Telangana

News September 5, 2024

HYD: హైడ్రాకు హైకోర్టు నిషేధాజ్ఞలు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి పరిధి హస్మత్‌పేటలోని 13.17 ఎకరాలకు సంబంధించి NVN కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌పై తక్షణ చర్యలు తీసుకోకుండా… హైడ్రా, ఇతర అధికారులపై తెలంగాణ హైకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసింది. పూర్తి విచారణ చేపట్టిన అనంతరం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.

News September 5, 2024

MBNR: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

image

తొట్టిలో పడి చిన్నారి మృతి చెందింది. స్థానికుల సమాచారం.. గండీడ్ మం. రుసుంపల్లికి చెందిన హరి దంపతులకు ఇద్దరు పిల్లలు. బుధవారం పిల్లలను తాత వద్ద వదిలి వారు పొలానికి వెళ్లారు. కూతురు గౌతమి ఆడుకుంటూ వెళ్లి పశువులకు నీళ్లు తాగేందుకు నిర్మించిన తొట్టిలో పడింది. పాపను బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 5, 2024

కొత్తగూడెం: డివైడర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందిర కాలనీ వద్ద ఈరోజు తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి గ్రామానికి చెందిన శశికాంత్ రెడ్డి(17) బైక్‌పై పాల్వంచ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

News September 5, 2024

నేడు నల్గొండకు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి

image

BJP సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు ప్రథమ వర్ధంతి సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలో నిర్వహించనున్న సంస్మరణ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి రానున్నారు. నల్గొండ నుంచి ఎంపీగా పలుమార్లు పోటీ చేసిన ఆయన గవర్నర్ హోదాలో రానుండటంతో జిల్లా BJP అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News September 5, 2024

HYD: రేవంత్ కుట్రలో ఎస్సీలు సమిధలవుతున్నారు: RSP

image

గురుకుల విద్యపై ప్రస్తుత ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస నేత RS. ప్రవీణ్ కుమార్ వాపోయారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడారు. ‘గురుకులాల్లోని 2,000 మంది టీచర్లను తొలగించడంతో విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారింది. ఈ కుట్ర నుంచి గురుకులాలను కాపాడుకోవాలి. కేసీఆర్ హయాంలో నాణ్యమైన గురుకుల విద్య అందించారు. ప్రభుత్వం కుట్రకు ఎస్సీలే సమిధలవుతున్నారు’ అని సీఎం ఫైర్ అయ్యారు.

News September 5, 2024

HYD: రేవంత్ కుట్రలో ఎస్సీలు సమిధలవుతున్నారు: RSP

image

గురుకుల విద్యపై ప్రస్తుత ప్రభుత్వం కుట్ర చేస్తోందని భారాస నేత RS. ప్రవీణ్ కుమార్ వాపోయారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మాట్లాడారు. ‘గురుకులాల్లోని 2,000 మంది టీచర్లను తొలగించడంతో విద్యార్థుల భవిత అగమ్యగోచరంగా మారింది. ఈ కుట్ర నుంచి గురుకులాలను కాపాడుకోవాలి. కేసీఆర్ హయాంలో నాణ్యమైన గురుకుల విద్య అందించారు. ప్రభుత్వం కుట్రకు ఎస్సీలే సమిధలవుతున్నారు’ అని సీఎం ఫైర్ అయ్యారు.

News September 5, 2024

HYD: నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

image

నగరంలోని ధూల్‌పేట నుంచి వినాయక విగ్రహాల తరలింపు దృష్ట్యా నేటి నుంచి 7వ తేదీ రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు బుధవారం తెలిపారు. గణేశ్ విగ్రహాలు తీసుకెళ్లే వాహనాలు ఎంజే మార్కెట్ బ్రిడ్జి నుంచి గాంధీ విగ్రహం వైపు (ధూల్పేట) వరకు మాత్రమే అనుమతిస్తారు. ఎంజే బ్రిడ్జి నుంచి పురానాపూల్ వరకు ఇతర వాహనాలు అనుమతించరు.

News September 5, 2024

జగిత్యాల: పెళ్లైన 17 రోజులకే నవ వధువు ఆత్మహత్య

image

పెళ్లైన 17 రోజులకే నవ వధువు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. SI నరేశ్ ప్రకారం.. మల్యాల మం. మ్యాడంపల్లికి చెందిన ఉదయ్‌కిరణ్‌కు తక్కళ్లపల్లికి చెందిన భాగ్యలక్ష్మితో ఆగస్టు 18న పెళ్లయింది. కాగా, ఉదయ్ HYDలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు భాగ్యలక్ష్మిని స్వగ్రామం తీసుకురాగా ‘నేను ఎవరి కారణంగా చనిపోవట్లేదు.. నాకే ఈ లోకంలో ఉండటం ఇష్టం లేదు’ అని చేతిపై రాసి ఉరేసుకుంది.

News September 5, 2024

వరంగల్: దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ మృతి

image

WGL జిల్లాలో విషాదం నెలకొంది. దేశానికి కాంస్యం తీసుకొచ్చిన దీప్తి జీవాంజి ఫస్ట్ కోచ్ బుధవారం మృతి చెందారు. RDF స్కూల్‌లో PETగా పనిచేసిన వెంకటేశ్వర్లు మొదటగా దీప్తి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. దీప్తి విజయం వెనక ఉన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. గత 6-7 ఏళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. జాతీయ స్థాయి క్రీడల్లో ఎందరో విద్యార్థులు రాణించడానికి ఈయన కృషి చేశారు. SHARE

News September 5, 2024

MBNR: ఇక నుంచి.. పాఠశాలల్లో వినూత్న కార్యక్రమం

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల నుంచి ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం అదనపు సమయాన్ని పాఠశాలల్లో గడుపుతూ తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు అందజేయనున్నారు. ఇప్పటికే విద్యాశాఖ యంత్రాంగం DEOలకు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలోని 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,708 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు పాఠశాలలో విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.