India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మధిరలోని మైనర్ బాలికను వేధించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మధిర రాయపట్నంకు చెందిన మల్ల కార్తీక్ అనే యువకుడిపై మైనర్ బాలికను వేధించిన కారణంగా పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్సై సంధ్య తెలిపారు.
ప్రేమిస్తున్న యువతి తనను తిరస్కరించిందని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు.. అల్లీనగర్‌లో ఉండే సయ్యద్ షరీఫ్ కుమారుడు సోహెల్(20) మామిడిపల్లిలో ఓ కంపెనీ ఉద్యోగి. స్థానికంగా ఓ యువతిని అతడు ప్రేమిస్తున్నాడు. ఈనెల 6న ఆ యువతిని కలిసి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆమె తిరస్కరించడంతో ఉరేసుకుని చనిపోయాడు.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో 24,మార్చి 2024 నాటికి మొత్తం ఓటర్లు 16,44,715 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 8,42,575, పురుషులు 8,42,054 మంది ఉన్నారు. పురుషులకంటే 521 మహిళలే అధికంగా ఉన్నారు. జిల్లాలో మహిళ ఓటర్లే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు.
డా.బీఆర్. అంబేడ్కర్ డిగ్రీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మే 17 నుంచి 20వ తేదీ వరకు, మూడో సంవత్సరం పరీక్షలు వచ్చే నెల 17 నుంచి 22 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మే 24 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మిగతా వివరాలకు వెబ్సైట్ www.braouonline.in లేదా ఎంవీఎస్ కళాశాలలో సంప్రదించాలని కోరారు.
అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద ఉగాది పండుగ సందర్భంగా ఈనెల 11 వరకు అటవీ నిబంధనలను సడలించినట్లు అమ్రాబాద్ రేంజ్ అధికారి ఆదిత్య తెలిపారు. 6 నుంచి 11వ తేదీ వరకు మన్ననూరు, దోమలపెంట చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు వాహనాలను అనుమతించనున్నట్లు ఆదేశాలు వచ్చాయని, రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలకు అనుమతిస్తున్నప్పటికీ ఒకేసారి కాకుండా కొన్ని వాహనాలను కలిపి పంపిస్తున్నారు.
చేనేత కార్మికుల ఆత్మహత్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ మాజీ MLA ఈరవర్తి అనిల్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. మూడో సారి అధికారం వస్తుంది.. ముఖ్యమంత్రి పదవి మూడడుగుల దూరంలో ఉందని అత్యాశకు పోయిన కల్వకుంట్ల డ్రామారావుకు ప్రజలు తమ తీర్పుతో మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశారని అన్నారు. అందుకే పిచ్చి ప్రేలాపనలు, తుగ్లక్ ఆక్రందనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేసిన ఘటన అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సాయిభగవాన్ కాలనీలో ఉండే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫోన్‌కు పార్ట్ టైం జాబ్ అంటూ లింక్ వచ్చింది. తొలుత పెట్టుబడి పెట్టి టాస్క్‌లు చేస్తే కమీషన్ ఇస్తామని చెప్పడంతో రూ.5 వేలు పెట్టుబడి పెడితే కమీషన్ వచ్చింది. దీంతో పలు దఫాలుగా రూ.11.10 లక్షలు పంపాడు. అనంతరం మోసపోవడంతో బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
స్టార్టప్‌లతో యువతరాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో టీ-హబ్ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా యంగ్ ఎకో స్టార్టప్స్ కాన్‌ప్లుయెన్స్ పేరుతో ఈనెల 28, 29 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సెంటర్ ఫర్ గ్లోబల్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ సహకారంతో ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నామని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://bit.ly/3U2WKGr దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Sorry, no posts matched your criteria.