India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి 73 ఆర్జీలు వచ్చినట్టు వివరించారు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలన్నారు. కానీ ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు.
గతంలోని ఉమ్మడి జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2008పునర్విభజనలో మిర్యాలగూడ రద్దయ్యింది. కొత్తగా భువనగిరి నియోజకవర్గం ఏర్పడింది. ఈలోక్‌సభ స్థానం పరిధిలో మునుగోడు, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి నియోజకవర్గాలతో పాటు పొరుగు జిల్లాల్లోని జనగామ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలున్నాయి. నల్గొండ పరిధిలో నల్గొండ, దేవరకొండ, సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట ఉన్నాయి.
దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల నుంచి 100 పడకలకు మార్చాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని షబ్బీర్ అలీ తెలిపారు. వంద పడకల ఆసుపత్రిగా మార్చితే ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలు.. HYD అల్వాల్‌లో నివాసం ఉండే కే.దుర్గయ్య(41) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో సనత్‌నగర్-అమ్ముగూడ రైల్వేస్టేషన్ల మధ్య అతడు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి రెండు కాళ్లు తెగి, చికిత్స పొందుతూ మరణించాడు.

కల్లూరు మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ డీఈ కార్యాలయం ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ జాతీయ రహదారిపై MSN పరిశ్రమ ముందు మారుతి ఈకో వ్యాన్ అదుపుతప్పి పక్కన చెట్టును ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరు నుంచి కాశీకి వెళ్తున్నట్లు సమాచారం.

మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను తుక్కుగూడలోని వారి నివాసంలో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారి, అందెల శ్రీరాములు, కేఎస్ రత్నం, నరసింహరెడ్డి, విక్రమ్ రెడ్డి, పలువురు కౌన్సిలర్స్ కార్పొరేటర్లు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈటల, విశ్వేశ్వర్ రెడ్డి, పూలబొకే ఇచ్చి ఘనంగా సన్మానించారు. అనంతరం వారితో ముచ్చటించి వారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన BRS గ్రామ కమిటీ నాయకుడు జనగాం నారాయణ గుండెపోటుతో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పని నిమిత్తం బయటకు వస్తున్న నారాయణ రోడ్డుపై అకస్మాతుగా కుప్పకులాడు. అది గమనించిన గ్రామస్థులు అతనికి ఫిట్స్ వచ్చిందేమొనని తాళాల గుత్తి అతని చేతిలో పెట్టారు. కాగా అప్పటికే నారాయణ మృతిచెందినట్లు వారు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.