Telangana

News September 26, 2024

నవాబుపేట: బహిర్భూమికి వెళ్లిన మహిళపై లైంగిక దాడి

image

బహిర్భూమికి వెళ్లిన మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఈనెల 14న జరగగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై విక్రం వివరాలిలా.. నవాబుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బొంత శివ అనే వ్యక్తి ఓ మహిళ బహిర్భూమికి వెళ్లిన సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News September 26, 2024

జిల్లాలో సాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందిస్తాం : కలెక్టర్

image

సాగునీరు అందిస్తామని, రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కూసుమంచి మండలం పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వ నీటి విడుదల ప్రక్రియను గురువారం పరిశీలించారు. ఎడమ కాల్వ కట్ట వైపు ఊట నీటిని 100 హెచ్.పీ. సామర్థ్యం గల 11 మోటార్ల ద్వారా సుమారు 200 క్యూసెక్కుల నీటిని కాలువలోకి ఎత్తి పోసే ప్రక్రియను ఈసందర్భంగా కలెక్టర్ పరిశీలించారు.

News September 26, 2024

చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన ఐజీ

image

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి ఐజీ రమేశ్ ఐపీఎస్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసంబ ఐలమ్మ చేసిన పోరాటాలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

News September 26, 2024

WGL: బాధితులకు సత్వరమే న్యాయం అందించండి: సీపీ

image

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు చట్టలకు లోబడి న్యాయం అందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు పిలుపునిచ్చారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధ్వర్యంలో నేర సమీక్షా సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ప్రధాన కేసుల దర్యాప్తు వాటి పురోగతి, కేసుల్లోని నిందితుల అరెస్టులో ఆలస్యం అవ్వడంలో గల ప్రధాన కారణాలపై పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ వారిగా పోలీస్‌ అధికారులతో సమీక్ష జరిపారు.

News September 26, 2024

ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌కు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్

image

మహబూబ్ నగర్‌లోని ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌కు రిసెప్షన్ వర్టికల్ విధానంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు లభించిందని జిల్లా ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. ఉమెన్ పీసీ జయమ్మను ఎస్పీ ఘనంగా సత్కరించారు. జయమ్మని ఆదర్శంగా తీసుకొని వర్టికల్ విభాగంలో అన్ని పోలీస్ స్టేషన్లు ప్రథమ స్థానంలో నిలవాలని కాంక్షించారు.

News September 26, 2024

గచ్చిబౌలి: మహిళా పోరాట శక్తికి ప్రతీకగా నిలిచారు: సీపీ

image

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా పోరాట శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు.

News September 26, 2024

నిర్మల్: అరెస్టు అయిన ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

image

నిర్మల్ జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు దాసరి రమేశ్, వెంకటేశ్ గౌడ్‌‌ను బిట్ కాయిన్/క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్‌ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై స్పందించి డీఈవో రవీందర్ రెడ్డి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 26, 2024

NZB: ఈ నెల 30న ఆర్చరీ క్రీడాకారుల ఎంపికలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో భాగంగా ఈ నెల 30న ఆర్చరీ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ నిర్వహణ కార్యదర్శి నాగమణి తెలిపారు. ఈ ఎంపికలు నిజామాబాద్‌లోని నాగారంలో గల రాజారాం స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని పాఠశాలల్లో చదువుతున్న అండర్ 14, 17 బాల బాలికలు తమ బోనఫైడ్, సర్టిఫికెట్స్ తీసుకొని హాజరుకావాలన్నారు.

News September 26, 2024

NLG: ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

image

NLG జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. రైతుల ద్వారా బయోమెట్రిక్ లేదా ఐరిస్ సేకరించిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయాలనే విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో గతంలో ఇచ్చిన బయోమెట్రిక్ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

News September 26, 2024

GHMCలో చాకలి ఐలమ్మకు ఆమ్రపాలి నివాళి

image

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పూలమాలేసి నివాళులర్పించారు. మహిళల ధైర్యానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచిన ఆమె పోరాటాలను కమిషనర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.