India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాల్వంచ మండలం భవానిపేటకు చెందిన నారెడ్డి వెంకట్ రెడ్డి కూతురు రాధవి అమెరికాలో ఎంఎస్ చేస్తుంది. వెంకట్ రెడ్డికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ కూతురు కేసులో చిక్కుకుందని, రూ.2 లక్షలు పంపాలని ఫోన్ చేశారు. వెంకట్ రెడ్డి కూతురుకు ఫోన్ చేయగా కలవకపోవడంతో భయానికి గురై రూ.లక్ష రూపాయలు మూడు విడతల్లో పంపాడు. మళ్లీ డబ్బుల కోసం డిమాండ్ చేయగా అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఏ ఫైనల్ పరీక్షలో కరీంనగర్ జిల్లా వాసి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన సముద్రాల వికాస్ 600 మార్కులకు గానూ 350 సాధించి 58.33శాతంతో ఉత్తీర్ణ పొందారు. అయితే వీరి సొంతూరు హుజూరాబాద్ కాగా.. కొన్నేళ్లుగా కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో ఉంటున్నారు. సీఏ ఫౌండేషన్ 2019లో, సీఏ ఇంటర్ 2020, సీఏ ఫైనల్ 2024లో పూర్తి చేశారు. దీంతో పలువురు వికాస్‌ను అభినందిస్తున్నారు.
వరద ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జలపాతం సందర్శనకు వస్తున్న పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా వాజేడు పోలీసుల ఆధ్వర్యంలో ప్లెక్సీలతో సూచనలు చేశారు. వెంకటాపురం సీఐ బండారి కుమార్, వాజేడు ఎస్ఐ హరీశ్, పోలీస్ సిబ్బంది బొగత జలపాతం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చే పర్యాటకులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.
మహిళపై గొడ్డలితో దాడి చేసిన ఘటన నారాయణపురం(M) వాయిల్లపల్లిలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన సుభాశ్ భూమి పక్కన చెన్నకేశవ, మారయ్య, లింగస్వామి, ఎర్రయ్యల భూమి ఉంది. కొద్ది రోజులుగా సుభాశ్ ఫెన్సింగ్ వేసుకున్న భూమిలో అర ఎకరం భూమి తమదంటూ గొడవ పడుతున్నారు. శనివారం ఫెన్సింగ్ కడ్డీలను ధ్వంసం చేసే సమయంలో సుభాశ్ భార్య అడ్డుకునేందుకు వెళ్లగా పద్మపై నలుగురు గొడ్డలితో దాడి చేశారు. కేసు నమోదైంది.
ఖమ్మం జిల్లాలో హీరోయిన్ సంయుక్త మేనన్ సందడి చేశారు. శనివారం ఆమె జిల్లాలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చింది. దీంతో ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమెతో సెల్పీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలేశ్వరుని దర్శనానికి మహబూబ్ నగర్ రీజియన్‌లోని MBNR, NGKL డిపోల నుంచి 10 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం వి.శ్రీదేవి తెలిపారు. ఈ నెల 19న రాత్రి రెండు డిపోల నుంచి బస్సులు అరుణాచలానికి బయలుదేరుతాయన్నారు. MBNR ప్రాంత ప్రయాణికులు 94411 62588, MGKL ప్రాంతం వాళ్లు 83092 14790 నంబర్లలో సంప్రదించాలని, పెద్దలకు రూ.3,600, పిల్లలకు రూ.2,400 ధర నిర్ణయించామన్నారు.
అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి వివాదాల్లో అన్న ప్రాణం తీసిన ఘటన ఆర్మూర్ మండలంలో జరిగింది. మామిడిపల్లికి చెందిన నర్సయ్య, గంగాధర్ అన్నదమ్ములు వీరి మధ్య శుక్రవారం ప్లాట్ల విషయంలో గొడవ జరగగా ఆగ్రహంతో గంగాధర్ నర్సయ్యపై కర్రతో దాడి చేశాడు. క్షతగాత్రుడిని కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నర్సయ్య శనివారం మృతి చెందాడు. కుటుంబీకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
తలమడుగు మండలంలోని కొత్తూరు శివారులో చిరుతపులి దాడిలో మేకపోతు మృతి చెందింది. స్థానికుల వివరాలు.. బాతురి మల్లేశ్ మేకల మందను శనివారం మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. చిరుత పులి దాడి చేసి మేకను హతమార్చింది. దీని విలువ రూ.10 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. కాగా.. గత 15 రోజుల క్రితం మేకల మందపై దాడి చేయగా కాపరుల అరుపులతో చిరుతపులి విడిచిపెట్టి వెళ్లింది.
బల్దియా క్షేత్రస్థాయి, మినిస్ట్రీ రియల్ ఉద్యోగుల బదిలీ జాబితా సిద్ధమైంది. ఈనెల 20లోగా 40 శాతం ఉద్యోగులు ఇతర మున్సిపాలిటీలకు వెళ్లనున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని ప్రాంతీయ సంచాలకు షహీద్ మసూద్‌కు పంపించారు. 16 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్, మరో 10 మంది నాలుగో తరగతి ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తారని క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 4గం.కు హుస్నాబాద్ నిర్వహించే బోనాల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బీజేపి నేత సంపత్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Sorry, no posts matched your criteria.