India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేపు హనుమకొండకు రానున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ సమీకృత జిల్లా కార్యాలయ సమూహం (ఐడీవోసీ)లో రైతు భరోసా పై వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వారితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, సీతక్క పాల్గొననున్నట్లు తెలిపారు.
కల్వకుర్తిలోని మినీ స్టేడియంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో 10 ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. చివరి రోజు ఫుట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గుణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటి బహుమతి MBNR, రెండో బహుమతి నిజామాబాద్, మూడో బహుమతి ఖమ్మం జిల్లా గెలుపొందగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఇటలీ దేశానికి చెందిన జెన్నీ, డానియల్‌లు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం సందర్శించారు. నిర్మాణశైలిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నంది విగ్రహం వద్ద ఫోటో తీయించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.
కరీంనగర్ పట్టణంలోని ఓ హోటల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని ఆయన క్లాస్‌మేట్స్ ఆదివారం కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఎన్నో ఏళ్లు కలిసి చదువుకున్న తమ మిత్రుడు కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉండడం చూసి గర్విస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం బీజేపీ అధ్యక్షుడు బండం మల్లారెడ్డి, క్లాస్‌మేట్స్ పాల్గొన్నారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని తన వ్యక్తి గత సహాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించనున్న 75వ వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరిగే పూరీ జగన్నాథ స్వామి రథయాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
పాలమూరు యూనివర్సిటీలో ఆదివారం టైక్వాండో ఉమ్మడి జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ క్రీడల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు 14 నియోజకవర్గాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. టైక్వాండో మాస్టర్ బాబూలాల్, PD శ్రీనివాసులు మాట్లాడుతూ.. సబ్ జూనియర్స్,సీనియర్స్ ఒక క్యాడర్ పద్ధతిలో మహిళలకు, పురుషులకు వేరువేరుగా పోటీలు నిర్వహించామన్నారు. విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశామన్నారు.
కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ, వీఎల్ఈ)ల కమిటీ గౌరవ అధ్యక్షుడిగా పాలకుర్తికి చెందిన మాసంపల్లి నాగయ్య, సహాయ కార్యదర్శిగా రాపోలు లక్ష్మణ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని కామన్ సర్వీస్ సెంటర్ కార్యాలయంలో వీఎల్ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు.
రఘునాథపాలెం: హర్యాతండ వద్ద మే 28న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆదివారం ACP రమణమూర్తి వివరాలు వెల్లడించారు. బాబాజీతండాకు చెందిన నేరస్తుడు బోడ ప్రవీణ్ HYDలో వైద్యుడిగా పని చేస్తూ కేరళకు చెందిన యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరి అక్రమ సంబంధానికి భార్య పిల్లలు అడ్డు వస్తున్నారన్న నేపంతో భార్య పిల్లలను హత్య చేసి, రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించాడని పేర్కొన్నారు.
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. శని ఆదివారం సెలవులు కావడంతో మార్కెట్ బంద్ అయింది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం అవుతాయి.
NLG: పట్టణ ప్రజలు కలుషిత తాగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్న సాగర్ వాటర్‌లో పురుగులు, చెత్త చెదారం వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పానగల్ వద్ద మిషన్ భగీరథ నీళ్లను ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ సరఫరా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.