India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 25.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా ద్యాగదొడ్డి 12.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి 5.3 మి.మీ, నారాయణపేట జిల్లా చిన్నజట్రం 4.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
నిజాం రాష్ట్ర ప్రజల కోసం 1932లో HYD నిజాం నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ NSR-RTD పేరిట మొదటిసారిగా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రారంభించినట్లు TSIC తెలిపింది. అప్పట్లో 27 బస్సులు, 166 ఉద్యోగులతో మొదలైన రవాణా వ్యవస్థ.. TGSRTC గా నేడు ఏకంగా 9,000 పైగా బస్సులతో, 44 వేల మందికి పైగా ఉద్యోగులతో సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను రోజు గమ్య స్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపింది.
కమ్మర్పల్లి మండలం బషీరాబాద్‌కు చెందిన రాజాగౌడ్ సౌదీలో పనిచేసుకుంటూ కొన్ని నెలల క్రితం హుండి(వడ్డీ) వ్యాపారం మొదలుపెట్టాడు. అక్కడి బ్యాంక్‌లో ఇచ్చే రేటు కంటే ఎక్కువ రేటును ఇచ్చి గల్ఫ్ బాధితులను నమ్మించాడు. నమ్మిన నిజామాబాద్, కరీంనగర్, మెట్టుపల్లి, జగిత్యాల, కోరుట్ల, నిర్మల్‌కు చెందిన గల్ఫ్ కార్మికులు రూ.4 కోట్లకు పైగా డబ్బులు ఇవ్వగా వాటితో పరారయ్యాడు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి దారుణం జరిగింది. కుటుంబ వ్యవహారాల విషయంలో తలెత్తిన వివాదంలో అత్తను అల్లుడు హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం..స్థానిక సున్నంబట్టివాడకు చెందిన నెల్లి విజయ కూతురు మాళవికకు ఇదే ప్రాంతానికి చెందిన శాతం వెంకటేశ్‌తో వివాహమైంది. వారం రోజులుగా జరుగుతున్న గొడవల నేపథ్యంలో వెంకటేష్ తన అత్త విజయపై కత్తితో దాడి చేసి హతమార్చి తాను సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎస్సారెస్పీలోకి 1,852 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 90.323 టీఎంసీలకు ప్రస్తుతం 12.536 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 494 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 6.775 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేటకు చెందిన శేఖర్(27) మృతదేహం స్వగ్రామానికి చేరింది. షార్జాలో 20 రోజులక్రితం శేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు విషయాన్ని MLC జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో GWPC అధ్యక్షులు నరసింహ, రాము.. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారు.
పాలమూరు యూనివర్సిటీకి రానున్న రెండు సంవత్సరాల్లో రూ.100 నిధులు మంజూరు కానున్నాయి. ఇందులో కేంద్రం రూ.60 కోట్లు రాష్ట్రం రూ.40 కోట్లు భరిస్తాయి. ఈ నిధుల్లో పరిశోధనకు రూ.13 కోట్లు, సాఫ్ట్వేర్ అభివృద్ధికి రూ.3 కోట్లు, మరమ్మతులకు రూ.5 కోట్లు వెచ్చించనున్నారు. మిగిలిన నిధులను అమ్మాయిల ఈతకొలను, ఇండోర్ స్టేడియం, ఆసుపత్రి, పరిశోధన భవనాల కోసం ఖర్చు చేస్తారు.
కారు చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిమ్మాజిపేటలో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై నరేందర్ రెడ్డి వివరాలు.. గోపాల్పేట మండలం బుద్ధారం లక్ష్మీ తండాకు చెందిన సంతోష్ (30) భార్య శారదతో కలిసి HYD నుంచి స్వగ్రామానికి సొంత కారులో వెళుతుండగా.. తిమ్మాజిపేట మలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. సంతోష్ అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య శారదకు స్వల్ప గాయాలయ్యాయి.
దేవాదాయ, ధర్మాదాయ శాఖలో బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో 630 దేవాలయాలు ఉండగా, 250 మంది వరకు ఉద్యోగులు, అర్చకులు పని చేస్తున్నారు. దేవాలయాల్లో 6ఏ విభాగంలో 19 ఉండగా, 6బీ కింద 41, 6సిలో 570 దేవాలయాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ దేవాలయాల్లో ధూపదీప నైవేద్య పథకం కింద ఎంపిక చేసిన ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.