Telangana

News July 14, 2024

అవసరమైతే రక్తం దానం చేస్తా: సిరిసిల్ల కలెక్టర్

image

సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అవసరమైతే తాను రక్తదానం చేస్తానని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా ఆస్పత్రిని శనివారం తనిఖీ చేసి బ్లడ్ బ్యాంకులోని రక్తం నిలువలపై ఆరా తీశారు. తనది ఓ నెగిటివ్ రక్తం అని, అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైతే తన రక్తం అందజేస్తానని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతపై రోగులకు అవగాహన కల్పించాలన్నారు.

News July 14, 2024

HYD: వీధి కుక్కల బెడదపై ఓ విధానం లేదా: హైకోర్టు

image

HYD నగరంలో వీధి కుక్కల దాడుల్లో చిన్నారులు చనిపోతున్న ఘటనలపై హైకోర్టు ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. వరుస ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వానికి ఓ విధానం లేకపోవడం ఏంటి..? అని ప్రశ్నించింది. కేవలం పరిహారం చెల్లించి, చేతులు దులుపుకుంటామంటే కుదరదని, భవిష్యత్తులో ఘటనలు జరగకుండా చూడాలంది. ఈ మేరకు ప్రభుత్వం GHMC, పోలీసు, ఇతర శాఖలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది.

News July 14, 2024

HYD: మహిళలకు ఉచితంగా ఆటో రిక్షా ట్రైనింగ్!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనిచ్చేందుకు వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఎండీ కాంతి వెస్లే వెల్లడించారు. 100 మంది మహిళలకు అవకాశం కల్పిస్తామని, డ్రైవింగ్ లైసెన్స్, సొంత ఎలక్ట్రిక్ వాహనం మైక్రో లోన్ అందిస్తామన్నారు. కూకట్‌పల్లిలోని మోనో ప్రాంగణంలో ట్రైనింగ్ అందిస్తామన్నారు.

News July 14, 2024

HYD: మహిళలకు ఉచితంగా ఆటో రిక్షా ట్రైనింగ్!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు చేయూతనిచ్చేందుకు వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో రిక్షా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఎండీ కాంతి వెస్లే వెల్లడించారు. 100 మంది మహిళలకు అవకాశం కల్పిస్తామని, డ్రైవింగ్ లైసెన్స్, సొంత ఎలక్ట్రిక్ వాహనం మైక్రో లోన్ అందిస్తామన్నారు. కూకట్‌పల్లిలోని మోనో ప్రాంగణంలో ట్రైనింగ్ అందిస్తామన్నారు.

News July 14, 2024

8 మంది ఎంపీలను గెలిపించినా బీజేపీ తెలంగాణకు మొండి చేయి: వినోద్ కుమార్

image

8 మంది ఎంపీలను గెలిపించినా BJP తెలంగాణకు మొండి చేయి చూపిస్తోందని BRS నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఉందన్నారు. అదే షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు ఆయిల్ రిఫేనరీ కంపెనీని ఏపీకి ఇస్తున్నారని.. మరి తెలంగాణకు ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.

News July 14, 2024

షబ్బీర్ అలీకి వినతి పత్రం అందజేసిన విజయ డైరీ అధ్యక్షుడు

image

ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీని విజయ డైరీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మర్యాద పూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లాలో విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులను ప్రోత్సహించి పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం తరుఫున తగిన ప్రోత్సాహకాలు అందజేయాలని తిరుపతి రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

News July 14, 2024

జాతీయ అవార్డు అందుకున్న RIMS వైద్యుడు

image

ఆదిలాబాద్‌ RIMS వైద్యుడు జాతీయ అవార్డు అందుకున్నాడు. RIMS పాథాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న డా.అరుణ్ కుమార్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఎక్సలెన్స్ విభాగంలో జాతీయ అవార్డు- భారతదేశపు ఉత్తమ వైద్యుల అవార్డు 2024 అందుకున్నారు. ఈ అవార్డు కోసం దేశం నుంచి 126 నామినేషన్లు రాగా దాంట్లో డా.అరుణ్ కుమార్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. RIMS డైరెక్టర్ జైసింగ్‌తో పాటు ఆసుపత్రి సిబ్బంది ఆయన్ను అభినందించారు.

News July 14, 2024

ఆ వార్తలు అవాస్తవం: ఎంపీ రవిచంద్ర

image

ఖమ్మం: బీఆర్ఎస్‌ని బీజేపీ పార్టీలో విలీనం చేస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఇటువంటి వార్తలను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలో కలుస్తుందన్న వార్తలు ఊహాజనితమైనవన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్‌పై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. 

News July 14, 2024

మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

తమిళనాడులోని అరుణాచల ఆలయానికి గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఈనెల 19న MBNR, NGKR డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ శ్రీదేవి శనివారం తెలిపారు. నూతన BS6 బస్సులను10 ఏర్పాటు చేశామని అన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.https://www.tsrtconline.in ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నారు.

News July 14, 2024

సిద్దిపేట నుంచి అరుణాచలగిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు

image

సిద్దిపేట నుంచి ఈనెల 19న సాయంత్రం 4 గంటలకు అరుణాచలగిరి ప్రదక్షిణకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డీఎం సుఖేందర్‌రెడ్డి తెలిపారు. కాణిపాకం, వేలూరు శ్రీ మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్, పౌర్ణమి రోజున అరుణాచలగిరి ప్రదక్షిణ, 22న జోగులాంబ శక్తిపీఠం దర్శనం ఉంటుందని వివరించారు.