Telangana

News April 7, 2024

హైదరాబాద్‌: రోడ్ల మీద చెత్త వేస్తే FINE

image

ఇంటింటి చెత్త సేకరణను 100% విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నగరవాసులకు సూచించారు. స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వకుండా, రోడ్లపై పడేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. వారం రోజుల బస్తీ కార్యాచరణతో సాధ్యమైన ఫలితాలను వివరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి సమావేశాలతో 1,87,752 ఇళ్ల యజమానులు స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వట్లేదని.. ఇకనైనా‌ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.

News April 7, 2024

హైదరాబాద్‌: రోడ్ల మీద చెత్త వేస్తే FINE

image

ఇంటింటి చెత్త సేకరణను 100% విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నగరవాసులకు సూచించారు. స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వకుండా, రోడ్లపై పడేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. వారం రోజుల బస్తీ కార్యాచరణతో సాధ్యమైన ఫలితాలను వివరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి సమావేశాలతో 1,87,752 ఇళ్ల యజమానులు స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వట్లేదని.. ఇకనైనా‌ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.

News April 7, 2024

అమరచింత: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

అమరచింత మండలంలోని ఈర్లదిన్నె గ్రామానికి చెందిన జయమ్మ(45) శనివారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. ఈనెల 4న ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.

News April 7, 2024

కరీంనగర్: ‘బయటకు రావొద్దు’

image

కరీంనగర్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. వీణవంకలో 44℃, కొత్తపల్లి 43.8, జమ్మికుంట 43.7, కొత్తగట్టు 43.6, వెదురుగట్టు 42.9, మల్యాల 42.6, ఇందుర్తి 42.5, ఆర్నకొండ 42.4, దుర్షెడ్‌ 42.1, వెంకేపల్లి 41.9, ఆసిఫ్‌నగర్‌ 42, గంగిపల్లి 41.7, బోర్నపల్లి 41.7, చింతకుంట 41.5, తనుగుల 41.5, కరీంనగర్ 41.5, పోచంపల్లి 41.4, రేణికుంట 40.9, నుస్తులాపూర్ 41℃గా నమోదైంది. అవసరమైతేనే బయటకు రావాలని వైద్యులు సూచించారు.

News April 7, 2024

బాసరలో విగ్రహాలు ధ్వంసం

image

బాసర మండలంలోని ఓ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న చింతామణి గణపతి ఆలయంలోని నాగదేవత, నందీశ్వరుని విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్టు స్థానికులు తెలిపారు. ఉదయం పూట ఆలయాన్ని శుభ్రం చేసే మహిళ ఈ విషయాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసుకలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

News April 7, 2024

NLG: మద్యం ద్వారా దండిగా ఆదాయం!

image

ఉమ్మడి జిల్లాలో మందు బాబుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అనుకున్న దానికంటే అధికంగా వస్తుంది. గతేడాది 26,94,304 కాటన్ల మద్యం, 37,83,834 కాటన్ల బీర్ల అమ్మకాలు జరుగగా రూ.2,669.70 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ ఏడాదిలో 27,97,133 కాటన్ల మద్యం, 44,32,099 కాటన్ల బీర్ల అమ్మకాలు జరిగాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2,797.80 కోట్ల ఆదాయం సమకూరింది.

News April 7, 2024

ఖమ్మం: ఆర్టీసీ ఉద్యోగులకు వడదెబ్బ ముప్పు

image

వేసవిలో ఎండల తాకిడికి ప్రజలు అల్లాడుతున్నారు. అయితే నీడ పట్టున ఉండి పని చేసే వారికి సమస్య తీవ్రత తక్కువగా ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం భానుడి ప్రతాపాన్ని ఎదుర్కొంటూనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఉదయం మధ్యాహ్నం తేడా లేకుండా డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావాల్సిందే. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా కాపాడకోవాలని అధికారులు సూచిస్తున్నారు

News April 7, 2024

NZB: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు, పురుషులకు పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్త తెలిపారు. ఇందుకోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల వారు డిచ్‌పల్లి SBI స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

News April 7, 2024

భద్రాద్రి రామయ్య కల్యాణానికి 250 క్వింటాళ్ల తలంబ్రాలు

image

భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు పంపిణీ చేసేందుకు గతేడాది 150 క్వింటాళ్ల తలంబ్రాలు తయారుచేయగా, ఈ ఏడాది 250 క్వింటాళ్లకు పెంచుతున్నట్లు ఈఓ రమాదేవి ఆదివారం తెలిపారు. పంపిణీకి 60 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 600 బస్సుల్లో 600 కేజీలు పంచనున్నట్లు చెప్పారు. ప్రసాదాలు పోస్టల్ ద్వారా విక్రయిస్తుండగా, తలంబ్రాలు పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

News April 7, 2024

KMM: ఈనెల 30 వరకు చెల్లిస్తే 5% శాతం తగ్గింపు

image

ఖమ్మంలో ఈనెల 30వరకు 5 శాతం రాయితీతో ఇంటి పన్ను చెల్లించే అవకాశం ఉందని మున్సిపాలిటీలోని మీసేవా కేంద్రం వద్ద కానీ, బిల్ కలెక్టర్‌కు లేదా CDMA.telangana.govt.in ద్వారా ఆన్లైన్ లో చెల్లించవచ్చని కమిషనర్ ఆదర్శ్ సురభి తెలిపారు. షాపింగ్ మాల్స్ ఓనర్లు తప్పనిసరి ట్రేడ్ లైసెన్స్ పొందాలన్నారు. గడువు ముగిసిన వారు రెన్యూవల్ చేయించుకోవాలని సూచించారు.