Telangana

News July 14, 2024

NLG: కలుషిత నీరు తాగేదెట్ల..?

image

NLG: పట్టణ ప్రజలు కలుషిత తాగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకోసారి సరఫరా చేస్తున్న సాగర్ వాటర్‌లో పురుగులు, చెత్త చెదారం వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు, పాలకవర్గానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పానగల్ వద్ద మిషన్ భగీరథ నీళ్లను ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్ సరఫరా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.

News July 14, 2024

సిద్దిపేట పేరు నిలబెట్టారు.. MLAగా గర్వంగా ఉంది: హరీశ్ రావు

image

పది ఫలితాలు గర్వకారణమని, కన్న తండ్రి లెక్క ఆనందంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశమని, ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వరుసగా ఐదు సార్లు అగ్రగామిగా నిలిచి సిద్దిపేట పేరు నిలబెట్టారని అభినందించారు.

News July 14, 2024

జగిత్యాల: పులి వేషం వేసి గుండెపోటుతో మృతి

image

జగిత్యాల జిల్లా మల్యాలలో పీర్ల పండుగలో విషాదం చోటుచేసుకుంది. యువకుడు బేకం లక్ష్మణ్(25) పులి వేషంలో నృత్యం చేశాడు. మధ్యాహ్నం ఇంటికెళ్లి ఛాతిలో నొప్పి వస్తుంది అని చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. మార్గమధ్యంలో యువకుడు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, బాబు, పాపం ఉన్నారు.

News July 14, 2024

WGL: SI కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం

image

నల్లబెల్లి మండలం నారక్క పేట గ్రామానికి చెందిన అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఇటివల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శ్రీనివాస్ చిత్రపటానిక ఎస్సై బ్యాచ్‌మేట్స్ (2014 SI బ్యాచ్) ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.

News July 14, 2024

బీబీపేటలో కానిస్టేబుల్, హోంగార్డు సస్పెండ్

image

కానిస్టేబుల్, హోంగార్డ్ సస్పెండ్ అయిన ఘటన బీబీపేటలో చోటుచేసుకుంది. బీబీపేట ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ నవీన్, హోంగార్డు రవి కలిసి 3 రోజుల క్రితం రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వ్యక్తితో కలిసి వాహనంలో మద్యం తాగి కారుతో పోలీస్ స్టేషన్ గేటును ఢీకొన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి ఏఎస్ఐ ప్రభాకర్‌ను బదిలీ చేసి కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు.

News July 14, 2024

అనంతగిరికి పోటెత్తిన హైదరాబాదీలు

image

అనంతగిరికి పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో వికారాబాద్ జిల్లాకు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం ప్రఖ్యాత శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టు‌లో బోటింగ్‌ ఉండడంతో‌ టూరిస్టులతో సందడిగా మారింది.

News July 14, 2024

అనంతగిరికి పోటెత్తిన హైదరాబాదీలు

image

అనంతగిరికి పర్యాటకులు పోటెత్తారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండడంతో వికారాబాద్ జిల్లాకు భారీగా తరలివచ్చారు. ఆదివారం ఉదయం ప్రఖ్యాత శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. కోట్‌పల్లి ప్రాజెక్టు‌లో బోటింగ్‌ ఉండడంతో‌ టూరిస్టులతో సందడిగా మారింది.

News July 14, 2024

సంగారెడ్డిలో రేపు ప్రజావాణి

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 15న ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా సమస్యలపై వినతి పత్రాలను స్వీకరిస్తామని చెప్పారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

News July 14, 2024

ప్రతి పారిశ్రామికవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలి: బీఎంఎస్

image

కనీసం పెన్షన్లు రూ.5000లకు పెంచాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుక్ మాండవియాకు ఆదివారం న్యూఢిల్లీలో జాతీయ బీఎంఎస్ ప్రతినిధులు తెలిపారని జిల్లా కార్యదర్శి పి. మోహన్ రెడ్డి సంగారెడ్డిలోని జిల్లా కార్యాలయంలో తెలిపారు. సీలింగ్ పెంపు వల్ల అధిక సంఖ్యలో కార్మికులకు పథకాలు వర్తిస్తాయని, ప్రతి పారిశ్రామిక వాడలో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారని వారు చెప్పారు.

News July 14, 2024

KA పాల్ ఆశీస్సులు తీసుకున్న NGKL ఎంపీ మల్లురవి

image

నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి నేడు తన పుట్టినరోజు సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆశీస్సులు పొందారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధిగా పనిచేసే ప్రజల మన్ననలు పొందాలని పాల్ సూచించినట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మల్లురవి జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి.