India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు జనాభా పెరుగుతుండడంతో ప్లాస్టిక్ వినియోగం కూడా పెరుగుతోంది. ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలతో ప్రమాదం పొంచి ఉన్నా.. ఆయా జిల్లాల పుర అధికారులు నియంత్రించడం లేదు. చట్ట ప్రకారం 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించరాదు. గత సంవత్సరం తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ నిర్మూలనను గాలికి వదిలేశారు.
జడ్చర్ల మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక(5)పై బాలుడు(12) లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. తండాలోని పాఠశాల ఆవరణలో గురువారం తోటి పిల్లలతో కలిసి బాలిక ఆడుకుంటుండగా.. అదే తండాకు చెందిన బాలుడు చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆరా తీశారు. జరిగిన విషయాన్ని బాలిక చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
షీటీం బృందాలు మహిళా రక్షణలో ముందు వరుసలో ఉంటున్నాయని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గత నెలలో 12 ఫిర్యాదులు వస్తే 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్టాండు, రైల్వే స్టేషన్లు, కళాశాలల వద్ద షీటీం సభ్యులు నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. వీటి పై సమాచారం అందించే వారు 98126 70235 చరవాణి సంప్రదించాలని కోరారు
వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 5 రోజులు సెలవులు రానున్నాయి. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి సంగయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 5న బాబూజగజ్జీన్‌రామ్ జయంతి, 6, 7 తేదీల్లో వారాంతపు సెలవు, 8న అమావాస్య, 9న ఉగాది సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మార్కెట్ బంద్ ఉంటుందని రైతులు గమనించాలని సూచించారు.
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} భద్రాచలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
∆} సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ- విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడనుంది. లోక్ సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది. ఈ నేపథ్యంలో పలు పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయా కలెక్టరేట్లు కేంద్రంగా దీన్ని నిర్వహిస్తున్నారు.
కేయూ పరిధిలో బీపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు(రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల16 నుండి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి తెలిపారు. 16న పేపర్-1 హిస్టరీ, ప్రిన్సిపుల్స్ అండ్ ఫౌండేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 18న పేపర్-2 అనాటమీ ఫిజియాలజీ, 20న పేపర్ -3ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 22న పేపర్-4 ఒలింపిక్ మూవ్మెంట్ పరీక్షలు ఉంటాయన్నారు.
HYD ఉప్పల్లో నేడు SRH VS CSK మధ్య IPL మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ సా.6 గంటల నుంచి రా.11:30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఘట్‌కేసర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, జీడిమెట్ల, KPHB తదితర ప్రాంతాల నుంచి బస్ సర్వీసులుంటాయని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు మెట్రో టైమింగ్స్ కూడా పొడిగిస్తారు. SHARE IT
సంతకం ఫోర్జరీ కేసులో గురువారం సదరు ఉద్యోగిని అధికారులు సస్పెండ్ చేశారు. NZBలోని కిసాన్ సాగర్ PHCలో పనిచేస్తున్న జూ.అసిస్టెంట్ శ్రీనివాస్‌కు జక్రాన్‌పల్లి PHC ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఇద్దరు ఉద్యోగులకు GPF ఇప్పించే క్రమంలో పలు పత్రాలపై వైద్యాధికారి రవీందర్ సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ విషయాన్ని ఆయన 20 రోజుల క్రితం జిల్లా విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లడంతో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేశారు.
మంచిర్యాలలోని కార్మల్ కాన్వెంట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్పాట్ కేంద్రంలో పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్నారు. అయితే మొదటి రోజు విధులకు కారణం లేకుండా గైర్హాజరైన ముగ్గురు ఉపాధ్యాయులపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. సదురు ఉపాధ్యాయులను వివరణ కోరగా వారు స్పందించకపోవడంతో డీఈవో యాదయ్య వారిని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.