Telangana

News July 14, 2024

బాసర: కేంద్ర మంత్రికి అమ్మవారి చిత్రపటం బహుకరణ

image

బాసర మండలానికి చెందిన బీజేపీ నాయకులు కరీంనగర్‌లోని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారి చిత్రపటమును, ప్రసాదాన్ని అందించారు. త్వరలో బాసర అమ్మవారిని దర్శించుకుంటానని ఆయన తెలిపారు. ఇందులో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయినాథ్ పటేల్, కార్యకర్తలు నితిన్, మేకల బన్నీ, గణేష్ ఉన్నారు.

News July 14, 2024

KNR: ఈనెల 18 నుంచి 5 కేంద్రాల్లో DSC పరీక్షలు

image

జిల్లాలో DSC పరీక్షను ఆన్‌లైన్ ద్వారా ఈనెల 18 నుంచి వచ్చేనెల 5 వరకు 5 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు DEO జనార్ధన్ రావు తెలిపారు. KNRలోని అల్ఫోర్స్ మహిళ డిగ్రీ కళాశాల, వాణినికేతన్ డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాల, ఎల్ఎండి కాలనీ లోని ion digital zone వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాల, హుజూరాబాద్ మండలం సింగపూర్‌లోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలున్నాయని చెప్పారు.

News July 14, 2024

పాలేరు జలాశయం వద్ద తండ్రి కుమార్తె ఆత్మహత్యాయత్నం

image

పాలేరు జలాశయంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్, అతని రెండేళ్ల కూతురి ప్రాణాలను కూసుమంచి పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూకోల్ట్ కానిస్టేబుల్ బ్రహ్మం కాపాడాడు. జీళ్ళచెరువుకు చెందిన జంపాల నరేశ్ అతని భార్య గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురై నరేశ్ కూతురితో పాలేరు జలాశయం వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు 100కు డయల్ చేసి చెప్పాడు. పోలీసులు వెంటనే వెళ్లి కాపాడారు.

News July 14, 2024

HYD: నిజాం నాటి నుంచి నేటి వరకు!

image

నిజాం రాష్ట్ర ప్రజల కోసం 1932లో HYD నిజాం నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ NSR-RTD పేరిట మొదటిసారిగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రారంభించినట్లు TSIC తెలిపింది. అప్పట్లో 27 బస్సులు, 166 ఉద్యోగులతో మొదలైన రవాణా వ్యవస్థ.. TGSRTC గా నేడు ఏకంగా 9,000 పైగా బస్సులతో, 44 వేల మందికి పైగా ఉద్యోగులతో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను రోజు గమ్య స్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపింది.

News July 14, 2024

HYD: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ..?: KTR

image

HYD నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు రోడ్ల పై నిరసన ధర్నాలు చేపట్టడం పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నిరుద్యోగ మోసగాళ్లు, మోసపు వాగ్దానాలు చేసి KCR ప్రభుత్వంపై రెచ్చగొట్టారన్నారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఒక్క నోటిఫికేషన్, ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదన్నారు. మీరు ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగులు ఎక్కడ..? అని X వేదికగా ప్రశ్నించారు.

News July 14, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 25.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా ద్యాగదొడ్డి 12.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి 5.3 మి.మీ, నారాయణపేట జిల్లా చిన్నజట్రం 4.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 14, 2024

HYD: నిజాం నాటి నుంచి నేటి వరకు!

image

నిజాం రాష్ట్ర ప్రజల కోసం 1932లో HYD నిజాం నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ NSR-RTD పేరిట మొదటిసారిగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రారంభించినట్లు TSIC తెలిపింది. అప్పట్లో 27 బస్సులు, 166 ఉద్యోగులతో మొదలైన రవాణా వ్యవస్థ.. TGSRTC గా నేడు ఏకంగా 9,000 పైగా బస్సులతో, 44 వేల మందికి పైగా ఉద్యోగులతో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను రోజు గమ్య స్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపింది.

News July 14, 2024

NZB: సౌదీలో నమ్మించి టోకరా వేసిన జిల్లా వాసి

image

కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌కు చెందిన రాజాగౌడ్ సౌదీలో పనిచేసుకుంటూ కొన్ని నెలల క్రితం హుండి(వడ్డీ) వ్యాపారం మొదలుపెట్టాడు. అక్కడి బ్యాంక్‌లో ఇచ్చే రేటు కంటే ఎక్కువ రేటును ఇచ్చి గల్ఫ్ బాధితులను నమ్మించాడు. నమ్మిన నిజామాబాద్, కరీంనగర్, మెట్టుపల్లి, జగిత్యాల, కోరుట్ల, నిర్మల్‌కు చెందిన గల్ఫ్ కార్మికులు రూ.4 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వగా వాటితో పరారయ్యాడు.

News July 14, 2024

MNCL: అత్తను హతమార్చిన అల్లుడు

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి దారుణం జరిగింది. కుటుంబ వ్యవహారాల విషయంలో తలెత్తిన వివాదంలో అత్తను అల్లుడు హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం..స్థానిక సున్నంబట్టివాడకు చెందిన నెల్లి విజయ కూతురు మాళవికకు ఇదే ప్రాంతానికి చెందిన శాతం వెంకటేశ్‌తో వివాహమైంది. వారం రోజులుగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో వెంకటేష్ తన అత్త విజయపై కత్తితో దాడి చేసి హతమార్చి తాను సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

News July 14, 2024

భద్రాచలం రామయ్యకు సువర్ణ పుష్పార్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.