Telangana

News September 5, 2024

నాగార్జునసాగర్ జలాశయం సమాచారం

image

నాగార్జునసాగర్ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం నీటిమట్టం 586.70 అడుగులు (303.9495 టీఎంసీలు)గా ఉంది. ఎగువ నుంచి 1,83,563 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా విద్యుదుత్పత్తికి 29,557 క్యూసెక్కులు, కుడికాల్వకు 7,578 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీకి 1,800, వరద కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News September 5, 2024

ఖమ్మం‌లో నేడు పలు రైళ్లు రద్దు

image

ఖమ్మం జిల్లాలో నేడు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలకు మహబూబాబాద్ జిల్లా
కేసముద్రం తాళ్లపూసపల్లి, రాయనపాడు వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో నేడు పలు రైళ్లను ద.మ. రైల్వే రద్దు చేసినట్లు ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పె క్టర్ జాఫర్ వెల్లడించారు. పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించనున్నారు. 

News September 5, 2024

బ్రిక్స్ సమావేశాల్లో నారాయణపేట న్యాయవాది

image

మరికల్‌కు చెందిన యువ న్యాయవాది అయ్యప్ప రష్యాలో జరుతున్న 16వ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. బ్రిక్స్ సమావేశంలో తెలంగాణ నుంచి పాల్గొన్న మొదటి వ్యక్తిగా అయ్యప్ప. ఈ సందర్భంగా అయ్యప్ప పలు దేశాల మంత్రులు, ప్రతినిధులను కలిశారు. భవిష్యత్తులో బ్రిక్స్ దేశాలు డాలర్‌పై ఆధారపడకుండా కామన్ కరెన్సీ విధానం తీసుకురావడం కోసం సమావేశంలో చర్చించినట్లు ఆయన చెప్పారు.

News September 5, 2024

విద్యా వైద్యం పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్: మంత్రి రాజనర్సింహ

image

పేదవాడికి ప్రాథమిక హక్కుగా అందాల్సిన విద్యా, వైద్యంపై జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్నారు. అ భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా ట్రామ, డయాలసిస్ కేంద్రాలు, నూతన మండలాల్లో PHCలు ఏర్పాటు చేయాలన్నారు.

News September 5, 2024

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా 130 మంది ఎంపిక

image

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 130 మంది ఉపాధ్యాయులను జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. నల్లగొండ జిల్లాలోని వివిధ స్కూళ్లలో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోగా మండల కమిటీ పలు ఉపాధ్యాయుల పేర్లను సూచిస్తూ జిల్లా అధికారులకు నివేదిక పంపించింది. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందుకోనున్నారు.

News September 5, 2024

ఏపీ మాదిరిగా తెలంగాణకు సాయం చేయాలి: మంత్రి పొంగులేటి

image

వరదల వల్ల ఏపీలో జరిగిన నష్టానికి కేంద్రం ఎలా సాయం చేయాలనుకుంటుందో తెలంగాణకు కూడా అలానే సహాయం అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

News September 5, 2024

చెరువుల సందర్శన చేయవద్దు: పోలీస్ కమిషనర్

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, వాటిని చూసేందుకు ప్రజలేవరు రావద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణాలతో పాటు గ్రామ పంచాయతీల పరిధిలో చిన్న, పెద్ద చెరువులు, వాగులు ప్రమాదకర స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయని చెరువులు, వాగులు, వంకలు చూసేందుకు వెళ్లవద్దన్నారు.

News September 5, 2024

రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం: జూపల్లి

image

కుమ్మెర సమీపంలోని వెంకటాద్రి రిజర్వాయర్ పంప్ హౌస్‌లోకి వరద నీరు చేరడంపై అధికారులు నివేదికను సమర్పించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం మంత్రి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి కుమ్మెర పంప్ హౌస్‌ను పరిశీలించారు. పంప్ హౌస్ ఏర్పాటుపై రూపొందించిన చిత్రాలతో అంచనాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

News September 5, 2024

పోచారం ప్రాజెక్టును సందర్శించిన జిల్లా అడిషనల్ కలెక్టర్

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును బుధవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున దిగువ ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించొద్దని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రభాకర్ చారి, ఇరిగేషన్ ఏఈ ఉన్నారు.

News September 5, 2024

HYD: పెరిగిన విగ్రహాల తయారీ.. తగ్గిన ధరలు?

image

గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ ధూల్‌పేట. వినాయకచవితి సమీపించడంతో HYD, ఇతర జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే, గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు ఎక్కువగా ఉంటాయని భారీగా గణనాథులను వ్యాపారులు సిద్ధం చేశారు. అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగలేదు. ధరలు తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నట్లు టాక్. 2023లో రూ.60 వేలు పలికిన విగ్రహం ఈసారి రూ. 40 వేలకు అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు.