India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా గద్వాల జిల్లా ధరూర్ లో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వడ్డేపల్లి 43.3, త్యాగదొడ్డి 43.0, వనపర్తి జిల్లా పెబ్బేరులో 42.9, నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్ల 42.5, నారాయణపేట జిల్లా ధన్వాడలో 42.5, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
డిచ్పల్లి, నిజామాబాద్ రైల్వే స్టేషన్ మధ్యలో కిలో మీటర్ 467/8-7 వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే SI సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయస్సు 45-50 సంవత్సారాలు ఉంటుందని, అతని కుడి చేతి పైన శంకర్ అని పచ్చ బొట్టు ఉందన్నారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తు పడితే వెంటనే నిజామాబాద్ రైల్వే పోలీసులను సంప్రదించాలని, ఫోన్ నంబర్ 87126 58591కు సమాచారం ఇవ్వాలని SI సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది వ్యక్తుల ప్రైవేటు సంభాషణ విన్న నీచ చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి దక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర కీలకంగా ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం తప్పు చేయకుంటే గుమ్మడికాయ దొంగల్లా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా తమ ప్రభుత్వం వదలిపెట్టదని హెచ్చరించారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జైనథ్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివప్రసాద్ రెడ్డి శుక్రవారం తెలిపారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీకి చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి తనకు మార్కెట్ కమిటీలో స్థానం కల్పించినందుకు మాజీ మంత్రి జోగురామన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ నియోజకవర్గం నుంచి తాను, ఢిల్లీలో నరేంద్ర మోదీ విజయం ఖాయమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం చిట్యాల మున్సిపల్ కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ లాంటిదని ఆ పార్టీకి ఢిల్లీలో గల్లీలో నూకలు చెల్లిపోయాయని విమర్శించారు.
గత నెలలో 46 మంది ఈవ్ టీజర్స్‌పై ఈ-పెట్టి కేసులు పెట్టి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ తెలిపారు. మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ర్యాగింగ్, ఇవ్ టీజింగ్, ఏదైనా అవమానానికి గురైనట్లయితే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నంబర్ 8712667434 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం దారుణ హత్య జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయ సమీపంలో నివసిస్తున్న అంబదాస్ మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం కాసేపు సేద తీరుతున్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేశ ముఖచిత్రాన్ని మార్చేసే కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచి 10 లక్షల మందితో జంగ్ సైరన్ ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. తుక్కుగూడలో ‘జన జాతర’ పేరిట రేపు నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ప్రకటించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఈరోజు పరిశీలించారు.

Sorry, no posts matched your criteria.