India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుజరాత్‌కు చెందిన పరుశురాం, రజనీత్ భాయ్‌పాల్‌తో పాటు మరో ఐదుగురు 2022లో అర్మడా బజార్ అనే షాపింగ్ మార్ట్‌ను స్థాపించారు. పాలకుర్తిలో ఫ్రాంచైజీ ఏర్పాటు చేస్తామని చెప్పి పాలకుర్తికి చెందిన ఓ ముగ్గురి దగ్గర రూ.30 లక్షలు తీసుకొని ఫ్రాంచైజీ పెట్టకుండా ఢిల్లీకి పారిపోయారని బాధితులు వాపోయారు. వారి ఫిర్యాదుతో పాలకుర్తి పోలీసులు ప్రధాన నిందితుడు భీమ్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం రైల్వేస్టేషన్‌లో గుర్తు తెలియని ప్రయాణికుడు ఫిట్స్ సమస్యతో బాధపడుతుండగా గమనించిన ఆయన వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల శివారులోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డితో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలు, పరిపాలనపై పెడితే బాగుంటుందన్నారు.
ఈ నెల 16న ఖమ్మానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు రానున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటనలో తెలిపారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా ఖమ్మం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నగరంలోని వివిసి ఫంక్షన్ హాల్ (మామిళ్లగూడెం) నందు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.
ఒకప్పుడు పల్లె వెలుగుల బస్సుల రాకపోకలతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడేవి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తుండడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా బస్సులను కుదించడంతో అటు ప్రజలు, రైతులు ఇటు కళాశాల, స్కూల్ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో శాలిగౌరారం మండలంలో అనేక మంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పారు.
HYDకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం లష్కర్‌గూడ సభలో ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో రంగారెడ్డి జిల్లా ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతదన్నారు. నగరానికి ORR, ఎయిర్‌పోర్టు, ఐటీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. డ్రగ్స్, గంజాయి తెచ్చుడు తప్పా BRS చేసిందేమీ లేదన్నారు. దీనిపై మీ కామెంట్?
HYDకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని CM రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం లష్కర్‌గూడ సభలో ‘కాటమయ్య రక్ష కిట్ల’ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో రంగారెడ్డి జిల్లా ప్రపంచంలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్ అవుతదన్నారు. నగరానికి ORR, ఎయిర్‌పోర్టు, ఐటీ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. డ్రగ్స్, గంజాయి తెచ్చుడు తప్పా BRS చేసిందేమీ లేదన్నారు. దీనిపై మీ కామెంట్?
✓ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలో భారీ వర్షం
✓ముషీరాబాద్: వరదల్లో ఇరుక్కున్న కారు.. రిస్క్ చేసి కాపాడిన యువత
✓లష్కర్ గూడ: ఈత మొక్కలు నాటిన సీఎం
✓హయత్ నగర్: బైక్ పై యువత స్టంట్లు
✓కాంగ్రెస్ ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ:KTR
✓మొహర్రం ఉత్సవాలకు HYD చేరుకున్న గజరాజు
> ప్రజాభవన్ నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాలు.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి > నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షం > పీవీఆర్ మాల్‌లో వాటర్ లీక్.. ఆందోళనకు దిగిన ప్రేక్షకులు > రాంనగర్‌లో నలుగురి ప్రాణాలు కాపాడిన యువకులు > బీబీకా ఆలావాను సందర్శించిన మాజీ హోమ్ మంత్రి మహమూద్ అలీ > మేక బ్రతుకు పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ > పంజాగుట్టలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
నగరంలోని వర్ష ప్రభావ ప్రాంతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ పర్యటించారు. నగరంలోని శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌తో పాటు వరద ప్రభావిత ప్రాంతాలైన దుర్గంచెరువు, నెట్రన్ గార్డెన్‌కు వెళ్లారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జలమండలి ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలన్నారు.
Sorry, no posts matched your criteria.