Telangana

News July 14, 2024

KNR:‘టర్మ్ ఇన్సూరెన్స్‌పై 18% GST సరికాదు’

image

జీవిత బీమా ప్రీమియం 18% జీఎస్టీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ), ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ డివిజన్ డిమాండ్ చేసింది. బీమా ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, క్లాస్ 3, 4 కేడర్ ఉద్యోగుల నియామకం, కనీస వేతనాలు రూ.26,000, ఏఐఐఈఏ గుర్తింపు వంటి తీర్మానాలను సమావేశం ఆమోదించింది.

News July 14, 2024

HYD: రేపు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు.. హై టెన్షన్

image

నిరుద్యోగుల డిమాండ్‌ల సాధన కోసం రేపు విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య, బీసీ జన సభ‌లు‌ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ప్రతి ఒక్క నిరుద్యోగి పాల్గొని నిరసన తెలియజేయాలని బీసీ నాయకులు కోరారు. రేపటి కార్యక్రమానికి భారీ ఎత్తున సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో‌ పోలీసులు అప్రమత్తం అయ్యారు. రేపటి సెక్రటేరియట్‌ ముట్టడి పిలుపుతో నగరంలో హైటెన్షన్ నెలకొంది.

News July 14, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

✒ముగిసిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు.. విజేతగా మహబూబ్ నగర్
✒PUలో టైక్వాండో క్రీడలు
✒ప్రజల కోసం మొదటి కేసు నేనే ఎదుర్కొంటా: మాజీమంత్రి నిరంజన్ రెడ్డి
✒పలుచోట్ల కురిసిన వర్షాలు
✒జగన్నాథ రథోత్సవం.. పాల్గొన్న ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
✒WNPT:వడ్డెగిరిలో 30ఏళ్ల తర్వాత మళ్లీ పీర్ల పండుగ
✒ఘనంగా ఎంపీ మల్లు రవి జన్మదిన వేడుకలు
✒ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
✒కొనసాగుతున్న మొహర్రం వేడుకలు

News July 14, 2024

మెదక్: బైక్, కారు ఢీకొని ఒకరి మృతి

image

రామాయంపేటలో హైవే- 44వ వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణఖేడ్‌కు చెందిన రంగమ్మ(70) మృతిచెందగా, బాబురావు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News July 14, 2024

ADB: రానున్న 5 రోజులు భారీ వర్షాలు

image

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీమ్ జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రేపు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్ష సూచన ఉందని ప్రకటించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

News July 14, 2024

నాగర్‌కర్నూల్ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స 

image

నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స విజయవంతంగా చేశారు. జిల్లాకు చెందిన యువకుడు చందు(18) పుట్టుకతోనే నాలుక అతుక్కుని ఉండడంతో మాట్లాడలేని పరిస్థితి. బీద కుటుంబం కావడంతో దీనిపై తల్లిదండ్రులు సూపరింటెండంట్‌ను కలిశారు. పరీక్షించిన వైద్యులు ప్రొ. డాక్టర్ గాయత్రీ, డాక్టర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో అతుక్కున్న నాలుకకు విజయవంతంగా సర్జరీ చేసినట్లు చెప్పారు.

News July 14, 2024

HYDలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశాలు

image

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్‌లు, EVDM టీమ్‌లతో మేయర్ గద్వాల విజయ లక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

News July 14, 2024

గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన జిల్లా ఎస్పీ

image

నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆదివారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డికి జిల్లా ఎస్పీ పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా ఎస్పీకి సుఖేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

News July 14, 2024

BREAKING: కాంగ్రెస్ గూటికి ఆదిలాబాద్ BJP కౌన్సిలర్

image

అదిలాబాద్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. మున్సిపల్ వార్డుకు చెందిన బీజేపీ కౌన్సిలర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం పట్టణంలోని ప్రజాసేవ భవనంలో 25వ వార్డు బీజేపీ కౌన్సిలర్ పిన్నవార్ రాజేశ్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

News July 14, 2024

రేపు కరీంనగర్‌లో మంత్రి పొన్నం పర్యటన

image

కరీంనగర్‌లో సోమవారం పలు కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొంటారు. ఉదయం 10.30గంటలకు శాతవాహన యూనివర్సిటీ సమీపంలో వనమహోత్సవం కార్యక్రమంలో, మధ్యాహ్నం 1:00 గంటలకు సత్యనారాయణ స్వామి దేవాలయం, రాంనగర్‌లో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరిగే జగన్నాథుడి రథయాత్ర ప్రారంభిస్తారు.