Telangana

News April 6, 2024

SRH VS CSK మ్యాచ్: 35,992 మంది హాజరు

image

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన SRH VS CSK ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ని 35,992 మంది వీక్షించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. గ్రౌండ్ ఫుల్ కెపాసిటీతో నిండిపోయిందని HCA తెలిపారు. హోమ్ గ్రౌండ్లో రెండో మ్యాచ్ గెలవడం పట్ల హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, బృందం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News April 6, 2024

పాలమూరులో ‘గృహజ్యోతి’ అయోమయం !

image

ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగానికి జీరో బిల్ ఇస్తోంది. అయితే MLC ఎన్నికల కోడ్ రావడంతో ఉమ్మడి జిల్లాలో ఈ పథకాన్ని ఆపేశారు. ఫిబ్రవరి, మార్చి నెల బిల్లులు యథావిధిగా వచ్చాయి. దీంతో తమకు వచ్చిన బిల్లులు కట్టాలా.. వద్దా..? అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో కొందరు బిల్లులు చెల్లిస్తుండగా మరికొందరు వేచిచూద్దామనే ధోరణిలో ఉన్నారు.

News April 6, 2024

SRH VS CSK మ్యాచ్: 35,992 మంది హాజరు

image

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన SRH VS CSK ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ని 35,992 మంది వీక్షించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. గ్రౌండ్ ఫుల్ కెపాసిటీతో నిండిపోయిందని HCA తెలిపారు. హోమ్ గ్రౌండ్లో రెండో మ్యాచ్ గెలవడం పట్ల హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, బృందం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News April 6, 2024

ఖమ్మం జిల్లాలో 361 మందిపై కేసులు

image

ఖమ్మం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి శుక్రవారం వరకు 361మందిపై 287 కేసులు నమోదు చేయగా.. రూ.28,44,242 విలువైన సొత్తు
స్వాధీనం చేసుకున్నట్లు వ్యయ పరిశీలన అధికారి మురళీధర్ రావు తెలిపారు. రూ.50,400 విలువైన PDS బియ్యం
స్వాధీనం చేసుకున్నామని, పోలీస్, ఎక్సైజ్ శాఖలకు సంబంధించి రూ.5,25,10,090 విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

News April 6, 2024

సూర్యాపేట: బాలిక పేరే రమావత్ కాంగ్రెస్

image

కాంగ్రెస్ పార్టీ మీద అభిమానాన్ని తన కూతురి పేరులో చూపెట్టాడు పాలకీడు మండలం శూన్యంపాడులోని ఓ కార్యకర్త. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అదే సంవత్సరంలో కూతురు పుట్టడంతో బాలికకు రమావత్ కాంగ్రెస్ అని పేరుపెట్టాడు. అనంతరం కాంగ్రెస్ మీద అభిమానంతో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం అందించే ఏ సాయాన్ని కూడా తీసుకోకపోవడం గమనార్హం.

News April 6, 2024

మిరుదొడ్డి: సైబర్ బాధితుడికి నగదు అందజేత

image

నగదు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి కొంత మొత్తం అందజేసినట్లు ఎస్సై పరశురాములు తెలిపారు. మిరుదొడ్డి మండలంకు చెందిన అందే స్వామి 2023లో సైబర్ నేరస్థుల బారిన పడి తన ఖాతాలో ఉన్న రూ.75 వేలను పోగొట్టుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మిరుదొడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరస్తుడి ఖాతాను హోల్డ్ చేసి ఖాతాలో ఉన్న రూ.23,200 నగదును న్యాయస్థానం ఆదేశాల మేరకు బాధితుడికి చెక్కు అందజేశారు.

News April 6, 2024

NGKL: తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్.. రిమాండ్

image

గంజాయి తాగొద్దన్నందుకు <<12992370>>తండ్రిపై కొడుకు పెట్రోల్ పోసి<<>> దారుణంగా హత్య చేసిన ఘటన RR జిల్లా తుర్కయాంజల్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. కొల్లాపూర్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రవీందర్‌ను కొడుకు అనురాగ్ గంజాయి మత్తులో కోపోద్రిక్తుడై హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు నిందితుడు అనురాగ్(25)ను శుక్రవారం అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు CI తెలిపారు.

News April 6, 2024

నవీపేట: కొడుకులు గొడవ పడుతున్నారని తల్లి సూసైడ్

image

కొడుకులు గొడవ పడుతున్నారని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట మండలం నాగేపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగామణి(55)కి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయ భూమి విషయంలో కొడుకులిద్దరూ 15 రోజులుగా గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన గంగామణి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొడుకుల మధ్య జరిగిన గొడవతో తల్లి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదైంది.

News April 6, 2024

అయిజ: ఊరెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీ

image

అయిజ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్ఐ విజయభాస్కర్ వివరాలు మేరకు.. గ్రామానికి కృష్ణారెడ్డి తన ఇంటికి తాళం వేసి పనిమీద కర్నూలు వెళ్లారు. రాత్రి తిరిగి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్ళి పరిశీలించగా రెండు లక్షల రూపాయలు, ఆరు తులాల బంగారం చోరీకి గురైందని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 6, 2024

ASF: మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లిన ఏనుగు

image

మహారాష్ట్రకు చెందిన బృందంతో పాటు జిల్లాలోని మూడు అటవీ శాఖ బృందాలు థర్మల్ డ్రోన్ల సాయంతో ఏనుగు జాడను గుర్తించాయి. శుక్రవారం ఉదయం కమ్మ‌ర్గాంలోని పల్లె ప్రకృతి వనంలో స్థానికులకు ఏనుగు కనిపించింది. సాయంత్రం మొర్లి గూడ అటవీ సమీపం నుంచి ప్రాణహిత నది తీరం దాటి మహారాష్ట్ర అడవుల్లోకి వెళ్లినట్టు డ్రోన్ కెమెరా ద్వారా నిర్ధారించుకున్నట్లు ఇన్‌ఛార్జ్ FRO సుధాకర్ తెలిపారు.