India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయ సమీపంలో నివసిస్తున్న అంబదాస్ మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం కాసేపు సేద తీరుతున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేశ ముఖచిత్రాన్ని మార్చేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి 10 లక్షల మందితో జంగ్ సైరన్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తుక్కుగూడలో ‘జన జాతర’ పేరిట రేపు నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు.

1.GDWL:303 పోలింగ్ కేంద్రాలు.. 1,212 సిబ్బంది.
2.NGKL:264 పోలింగ్ కేంద్రాలు 1,056 సిబ్బంది.
3.WNPT:307 పోలింగ్ కేంద్రాలు 1,212 సిబ్బంది.
4.KWKT:271 పోలింగ్ కేంద్రాలు1,084 సిబ్బంది
5.అచ్చంపేట:339 పోలింగ్ కేంద్రాలు 1,356 సిబ్బంది
6.కొల్లాపూర్:292 పోలింగ్ కేంద్రాలు 1,128 సిబ్బంది
7.అలంపూర్:291 పోలింగ్ కేంద్రాలు1,164 సిబ్బంది ఉండగా..7 అసెంబ్లీ నియోజకవర్గలో
239 సెక్టోరియల్ అధికారులను నియమించారు.
ఖమ్మం లోక్ సభ ఎన్నికకు BRS, BJP నుంచి ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. కానీ కాంగ్రెస్‌లో టికెట్ పంచాయతీ తెగకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తన భార్యకు టికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండగా.. తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడికే టికెట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరుతున్నట్లు స్థానికుల్లో చర్చ నడుస్తోంది.
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, రాజకీయవేత్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ కలెక్టరేట్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్ దాసరి హరిచందన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచందర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ VS చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ దృష్ట్యా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఉప్పల్ పరిధి ట్రాఫిక్ మళ్లించనున్నామని పోలీసులు తెలిపారు. మ్యాచ్ జరిగే సమయంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. లారీ, డంపర్, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC ట్రక్, అన్ని ఇతర రకాల ట్రక్కులు, భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు తీవ్రమైన వేడిగాలుల వల్ల వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వేడిమి సంబంధ వ్యాధుల జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు. భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి 16 సెక్టార్లు ఏర్పాటు చేస్తామని, రెండున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామన్నారు. అలాగే ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్ లు సిద్ధం చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
Sorry, no posts matched your criteria.