు వసూలు చేసింది. రాష్ట్రంలోనే ఈ మున్సిపాలిటీ టాప్-8లో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో లక్షెట్టిపేట మొదటిస్థానంలో ఉండగా, భైంసా 47.29 శాతంతో రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. మంచిర్యాల 68.45 శాతం, ఆదిలాబాద్ 64.23 శాతం, నిర్మల్ 53.24, బెల్లంపల్లి 50.79, ఖానాపూర్‌లో 49% మాత్రమే పన్ను వసూళ్లు అయ్యాయి.
నల్గొండ జిల్లా నేరడుగొమ్ము మండలం బచ్చాపురంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తోటలో తరచూ ఆవులు మేత కోసం వస్తున్నాయని ఆ తోట యజమాని నీటి సంపులో విషప్రయోగం చేశాడు. ఎప్పటి లాగే మేతకు వచ్చిన పశువులు విషం కలిపిన నీళ్లు తాగడంతో 11 ఆవులు మృతి చెందాయి. మరో 5 ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చిన సంఘటన నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సూపర్డెంట్ రంజిత్ మాట్లాడుతూ.. కొల్లంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ మొదటి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షించిన అనంతరం సాధారణ ప్రసవంలోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపారు. ఒకరు మగ బిడ్డ ఇద్దరు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నర్సులు ఉన్నారు.
భద్రాద్రి జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. దమ్మపేట వద్ద గుర్తుతెలియని వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు దాదాపు రూ.1.63 కోట్ల కరెంట్ బిల్లులు బకాయి ఉండటంతో ఇటీవలే కరెంట్ కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా శనివారం HCA, TSSPDCL ఎండీ ముషారఫ్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. స్టేడియం కరెంట్ బిల్లుల బకాయిలను ఇన్‌స్టాల్‌మెంట్స్ ప్రకారంగా చెల్లిస్తామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలపగా ఎండీ అంగీకరించినట్లుగా పేర్కొన్నారు.
హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఎస్సారెస్పీ కెనాల్ కట్ట పైన ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
లభ్యమయిందని హనుమకొండ పోలీస్‌స్టేషన్ సీఐ సతీశ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నామని అన్నారు.
HYD ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు దాదాపు రూ.1.63 కోట్ల కరెంట్ బిల్లులు బకాయి ఉండటంతో ఇటీవలే కరెంట్ కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా శనివారం HCA, TSSPDCL ఎండీ ముషారఫ్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. స్టేడియం కరెంట్ బిల్లుల బకాయిలను ఇన్‌స్టాల్‌మెంట్స్ ప్రకారంగా చెల్లిస్తామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలపగా ఎండీ అంగీకరించినట్లుగా పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.