India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాగి గొడవ పడుతూ.. డబ్బుల కోసం వేధిస్తున్నాడని భార్య భర్త గొంతు కోసిన ఘటన మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామంలో చోటుచేసుకుంది. SI వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హుస్సేన్ శుక్రవారం రాత్రి భార్య అలివేలును డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. విసుగు చెందిన భార్య ఈల పీటతో గొంతు కోసింది. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హుస్సేన్ తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తిప్పర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైనట్లు తిప్పర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల నల్గొండలో పదో తరగతి పరీక్షలు రాసిన ఆ విద్యార్థిని ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తిప్పర్తి పోలీసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పట్టుకుంది. టెట్ పాసైతేనే పదోన్నతులకు అర్హులని ఎస్ఈఆర్టీ నిబంధనలు విధించింది. ఎప్పుడో ఉద్యోగాలు పొందిన తాము ప్రస్తుతం పదోన్నతులు పొందేందుకు టెట్ తప్పనిసరి పాస్ కావాలనే నిబంధన పెట్టడం ఏమిటని ఉపాధ్యాయులు అసంతృప్తి చెందుతున్నారు. ప్రస్తుతం టెట్ అర్హత సాధించడం సాధ్యమయ్యే పని కాదని, మా కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు DSCలో SGT, SAకు GS మొదటి పేపర్ ఉచిత శిక్షణ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ డైరెక్టర్ రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన అర్హత గల అభ్యర్థులకు ఈ నెల 8న ఉదయం 10 గంటలకు బీసీ స్టడీ సర్కిల్‌లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని చెప్పారు.
గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలం కాశీపట్నం వద్ద శనివారం జరిగింది. పిండిప్రోలుకి చెందిన ఐతనబోయిన వెంకటేశ్వర్లు(68) కాశీపట్నంలోని దేవాలయం వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రహదారిపై నడిచి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
బూటకపు ఎన్కౌంటర్లకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని, ములుగు ఎస్సీ కనుసన్నల్లోనే ఈ ఎన్ కౌంటర్ల పరంపర పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం అని భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్) పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరిస్తున్నామన్నారు.
నిట్ వరంగల్‌లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకల్లో శనివారం రెండో రోజు కల్చరల్ ఫెస్ట్ కలర్ ఫుల్‌గా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా 35కు పైగా ఈవెంట్లలో పాల్గొన్నారు. కాగా మూడు రోజుల వసంతోత్సవ వేడుకలు ఆదివారంతో ముగియనున్నాయి. ముగింపు కార్యక్రమానికి సీతారామం సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి, హీరో నవదీప్ హాజరు కానున్నారు.
ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌లో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సుల్లో నెల రోజుల శిక్షణకు ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
✓పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు పర్యటన
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో రుద్రాభిషేకం
✓కొత్తగూడెంణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓కరకగూడెం మండలంలో ఓటు నమోదుపై ప్రత్యేక కార్యక్రమం
✓పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకీ ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం వేళల్లో సైతం ఎండల ధాటికి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ వేడిమి తగ్గకపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. శనివారం నాంపల్లి, పెన్‌పహాడ్ ఉష్ణోగ్రత 44.5 డిగ్రీలకు చేరుకుంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేసవి నుంచి రక్షించుకునే చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.