Telangana

News April 5, 2024

NZB: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా పోటీపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఓ వేడుకలో సరదాగా మాట్లాడుకున్నారు. కోరుట్లలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ నర్సింగరావు హాజరయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడికి రావడంతో అందరూ కలుసుకున్నారు.

News April 5, 2024

ఏడుపాయలలో నీట మునిగి వ్యక్తి మృతి

image

ఏడుపాయల వన దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన భక్తుడు నీట మునిగి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాపన్నపేట ఎస్ఐ నరేశ్ వివరాల ప్రకారం.. HYD సంజీవరెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్(28) బంధువులతో కలసి ఏడుపాయలకు వచ్చాడు. స్నానం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మంజీర పాయల్లో మునిగి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News April 5, 2024

17నెలల చిన్నారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం

image

సూర్యాపేటలో జరిగిన <<12991416>>రోడ్డుప్రమాదంలో<<>> 17నెలల చిన్నారి వేదస్విని తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలించాక గంటపాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. పాప ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేశారు. నలుగురు వైద్యులు, నలుగురు నర్సులు ఆక్సిజన్ అందించి సీపీఆర్ చేసినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. మరో వైపు చిన్నారి తల్లి పక్క బెడ్ పైనే అపస్మారకస్థితిలో ఉంది. ఈ దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టించాయి.

News April 5, 2024

KNR: సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రచారాలు

image

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా వినూత్న రీతులలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఓవైపు నియోజకవర్గాలలో తిరుగుతూనే మరోవైపు సోషల్ మీడియా బాధ్యుల పేరుతో హల్ చల్ చేస్తున్నారు. ప్రచారాలు కాస్తా దూషణల వరకు వెళ్తుంది. దీంతో ఏకంగా పోలీసులకు ఫిర్యాదులు చేసుకునే వరకు వచ్చింది. బూతు పురాణాలు, విభిన్న ప్రచారాలతో ఓటర్లను నేతలు సందిగ్ధంలో పడేస్తున్నారు.

News April 5, 2024

NRPT: భారీగా బంగారు నగలు పట్టివేత

image

నారాయణపేటలోని సెంటర్ చౌరస్తాలో గురువారం సాయంత్రం ఏపీకి చెందిన బంగారు నగల తయారీదారుడు రాజా వద్ద భారీగా బంగారు ఆభరణాలు పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బంగారు దుకాణాలకు నగలు అందించేందుకు వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా తనిఖీలు నిర్వహించామని, అతని వద్ద ఎలాంటి పత్రాలు లేని రూ.17 లక్షల విలువ గల 53.09 తులాల బంగారు ఆభరణాలు పట్టుకున్నట్లు చెప్పారు.

News April 5, 2024

కొత్తగూడెం: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి 

image

ములకలపల్లి మండలంలోని సాయిరాంపురం గ్రామానికి చెందిన వ్యక్తి తాటి చెట్టు నుంచి పడి మృతి చెందాడు. బొగ్గం వెంకటేష్ (42) అనే వ్యక్తి ఉదయం కల్లు గీసేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కుతుండగా అదుపు తప్పి కింద పడ్డాడు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 

News April 5, 2024

సూర్యాపేట: ‘నిర్లక్ష్యమే ముగ్గురి ప్రాణాలు తీసింది ‘

image

సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<12991416>>ముగ్గురు మృతిచెందగా,<<>> 14మందికి గాయాలైన సంగతి తెలిసిందే. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పెద్ద శబ్దంతో సినిమా పాటలు పెట్టి నిర్లక్ష్యంగా ఆటో నడపడం కూడా ప్రమాదానికి ఓ కారణమని బాధితుల బంధువులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదం జరిగేది కాదంటున్నారు.

News April 5, 2024

NZB: 195 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు 

image

నిజామాబాద్‌లోని నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి 10 తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. విధులు కేటాయించిన 195 మంది ఉపాధ్యాయులు గైర్హాజరవడంతో గురువారం DEO దుర్గాప్రసాద్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో NZB జిల్లాకు చెందిన వారు 58, KMR జిల్లాకు చెందిన వారు 137 మంది ఉన్నారు. 

News April 5, 2024

జనగామ: ప్రేమ పేరుతో మోసం.. వ్యక్తి పై కేసు

image

ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI రాజు తెలిపారు. లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు నాలుగేళ్లుగా ప్రేమ పేరుతో కలిసి ఉంటున్నారు. ఆమెను మోసగించి ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2024

పీవీ సొంతూరు రహదారి ఎలా ఉందంటే..?

image

వర్షాకాలం వచ్చిందంటే చాలు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన HNK జిల్లా వంగరలో గ్రామ చెరువు నిండి అలుగు పారుతూ రోడ్డు పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తుంటుంది. దీంతో రాకపోకలు స్తంభిస్తాయి. అయితే గతంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పినప్పటికీ జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా మంత్రులు చొరవ తీసుకుని వంతెన నిర్మిస్తారని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు.