Telangana

News April 5, 2024

HYD: మల్కాజిగిరిలో పోస్టర్ల కలకలం

image

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. పోస్టర్లలో నాన్ లోకల్ వర్సెస్ లోకల్ అంటూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్లు ప్రయాణం చేసి హుజూరాబాద్ వెళ్లాలని.. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేవెళ్ల వెళ్లాలని.. కానీ BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని ఇక్కడే మనతోనే ఉంటారని పోస్టర్లలో రాశారు.

News April 5, 2024

రసవత్తరంగా పాలమూరు రాజకీయం

image

MBNR పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది.. ప్రధాన పార్టీల అభ్యర్థులు డీకే అరుణ, డా.వంశీచంద్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీటు చేజార్చుకోవద్దని కాంగ్రెస్, BRS, BJP పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి వారు విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News April 5, 2024

మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు

image

మాజీ ఎంపీ వీ.హనుమంత రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని, రాహుల్ గాంధీ సెక్యులర్ సిద్ధాంతాలో పనిచేస్తున్నారని అన్నారు. BRS నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నా.. మొదటి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

News April 5, 2024

బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం: రాజనర్సింహ

image

అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి పులమాల వేసి ఘన నివాళి అర్పించారు. అయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.

News April 5, 2024

బడుగు వర్గాల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ కృషి: NIT డైరెక్టర్

image

భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ 117వ జయంతి సందర్భంగా NIT వరంగల్‌ డైరెక్టర్, ప్రొఫెసర్ విద్యాధర్ సుబుధి ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా NIT  డైరెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ తన జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో NIT వరంగల్ సిబ్బంది పాల్గొన్నారు.

News April 5, 2024

HYD: 15వ తేదీలోగా ఆ పని కంప్లీట్ చేయండి: కలెక్టర్

image

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఏప్రిల్‌ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఫారం-12డీ నింపి సంబంధిత నోడల్‌ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News April 5, 2024

HYD: 15వ తేదీలోగా ఆ పని కంప్లీట్ చేయండి: కలెక్టర్

image

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఏప్రిల్‌ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు ఫారం-12డీ నింపి సంబంధిత నోడల్‌ అధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News April 5, 2024

NLG: నల్లగొండలో ఎండలు సలసల..!

image

జిల్లాలో ఈ నెల తొలివారం నుంచి క్రమంగా పెరగాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో ఇక నడి వేసవి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలో కలుగుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఇవాళ మధ్యాహ్నం సమయంలో జన సంచారం లేక నిర్మానుషంగా మారింది.

News April 5, 2024

ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలివే…

image

ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా గద్వాల జిల్లా ధరూర్ లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వడ్డేపల్లి 43.3, త్యాగదొడ్డి 43.0, వనపర్తి జిల్లా పెబ్బేరులో 42.9, నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్ల 42.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 42.5, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News April 5, 2024

NZB: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

డిచ్పల్లి, నిజామాబాద్ రైల్వే స్టేషన్ మధ్యలో కిలో మీటర్ 467/8-7 వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే SI సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయస్సు 45-50 సంవత్సారాలు ఉంటుందని, అతని కుడి చేతి పైన శంకర్ అని పచ్చ బొట్టు ఉందన్నారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తు పడితే వెంటనే నిజామాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలని, ఫోన్ నంబర్ 87126 58591కు సమాచారం ఇవ్వాలని SI సూచించారు.