Telangana

News March 17, 2024

బీజేపీ గెలుపులో యువత కీలకపాత్ర పోషించాలి: డీకే అరుణ

image

మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 600 మంది యువకులు ఆదివారం మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ… పార్టీ గెలుపులో యువత కీలకపాత్ర పోషించాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వివరించాలని సూచించారు. ఈ దేశం యువత భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్నారు.

News March 17, 2024

గాంధారిలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

మండలంలోని గండివేట్ గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గాంధారి స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పెద్దాపురం రాజు (18) తన వ్యవసాయ పొలం వద్ద వరి పంటకు నీళ్లు పారించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 17, 2024

ములుగు జిల్లాలో 144 సెక్షన్- ఎస్పీ

image

ములుగు జిల్లాలో రేపు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శబరీశ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. పరీక్షా కేంద్రాల చుట్టూ గుంపులుగా కనిపిస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పి హెచ్చరించారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్ షాపులను సైతం మూసివేయాలని కోరారు. కాగా జిల్లాలో 3,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

News March 17, 2024

ప్రజావాణి రద్దుకు ప్రజలు సహకరించాలి: కలెక్టర్

image

పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంత్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, అలాగే పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసే వరకు, వచ్చే జూన్ 6 వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదన్నారు.

News March 17, 2024

SRD: భారీ వర్షం.. పిడుగుపడి ఒకరి మృతి

image

కంగ్టి మండలం భీమ్రాలో ఆదివారం వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో పిడుగు పడింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన శిరుగొండ (45) మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ‘పొలం పనుల్లో ఉండగా వర్షం పడింది. రేకుల షెడ్డు కింద తలదాచుకోగా ఒక్కసారిగా పిడుగు పడింది’ అని స్థానికులు PSకు సమాచారం ఇచ్చారు. కంగ్టి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 17, 2024

వాంకిడి: సైబర్ వలలో చిక్కి మోసపోయిన వ్యక్తి

image

మండలంలోని పిప్పర గొంది గ్రామానికి చెందిన రాథోడ్ చంద్రకాంత్ సైబర్ వలలో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో కారు ధర తక్కువగా ఉన్నదని ప్రకటన రావడంతో రూ.1,43,000 చెల్లించినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. వారి నుంచి ఎలాంటి సమాదానం రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

News March 17, 2024

HYD: KCRను మోసం చేయడం సిగ్గుచేటు: ఆనంద్‌ గౌడ్

image

గోషామహల్‌లో BRS అభ్యర్థిగా పోటీ చేసిన నందకిశోర్ కాంగ్రెస్‌లోకి వెళ్లడం సరికాదని ఆ పార్టీ నేత ఆనంద్‌ గౌడ్‌ అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. స్వలాభం కోసం పార్టీ మారుతున్న వ్యక్తిని ఎంత నీచంగా అభివర్ణించినా తక్కువేనని అన్నారు. లోకల్ లీడర్ కాకపోయినా MLA టికెట్, ఆయన కూతురికి కార్పొరేటర్ టికెట్ ఇచ్చిన KCRను మోసం చేయడం సిగ్గుచేటు అంటూ ఆనంద్‌ మండిపడ్డారు.

News March 17, 2024

జనగామ: మాజీ ఎమ్మెల్యే కుమారుడి రాజీనామా

image

జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత పదేళ్లుగా పార్టీ కోసం ఎంతో శ్రమించినా సరైన అవకాశం రాలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరలో రాజకీయ భవిష్యత్ గురించి వెల్లడిస్తానన్నారు.

News March 17, 2024

ఉమ్మడి జిల్లాలో 180 మందికి GOOD NEWS

image

MBNR:2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నత అధికారుల ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో 180 మంది అభ్యర్థులను అప్పట్లో అర్హులుగా గుర్తించారు. MBNR-45, NGKL-40,WNPT-30, GDWL, NRPT జిల్లాల్లో 30 మంది వంతున అభ్యర్థులు ఉండగా.. వివిధ పోటీ పరీక్షల్లో కొందరు ఉద్యోగాలు సాధించారు. కొత్త జిల్లాల వారీగా వారి వివరాలు వెలికితీస్తున్నారు.

News March 17, 2024

ఎల్లారెడ్డిపేట: గల్ఫ్‌ పంపిస్తానని మోసం

image

ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి, సింగారం,గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఐదుగురిని 15 రోజులలో గల్ఫ్‌ పంపిస్తానని గల్ఫ్ ఏజెంట్ మోసం చేయగా బాధితులు లబోదిబోమంటున్నారు. యువకులను విదేశాలకు పంపిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.80వే ల చొప్పున సుమారు రూ.4 లక్షలు తమ వద్ద వసూలు చేశాడని.. రెండు నెలలు కావస్తున్న ఇంతవరకు తమను పంపించలేదని సెల్ ఫోన్ చేస్తే ఎత్తడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.