Telangana

News September 4, 2024

విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

image

సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో రేపు పాఠశాలలు నడుస్తాయని ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వరద ప్రభావితమైన పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని చెప్పారు. మండల విద్యాధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. 

News September 4, 2024

పాల్వంచలో వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి

image

వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన పాల్వంచలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. పాల్వంచ పరిధిలోని సోనియా నగర్కు చెందిన ఆర్ఎంపీ చేసిన ఇంజక్షన్ కారణంగా తన కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యుడి ఇంటి ముందు ధర్నా చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News September 4, 2024

శాంతి భద్రతల రక్షణలో డయల్ 100 సేవలు కీలకం: ఎస్పీ యోగేష్

image

శాంతి భద్రతల రక్షణలో డయల్ 100 సేవలు కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న బ్లూ కోర్ట్స్, పెట్రో కార్స్ పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులు డయల్ 100కు ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించాలని, ఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సహాయం అందించాలని అన్నారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

News September 4, 2024

సిరిసిల్ల: కేంద్రాల్లో పిల్లల ఎత్తుబరువు తప్పనిసరిగా కొలవాలి : కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు తప్పనిసరిగా కొలవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాలను బుధవారం ఒక చోట చేర్చి, వీహెచ్ఎస్ఎన్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా పిల్లల ఎత్తు, బరువు కొలిచారు. ఈరోజు కేంద్రానికి రాని వారికి రేపు కొలవాలని కలెక్టర్ ఆదేశించారు.

News September 4, 2024

చెర్వుగట్టుపై వ్యక్తి మృతి

image

నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు గుట్ట పైన ఒక గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. స్థానిక సత్యనారాయణ స్వామి మండపం ముందు విగతజీవిగా ఉన్నాడు. చెర్వుగట్టు దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి నార్కట్ పల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 4, 2024

ట్విట్టర్ వేదికగా దీప్తికి మంత్రి అభినందనలు

image

తెలుగు రాష్ట్రాల నుంచి పారా ఒలంపిక్స్‌లో తొలి పథకాన్ని సాధించిన ఓరుగల్లు బిడ్డ దీప్తి జీవాంజికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. ఎన్నో కష్టాలను అధిగమించి ప్రపంచ వేదికపై కాంస్య పతకాన్ని గెలుచుకోవడం దేశానికే గర్వకారణమన్నారు. పేద కుటుంబం నుంచి పతక విజేత వరకు దీప్తి సాగించిన ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో మంత్రి అభినందనలు తెలిపారు.

News September 4, 2024

విద్య, వైద్యం పర్యవేక్షణకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: మంత్రి దామోదర్

image

పేదవాడికి ప్రాథమిక హక్కుగా అందాల్సిన విద్యా, వైద్యంపై జిల్లాస్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించినట్లు తెలిపారు. త్వరలో మెదక్లో సిటీ స్కాన్‌తో పాటు మరో డయాలసిస్ కేంద్రం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

News September 4, 2024

నీలోఫర్ కేఫ్‌లో లేబుల్స్ లేని ఫుడ్స్

image

బంజారాహిల్స్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్‌లను కూడా లేబుల్ చేయలేదు. దీంతో పాటు వంటగదిలో ఎక్స్పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.

News September 4, 2024

నీలోఫర్ కేఫ్‌లో లేబుల్స్ లేని ఫుడ్స్

image

బంజారాహిల్స్‌లోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నీలోఫర్ కేఫ్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచిన షుగర్ సిరప్, మసాలా దినుసులు వంటి లేబుల్ లేని వస్తువులు చూసి అసహనం వ్యక్తం చేశారు. అమ్మకానికి ఉంచిన కేక్‌లను కూడా లేబుల్ చేయలేదు. దీంతో పాటు వంటగదిలో ఎక్స్పైరీ అయిన అరకిలో చీజ్, మిరప పొడి, 5 కిలోల కాల్చిన వేరుశెనగలు ఉన్నాయి.

News September 4, 2024

వరద సాయం కోసం BRS ప్రజాప్రతినిధుల నెల జీతం: MP వద్దిరాజు

image

వరద విపత్తులో ఉన్న ఖమ్మం ప్రజానీకానికి అండగా ఉంటామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఒక నెల జీతాన్ని వరద సాయం కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరి ఒక నెల జీతాన్ని వరద సహాయనిధి అకౌంట్‌కు జమ చేస్తామన్నారు. కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.