Telangana

News March 19, 2024

ఖమ్మం: మహిళా ఓటర్లే అధికం

image

ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో మహిళా ఓటర్లే అధికం. 2019లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో 7,73,428 మంది మహిళా ఓటర్లు ఉండగా.. ఈసారి వీరి సంఖ్య 8,39,640కి పెరిగింది. పురుష ఓటర్లు 7,39,600 మంది నుంచి 7,84,043 మందికి చేరుకున్నారు. మహబూబాబాద్‌ స్థానంలో 2019లో 7,21,383 మంది మహిళా ఓటర్లు ఉండగా ఈసారి వీరి సంఖ్య 7,81,339కి పెరిగింది. పురుష ఓటర్లు 7,01,921 మంది నుంచి 7,45,564 మందికి చేరారు.

News March 19, 2024

లోక్‌సభ ఎన్నికలపై ఎమ్మెల్యేల సమావేశం

image

లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు సమాయత్తమవుతున్నారు. పార్టీ ప్రచార వ్యూహాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో సమావేశమయ్యారు. ZHB పరిధిలోని ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార వ్యూహం, పార్టీలో చేరికలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. కార్యక్రమంలో సురేష్ శెట్కార్, షబ్బీర్ అలీ, మదన్ మోహన్ తదితరులు ఉన్నారు.

News March 19, 2024

ADB: BJP ST మోర్చా ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకం

image

తెలంగాణ రాష్ట్ర 17 పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా  BJP ST మోర్చా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను రాష్ట్ర BJP ST మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ప్రకటించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ BJP ST ఎలక్షన్ ఇన్‌ఛార్జ్‌గా జెడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్, పెద్దపల్లి పార్లమెంట్ ST మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ఆసిఫాబాద్ MLA అభ్యర్థి ఆత్మారాం నాయక్‌ని నియమించారు.

News March 19, 2024

కామారెడ్డి: ‘అనుమతి లేని ప్రకటనలను గుర్తించాలి’

image

MCMC టీమ్ ఎన్నికల ప్రచారం, చెల్లింపు వార్తలు గుర్తించడం, అనుమతి లేకుండా ప్రకటనలు వేయడం వంటివి గుర్తించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం మీడియా మానిటరింగ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన ప్రకటనలకు అనుమతి అదేరోజు అందించే విధంగా MCMC పనిచేయాలన్నారు.

News March 19, 2024

ర్యాలీలు, ధర్నాలకు అనుమతులు తప్పనిసరి: సిద్దిపేట సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 3 తేదీ వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, బహిరంగసభలకు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్లలో అనుమతులు తీసుకోవాలని సూచించారు.

News March 19, 2024

MBNR: ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

image

మహబూబ్ నగర్: సార్వత్రిక విద్య (ఓపెన్ స్కూల్) వార్షిక పరీక్షలు వచ్చే నెల 25 నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ తెలిపారు. ప్రతి రోజు రెండు పూటలు పరీక్షలు ఉంటాయని ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ప్రయోగ పరీక్షలు మే 3 నుంచి 10 వరకు ఉంటాయని పేర్కొన్నారు.

News March 19, 2024

ములుగు: డీఎల్ఎస్ఏలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ములుగు జిల్లాలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ( డిఎల్ఎస్ఎ)లో మూడు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆఫీస్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, ఏదేని డిగ్రీతో పాటు టైపింగ్‌లో అనుభవం ఉండాలన్నారు.

News March 19, 2024

బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై సమాచారం అందించాలి: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఎన్నికల వ్యయనిర్వహణలో భాగంగా ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ సమావేశంలో ఆమె బ్యాంకర్లతో మాట్లాడారు.

News March 19, 2024

ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలి:కలెక్టర్

image

ఖమ్మం : అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని అన్ని శాఖల కార్యాలయాల సందర్శన చేసి, రాజకీయ నేతల, రాజకీయ పార్టీలకు సంబంధించి క్యాలెండర్లు, పోస్టర్లు ఫోటోలు తొలగించింది పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ యువరాజు పాల్గొన్నారు.

News March 19, 2024

వేములవాడ రాజన్న గుడి చెరువు పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి స్వామి గుడి చెరువు అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గుడి చెరువు పనులను సోమవారం అయన క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి పరిశీలించారు. వచ్చే నెల ఆఖరిలోగా పనులను పూర్తిచేయాలని టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. శివార్చన స్టేజ్ నిర్మాణ పనులను పరిశీలించి ఈఈకి పలు సూచనలు చేశారు.