India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బియ్యం స్టాక్‌లో తేడా ఉండడంతో తల్లాడ మండలంలోని మిట్టపల్లిలోని రెండు రేషన్ షాపులను సివిల్ సప్లయ్ అధికారులు సీజ్ చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టపల్లిలోని 5వ నెంబర్ షాపు 13.10 క్వింటాళ్లు, 23వ షాపులో 12 .64 క్వింటాళ్ల బియ్యం తూకంలో తేడా ఉండడంతో సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ షాపు బాధ్యతలను రామానుజవరం, నూతనకల్ డీలర్లకు అప్పగించారు.
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు వ్యక్తులను సైబర్ నేరగాళ్లు టోపీ పెట్టి రూ. 20 లక్షలు కాజేసిన సంఘటనలు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్నాయి. సీపీ అనురాధ వివరాల ప్రకారం.. సిద్ధిపేట పట్టణానికి చెందిన ఒక యువతి, నంగునూరు మండల కేంద్రానికి చెందిన మరొక యువతి ఉద్యోగ అన్వేషణలో భాగంగా గూగుల్లో ఓ గుర్తు తెలియని లింకులో తమ వివరాలు నమోదు చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు.
ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఓ వైపు దిగుబడి లేక, మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చి రైతులు విలవిల్లాడిపోతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ధరలు పడిపోయాయి. దీనికి తోడు ప్రస్తుతం ఎండలు పెరగడంతో కాయ రంగు మారుతోంది. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు, మిర్చి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పెట్టుబడులకు సంబంధించి ఆదాయం కూడా వచ్చేలా లేదని వాపోతున్నారు.
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కొడ్తె మాటు తండాకు చెందిన చందా(50) అనే రైతు విద్యుత్ షాక్‌తో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. తండా శివారులోని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది బిజినేపల్లి మండలం గంగారం గ్రామ సమీపంలోని వస్రాంతండాలో సోమవారం లేగదూడపై చిరుత దాడి చేసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… తండాకు చెందిన ఆంబోతు రాముడు అనే రైతు గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ పొలంలో ఆవు దూడను చిరుత దాడి చేసి చంపింది అన్నారు. చిరుత సంచారంతో ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని గ్రామస్తులు వాపోయారు.
చేవెళ్ల ఎంపీగా 3 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో తాను గెలుస్తానని విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొయినాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పేరుతో లక్ష ఓట్లు మెజారిటీ, మరో రెండు లక్షల మెజారిటీని మాత్రం కార్యకర్తల పేరుతోనే సాధించనున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ అభివృద్ధి ప్రదాత అని అన్నారు. హనుమంతుడి గుడిని కూల్చిన వ్యక్తి జై శ్రీరామ్ అంటే నమ్మేస్థితిలో ఎవరూ లేరన్నారు.

ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఎడారి దేశం వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన నిమ్మ రాజశేఖర్(36) సౌదీ అరేబియాలో డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 3న తను ఉంటున్న గదిలో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి మిత్రులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజశేఖర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
HYD శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో హీరో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమా షూటింగ్ టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్‌కు తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు వచ్చారు. వీరి కలయికను చూసిన టీమ్ సభ్యులు తెగ సంబరపడి పోయారు. సోమవారం ముగ్గురు అన్నదమ్ములు ఒకే దగ్గర ఉన్నారని తెలుసుకున్న అభిమానులు వారిని చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు.

Sorry, no posts matched your criteria.