India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా NIT వరంగల్ డైరెక్టర్, ప్రొఫెసర్ విద్యాధర్ సుబుధి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా NIT డైరెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ తన జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో NIT వరంగల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఫారం-12డీ నింపి సంబంధిత నోడల్ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

జిల్లాలో ఈ నెల తొలివారం నుంచి క్రమంగా పెరగాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో ఇక నడి వేసవి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలో కలుగుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఇవాళ మధ్యాహ్నం సమయంలో జన సంచారం లేక నిర్మానుషంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా గద్వాల జిల్లా ధరూర్ లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వడ్డేపల్లి 43.3, త్యాగదొడ్డి 43.0, వనపర్తి జిల్లా పెబ్బేరులో 42.9, నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్ల 42.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 42.5, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
డిచ్పల్లి, నిజామాబాద్ రైల్వే స్టేషన్ మధ్యలో కిలో మీటర్ 467/8-7 వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే SI సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయస్సు 45-50 సంవత్సారాలు ఉంటుందని, అతని కుడి చేతి పైన శంకర్ అని పచ్చ బొట్టు ఉందన్నారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తు పడితే వెంటనే నిజామాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలని, ఫోన్ నంబర్ 87126 58591కు సమాచారం ఇవ్వాలని SI సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది వ్యక్తుల ప్రైవేటు సంభాషణ విన్న నీచ చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర కీలకంగా ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం తప్పు చేయకుంటే గుమ్మడికాయ దొంగల్లా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా తమ ప్రభుత్వం వదలిపెట్టదని హెచ్చరించారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జైనథ్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివప్రసాద్ రెడ్డి శుక్రవారం తెలిపారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీకి చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి తనకు మార్కెట్ కమిటీలో స్థానం కల్పించినందుకు మాజీ మంత్రి జోగురామన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ నియోజకవర్గం నుంచి తాను, ఢిల్లీలో నరేంద్ర మోదీ విజయం ఖాయమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం చిట్యాల మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ లాంటిదని ఆ పార్టీకి ఢిల్లీలో గల్లీలో నూకలు చెల్లిపోయాయని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.