Telangana

News March 16, 2024

HYD: మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు: గజ్జల నగేశ్

image

ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జల నగేశ్ అన్నారు. ఇది బీజేపీ కుట్రలో భాగమని, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో కవితను అరెస్టు చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో మనోస్థైర్యం దెబ్బతీసేందుకే కుట్రలు చేశారని, మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఆయన మండిపడ్డారు.

విద్యావంతులైన కార్మికులకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు

image

సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల ద్వారా బదిలీ వర్కర్స్, జనరల్ మజ్దూర్లుగా భూగర్భ గనుల్లో పని చేస్తున్న విద్యావంతులైన యువ కార్మికులకు ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందటానికి సింగరేణి సంస్థ అవకాశాన్ని అందిస్తోందని C&MD బలరాం ప్రకటించారు.వివిధ విభాగాల్లో ఉన్న 986 ఖాళీల భర్తీ కోసం సంస్థలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

News March 16, 2024

భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటికి ఏడాది

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో నాటి కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రకు ఏడాది పూర్తయింది. గతేడాది మార్చి 16న ఆయన ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామం నుంచి ఈ పాదయాత్రను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్‌ను కదిలించి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ఆయన చేపట్టిన యాత్ర 109 రోజులపాటు 1,364 కిలోమీటర్లు సాగింది.

News March 16, 2024

ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ..!

image

ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీ నేతనే బరిలోకి దించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.