Telangana

News April 5, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్..

image

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని, తీవ్రమైన వడగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే బయటకు వెళ్లాలని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

News April 5, 2024

ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదం.. వృద్ధునికి తీవ్ర గాయాలు

image

ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధునికి తీవ్ర గాయాలయ్యాయి. చాందా (టి) గ్రామ సమీపంలో శుక్రవారం రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న 70 ఏళ్ల వృద్ధుడు రాందాస్‌ను ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాందాస్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన ఈఎంటీ కిషన్, పైలెట్ ముజఫర్ లు క్షతగాత్రుణ్ని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

News April 5, 2024

HYD: ఐపీఎల్ మ్యాచ్.. యువతకు ఓటు హక్కుపై అవగాహన

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను తెలియజేసేలా అవగాహన నిర్వహించి చైతన్యం తేవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వీప్ నోడల్ అధికారి తెలిపారు.

HYD: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ARREST

image

HYD రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బండ్లగూడ సన్ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయచంద్‌ వద్ద 15 గ్రాముల డ్రగ్స్‌ను మాదాపూర్ SOT టీమ్ సీజ్ చేసింది. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాటు వేసి SOT సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. జయచంద్ పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు.

News April 5, 2024

బోధన్: బాలుడి అదృశ్యం.. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

image

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గోసం బస్తీకి చెందిన రేణుక తన కొడుకు నాని(6)ని తీసుకుని రాకాసిపేటలో కూలీ పనికి వెళ్లింది. అక్కడ నాని ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో రేణుక బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.

News April 5, 2024

కరీంనగర్: 21.30 క్వింటాళ్ల గన్ పౌడర్ స్వాధీనం

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లిలో నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, స్థానిక ఎస్సై జన్ను ఆరోగ్యం పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా హుజూరాబాద్ గ్రామానికి చెందిన కన్నబోయిన మహేందర్ ఒక రూమంలో అక్రమంగా 21.30 క్వింటాళ్ల గన్ పౌడర్ దాచి పెట్టినట్లు ఎస్సై చెప్పారు. అతడిపై కేసు నమోదు చేశామన్నారు.

News April 5, 2024

HYD: మల్కాజిగిరిలో పోస్టర్ల కలకలం 

image

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు ప్రత్యక్షమై కలకలం రేపుతున్నాయి. పోస్టర్లలో నాన్ లోకల్ వర్సెస్ లోకల్ అంటూ ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటలను కలవాలంటే 166 కిలోమీటర్లు ప్రయాణం చేసి హుజూరాబాద్ వెళ్లాలని.. కాంగ్రెస్ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిని కలవాలంటే 59 కిలోమీటర్లు ప్రయాణం చేసి చేవెళ్ల వెళ్లాలని.. కానీ BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ అని ఇక్కడే మనతోనే ఉంటారని పోస్టర్లలో రాశారు. 

రసవత్తరంగా పాలమూరు రాజకీయం

image

MBNR పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది.. ప్రధాన పార్టీల అభ్యర్థులు డీకే అరుణ, డా.వంశీచంద్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అభ్యర్థులు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీటు చేజార్చుకోవద్దని కాంగ్రెస్, BRS, BJP పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. దీంతో పాలమూరు రాజకీయం రసవత్తరంగా మారింది. ఎవరికి వారు విజయం పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.