Telangana

News April 6, 2024

HYD: రూ.6,53,35,400 నగదు సీజ్ చేశాం: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో HYDలో గడిచిన 24 గంటల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.6,53,35,400 నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా 80.65 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామన్నారు. రూ.65,390 విలువ గల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. 14 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కారం చేశామన్నారు.

News April 6, 2024

ప్రపంచ కుబేరుల జాబితాలో మన పాలమూరు వాసులు

image

ప్రపంచ కుబేరుల జాబితాలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు చోటు సంపాదించారు. ఫోర్బ్స్‌ తాజాగా విడుదల చేసి లిస్ట్‌లో మన పాలమూరుకు చెందిన ఇద్దరు అత్యంత ధనవంతులుగా నిలిచారు.‌ మై‌ హోం గ్రూపు వ్యాపార సంస్థల ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్‌రావు 2.3 బిలియన్‌ డాలర్ల(రూ.19 వేల కోట్లు)తో 1438 స్థానం, MSN ఫార్మా సంస్థ అధినేత ఎం.సత్యనారాయణ రెడ్డి 2 బిలియన్‌ డాలర్ల (రూ.16 వేల కోట్లు)తో 1623 స్థానంలో ఉన్నారు.

News April 6, 2024

ఐపీఎల్ మ్యాచ్‌లో ఉమ్మడి జిల్లా మంత్రులు

image

శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు సందడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హీరో వెంకటేష్‌లతో కలిసి మ్యాచ్ వీక్షించారు. అనంతరం హైదరాబాద్ జట్టు గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

News April 6, 2024

తాంసీ: పెళ్లి కావటం లేదని యువకుడి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదని యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన బోథ్ మండలంలో జరిగింది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని కొత్తగల్లికి చెందిన జాదవ్ జ్ఞానేశ్వర్ (21)కు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూసినప్పటికీ కుదరక పోగా మనస్తాపంతో ఇవాళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2024

మెదక్: ట్రాక్టర్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

image

వెల్దుర్తి మండలం కొప్పులపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ఒక ట్రాక్టర్ నుండి వ్యక్తి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు మండల పరిధిలోని మన్నేవారి జలాల్పూర్ గ్రామానికి చెందిన జ్వాలా నరేశ్‌గా గుర్తించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News April 6, 2024

ఎస్పీ కనుసన్నల్లోనే ఎన్‌కౌంటర్: మావోయిస్టుల లేఖ

image

భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు బీకే, ఏఎస్ఆర్ కమిటీ ఆజాద్ పేరుతో ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టిస్తుంది. బూటకపు ఎన్‌కౌంటర్లకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ములుగు జిల్లా ఎస్పీ కనుసనల్లోనే ఈ ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోందన్నారు. పూజార్ కాంకేర్ మృతులకు లాల్ సలాం అంటూ లేఖలో పేర్కొన్నారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ములుగు ఎస్పీ ఎన్‌‌కౌంటర్లకు పాల్పడ్డాడని లేఖలో వివరించారు.

News April 6, 2024

MBNR: ‘ఔట్ సోర్సింగ్ వర్కర్లపై వేధింపులు ఆపాలి’

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రభుత్వ కళాశాలల వసతి గృహాలలో ఔట్ సోర్సింగ్‌పై ఎంతోమంది విధులు నిర్వహిస్తున్నారు. వారిపై వార్డెన్స్ పెత్తనం చెలాయిస్తూ తమని సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. అందుకుగాను శనివారం జిల్లా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ మోహన్ రావు‌కు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఆధిపత్య భావజాలాన్ని అణగదొక్కాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

News April 6, 2024

NLG: బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం.. తీవ్ర గాయాలు

image

చిట్యాల మున్సిపాలిటీలోని సంతోష్ నగర్ కాలనీలో బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నల్గొండ డీఎస్సీ శివరాం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్దికాలంగా ఎలాంటి అనుమతి లేకుండా ఓ ఇంటిని కిరాయికి తీసుకొని ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన కోటేశ్వరరావు బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

News April 6, 2024

‘రైతులు ఏడుస్తుంటే క్రికెట్ ముఖ్యమా రేవంత్ రెడ్డి..?’

image

‘ఆరుగాలం కష్టించి సాగు చేస్తున్న పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే నీవు క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తావా..!’ అంటూ మాజీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డి పై ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై స్థానిక కార్యాలయ ప్రాంగణంలో శనివారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఎండిన పంటలకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

News April 6, 2024

HYD: డిగ్రీతో పాటు మిలిటరీ ట్రైనింగ్.. మీ కోసమే..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని యువతులకు గురుకులాల అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. MA(ఎకనామిక్స్)+మిలిటరీ ట్రైనింగ్ అందించనున్నామని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా.. మిగతా వివరాలకు tswreis.ac.in వెబ్‌సైట్ చూడాలని HYD గురుకులాల అధికారులు Xలో ట్వీట్ చేశారు.