Telangana

News April 6, 2024

నేడు HYDలో ట్రాఫిక్‌ మళ్లింపు

image

తుక్కుగూడలో కాంగ్రెస్‌ తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. NH- 44 బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణభారతి ట్రస్టు, పెద్ద గోల్కొండ సర్వీసు రోడ్డు నుంచి ఓల్డ్‌ పీఎం మీటింగ్‌ స్థలం వద్ద పార్కింగ్‌ చేయాలన్నారు.

News April 6, 2024

నేడు HYDలో ట్రాఫిక్‌ మళ్లింపు

image

కాంగ్రెస్‌ తుక్కుగూడలో తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. NH- 44 బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణభారతి ట్రస్టు, పెద్ద గోల్కొండ సర్వీసు రోడ్డు నుంచి ఓల్డ్‌ పీఎం మీటింగ్‌ స్థలం వద్ద పార్కింగ్‌ చేయాలన్నారు.

News April 6, 2024

ఉమ్మడి జిల్లాలో శుభకార్యాల వేళ ఎన్నికల కోడ్ కష్టాలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 9 నుంచి 28 వరకు ఎక్కువమంది పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి సామాగ్రిని సమకూర్చుకోవడానికి వివిధ ఖర్చుల నిమిత్తం షాపింగ్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ చెల్లింపులకు ఆదాయపు పన్ను శాఖ ఆంక్షలు ఉండడం, ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో రూ.50 వేలకు మించి నగదు తీసుకువెళ్తే పోలీసులు తనిఖీలు చేస్తుండడంతో.. వారు ఇబ్బందులు పడుతున్నారు.

News April 6, 2024

సంగారెడ్డి: 15 నుంచి వార్షిక పరీక్షలు

image

జిల్లాలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు వార్షిక పరీక్షలు జరుగుతాయని డీఈవో వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు వెంటనే మూల్యాంకనం చేయాలని చెప్పారు. 23వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలని సూచించారు.

News April 6, 2024

GREAT.. KNR జిల్లా వాసి అద్భుత ఆవిష్కరణ

image

చదివింది పదో తరగతి అయినప్పటికీ నూతన పరికరాలను తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన తిరుపతి. పదేళ్లు సింగపూర్‌లో ఉండి 20 రోజుల క్రితం స్వగ్రాయానికి వచ్చారు. రైతులకు ఉపోయోగపడేలా రూ.15వేల ఖర్చుతో 2 వారాల్లోనే సైకిల్ మోటార్‌ను తయారు చేశారు. లీటరు పెట్రోల్‌కు 20కి.మీ దూరం ప్రయాణించేలా రూపొందించాడు. కాగా, గతంలో గడ్డికోసే యంత్రం, పసుపు తవ్వే యంత్రాన్ని కూడా తయారుచేశాడు.

News April 6, 2024

పర్యాటకులను ఆకట్టుకునేలా భీమునిపాదానికి సొబగులు!

image

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భీమునిపాదం జలపాతం వద్ద పర్యాటకులను ఆకట్టుకునేలా వివిధ సొబగులను దిద్దుతున్నారు. రూ.40లక్షల వ్యయంతో జలపాతం ఎదురుగా వాచ్ టవర్, 14 బల్లాలను, బండరాళ్లతో నడక దారి పనులు చేస్తున్నారు. వంటలు చేసుకునేలా గదులు, బోరు, దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశారు. పర్యాటకుల భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

News April 6, 2024

కోదాడలో కరెంట్ షాక్‌తో కూలీ మృతి 

image

కరెంట్ షాక్‌తో కూలీ మృతి చెందిన ఘటన కోదాడ మండలం నల్లబండగూడెం శివారులో జరిగింది. రెడ్ల కుంటకు చెందిన మహమ్మద్ అబ్దుల్ హలీం విద్యుత్ ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ఇంటి పైనుంచి 11 కేవీ వైర్ వెళ్లిన విషయం గమనించకుండా అల్యూమినియం బద్దెలు ఎత్తుతుండగా అవి విద్యుత్ తీగల తగిలి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.

News April 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు నిరసన దీక్షలు
> ముదిగొండలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
> జన జాతరకు తరలనున్న కాంగ్రెస్ శ్రేణులు
> ఖమ్మంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటన
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ బంద్
> తాగునీటి ఎద్దడి పై జిల్లా ప్రత్యేక పర్యవేక్షణ అధికారి సురేంద్రమోహన్ సమీక్ష
> భద్రాద్రి జిల్లా కలెక్టర్ లోక్ సభ ఎన్నికలపై సమీక్ష

News April 6, 2024

సెలవుల్లో ఊర్లకు వెళుతున్నారా..? జాగ్రత్త!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలు పూర్తికాగా.. మరో కొద్దిరోజుల్లో మిగతా విద్యార్థులకు సెలవులు రానున్నాయి. ఈ సందర్భంలో విహారయాత్రలకు, ఊర్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు తెలియజేస్తున్నారు. విలువైన వస్తువులను లాకర్లలో, లేదా వెంట తీసుకెళ్లాలి.
పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాలు అమర్చుకోవాలి.

News April 6, 2024

MBNR: 7న ప్రవేశ పరీక్ష.. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి

image

మహబూబ్ నగర్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి పదో తరగతి ప్రవేశాలకు ఈనెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ తెలిపారు. కావున ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ సైట్  telanganams.cgg.gov.in లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని డీఈవో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.