Telangana

News July 14, 2024

తలమడుగు: చిరుతపులి దాడిలో మేక మృతి

image

తలమడుగు మండలంలోని కొత్తూరు శివారులో చిరుతపులి దాడిలో మేకపోతు మృతి చెందింది. స్థానికుల వివరాలు.. బాతురి మల్లేశ్ మేకల మందను శనివారం మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. చిరుత పులి దాడి చేసి మేకను హతమార్చింది. దీని విలువ రూ.10 వేలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. కాగా.. గత 15 రోజుల క్రితం మేకల మందపై దాడి చేయగా కాపరుల అరుపులతో చిరుతపులి విడిచిపెట్టి వెళ్లింది.

News July 14, 2024

వరంగల్ మహానగర పాలక సంస్థ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం

image

బల్దియా క్షేత్రస్థాయి, మినిస్ట్రీ రియల్ ఉద్యోగుల బదిలీ జాబితా సిద్ధమైంది. ఈనెల 20లోగా 40 శాతం ఉద్యోగులు ఇతర మున్సిపాలిటీలకు వెళ్లనున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు. ఈ సమాచారాన్ని ప్రాంతీయ సంచాలకు షహీద్ మసూద్‌కు పంపించారు. 16 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్, మరో 10 మంది నాలుగో తరగతి ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

News July 14, 2024

KNR: కేంద్ర మంత్రి నేటి పర్యటన షెడ్యూల్

image

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు కరీంనగర్ నియోజకవర్గంలో పర్యటిస్తారని క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 4గం.కు హుస్నాబాద్ నిర్వహించే బోనాల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బీజేపి నేత సంపత్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.

News July 14, 2024

జగిత్యాల నుంచి శంషాబాద్‌కు రాజధాని బస్సులు

image

జగిత్యాల డిపో నుంచి శంషాబాద్‌కు టీజీఎస్ RTC రాజధాని బస్సు సర్వీసులు నడపనున్నట్లు RM సుచరిత తెలిపారు. ఈనెల 15 నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సులు జగిత్యాల నుంచి బయల్దేరి KNR, ఉప్పల్ క్రాస్ రోడ్, LBనగర్ మీదుగా శంషాబాద్ చేరుకుంటాయన్నారు. జగిత్యాల నుంచి శంషాబాద్‌కు సాయంత్రం 4:30, రాత్రి 8గం.కు, KNR నుంచి సా.5:45కు, రాత్రి 9:30కు, శంషాబాద్ నుంచి KNR/JGLకు ఉ.7:15, 8 గంటలకు బయల్దేరుతాయన్నారు.

News July 14, 2024

ఖమ్మం: ఖానాపురం హవేలి PSలో మహిళ హల్‌చల్‌

image

ఖానాపురం హవేలి PSలో ఓ వివాహిత శనివారం హల్‌చల్‌ చేసింది. AR కానిస్టేబుల్‌‌తో తన భార్యకు సంబంధం ఉందని ఆమె భర్త ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా యువతిని స్టేషన్‌కు పిలిపించి నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించగా, నోటీసులు తీసుకోవడానికి నిరాకరించింది. కానిస్టేబుల్‌తో ఉన్న ఫొటోలు తనవి కావని, మార్ఫింగ్‌ చేశారంటూ గొడవకు దిగింది. పెట్రోలు పట్టుకుని వచ్చి బెదిరించింది.

News July 14, 2024

వలిగొండ: తమ్ముడు మృతి.. అన్న ఆత్మహత్య

image

ఉరేసుకొని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన వలిగొండ(M) ప్రొద్దుటూరులో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాలు.. గోపాల్‌-శకుంతల పెద్ద కుమారుడు శివప్రసాద్‌(27) ఇంటి వద్దనే ఉంటాడు. ఇటీవల తన సోదరుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి సోదరుడిని జ్ఞాపకం చేసుకుంటూ మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

News July 14, 2024

తూప్రాన్: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

తూప్రాన్ మండలం దాతర్‌పల్లిలో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాలు.. బోసమైన గాయత్రి(17) గజ్వేల్ మోడల్ స్కూల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరంలో ఫెయిల్ కావడంతో నిన్న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ బ్యాగ్‌లో వెతకగా టీసీ కనిపించడంతో ఫెయిలైన కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 14, 2024

గద్వాల: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సూసైడ్

image

అయిజ మండలంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. ఉప్పలక్యాంపు గ్రామానికి చెందిన చెన్నకేశవరావు(24) కొంతకాలం చెన్నైలో ఉద్యోగం చేశాడు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స కోసం స్వగ్రామానికి వచ్చాడు. చికిత్స పొందుతూ, అయిజలోని ఉప్పల్‌దొడ్డిపేటలో చిన్నాన్న వద్ద ఉంటున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లి ఉప్పల రహదారిలో ఉన్న మంచినీటి సంప్‌ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

News July 14, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
> కొత్తగూడెంలో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పర్యటన
> వెంకటాపురంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> సత్తుపల్లి సింగరేణి ఏరియాల్లో ఉచిత వైద్య శిబిరం
> నేలకొండపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
> బయ్యారంలో ఎంపీ పోరిక బలరాం నాయక్ ఆత్మీయ సమ్మేళనం
> మధిరలో సీపీఎం పార్టీ జిల్లా శిక్షణ తరగతులు
> అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే పర్యటన

News July 14, 2024

తాడ్వాయిలో విష జ్వరాలు.. స్పందించిన వైద్యులు

image

మునగాల మండల పరిధిలోని తాడ్వాయిలో విష జ్వరాలు విజృంభిస్తుండడంతో వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరం, దగ్గు ఇతర లక్షణాలున్న గ్రామస్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో పేరు నమోదు చేసుకున్న 64 మందిలో 9 మందికి జ్వరం లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు.