Telangana

News September 5, 2024

HYD: పెరిగిన విగ్రహాల తయారీ.. తగ్గిన ధరలు?

image

గణపతి విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్ ధూల్‌పేట. వినాయకచవితి సమీపించడంతో HYD, ఇతర జిల్లాల నుంచి విగ్రహాల కొనుగోలుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే, గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు ఎక్కువగా ఉంటాయని భారీగా గణనాథులను వ్యాపారులు సిద్ధం చేశారు. అనుకున్న స్థాయిలో విక్రయాలు జరగలేదు. ధరలు తగ్గించి అమ్మకాలు సాగిస్తున్నట్లు టాక్. 2023లో రూ.60 వేలు పలికిన విగ్రహం ఈసారి రూ. 40 వేలకు అమ్ముతున్నట్లు ఓ వ్యాపారి తెలిపారు.

News September 4, 2024

సర్టిఫికెట్లు ఇప్పించండి : మున్నేరు బాధ్యత విద్యార్థులు

image

ఏండ్ల తరబడి కష్టపడి చదువుకున్న సర్టిఫికెట్లు మున్నేరు పాలు అయ్యాయని బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 మంది విద్యార్థుల భవిష్యత్తు మున్నేరు వరద ప్రశ్నార్థకంగా చేసిందని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి సర్టిఫికెట్లు పునర్ జారీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే

News September 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సిరిసిల్ల కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం. @ మల్యాల మండలంలో నవవధువు ఉరివేసుకొని ఆత్మహత్య. @ పెద్దపల్లి జిల్లాలో 67 డెంగ్యూ కేసులు నమోదు. @ మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్యకు గురుబ్రహ్మ అవార్డు. @ మట్టి గణపతులను ఏర్పాటు చేయాలన్న జగిత్యాల, కరీంనగర్ కలెక్టర్లు. @ అంగన్వాడి కేంద్రాలలో పిల్లల ఎత్తు, బరువు తప్పకుండా చూడాలన్న సిరిసిల్ల కలెక్టర్.

News September 4, 2024

మళ్లీ మున్నేరుకు పెరుగుతున్న వరద

image

ఖమ్మం మున్నేరుకు వరద మళ్లీ పెరుగుతోంది. కాల్వఒడ్డు వద్ద ఉన్న మున్నేరు వాగు నీటిమట్టం ఉదయానికి 10 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 13 అడుగులకు చేరింది. క్రమంగా 3 అడుగుల మేర పెరిగింది. వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ఉధృతికి సర్వం కోల్పోయామని, మళ్ళీ ముంపు ప్రాంతాలకు వరద చేరితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

News September 4, 2024

కోస్గిలో విషాదం.. నీటి గుంటలో పడి చిన్నారులు మృతి

image

నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోస్గి మండలం బలభద్రాయపల్లిలో నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచందారు. గ్రామానికి చెందిన నరసింహ, కవిత దంపతుల ఇద్దరు కొడుకులు నిహన్స్(3), భానుమూర్తి(2) బుధవారం ఇంటి పక్కన ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిగుంటలో పడిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో వారు ఊరంతా గాలించారు. చివరకు నీటి గుంతలో వెతకడంతో మృతదేహాలు దొరికాయి. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

News September 4, 2024

కల్వకుర్తి మండలంలో స్వైన్‌ఫ్లూ కేసు కలకలం

image

కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామంలో స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి మూడు రోజుల క్రితం స్వైన్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అతను హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు బుధవారం గుండూర్ గ్రామంలో సర్వే నిర్వహించారు. బాధితుని ఇంటి పరిసరాల్లో దాదాపు 50 కుటుంబాలను కలిసి వారి వివరాలను సేకరించారు.

News September 4, 2024

గురుకులాలను శిథిలం చేయాలని రేవంత్ సర్కార్ కుట్ర: RSP

image

రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురుకులాలను శిథిలం చేయాలని కుట్ర చేస్తోందని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. RSP మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలో సమిధలు అవుతున్నది ఎస్సీలని అన్నారు. ఎస్సీ గురుకులాల్లో రాజ్యాంగ, చట్టబద్ధంగా నిబంధనలకు లోబడి నియామకాలు జరిగిన 2000 మంది ఉపాధ్యాయులను రాత్రికి రాత్రే ఉద్యోగాల నుంచి తొలగించారని మండిపడ్డారు. 2000 మంది నోట్లో రేవంత్ రెడ్డి మట్టి కొట్టారంటూ విరుచుకుపడ్డారు.

News September 4, 2024

విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

image

సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో రేపు పాఠశాలలు నడుస్తాయని ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వరద ప్రభావితమైన పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని చెప్పారు. మండల విద్యాధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

News September 4, 2024

పాల్వంచలో వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి

image

వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన పాల్వంచలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. పాల్వంచ పరిధిలోని సోనియా నగర్కు చెందిన ఆర్ఎంపీ చేసిన ఇంజక్షన్ కారణంగా తన కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యుడి ఇంటి ముందు ధర్నా చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 4, 2024

శాంతి భద్రతల రక్షణలో డయల్ 100 సేవలు కీలకం: ఎస్పీ యోగేష్

image

శాంతి భద్రతల రక్షణలో డయల్ 100 సేవలు కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న బ్లూ కోర్ట్స్, పెట్రో కార్స్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులు డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించాలని, ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సహాయం అందించాలని అన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.