Telangana

News September 4, 2024

జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే చర్యలు: ఎస్పీ

image

జైనూర్‌లో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని కోరారు. జైనూరు ఘటనలో పోలీసు యంత్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందని, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. వదంతులను ప్రచారం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

News September 4, 2024

బెల్టుషాపులు నిర్మూలించిన గ్రామాలపై శ్రద్ద: MLA రాజగోపాల్ రెడ్డి

image

మునుగోడు మండలములో బెల్టు షాపులు నిర్మూలించిన జక్కలవారిగూడెం, కచలాపురం , గంగోరిగూడెం గ్రామస్థులను MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాలువాలతో సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. బెల్టు షాపులు నిర్మూలన చేపట్టిన గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడు సైదులు, జక్కలవారిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ జక్కల శ్రీను, రాంరెడ్డి, పాపయ్య, మహిళలు పాల్గొన్నారు.

News September 4, 2024

ఈడీ కేసు మాఫీ కోసమే.. దిల్లీలో గంగుల పొర్లు దండాలు: వెలిచాల

image

ఈడీ కేసు నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ బీజేపీ చుట్టూ పొర్లుదండాలు పెడుతూ చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్‌రావు ఆరోపించారు. ప్రజల సంక్షేమం మరిచి ఆయన వారానికోసారి దిల్లీకి వెళ్తున్నారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసి కేసుల నుంచి విముక్తి కల్పించాలని ప్రాధేయ పడుతున్నారని ఆయన ఆరోపించారు.

News September 4, 2024

MBNR: గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామపంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ సహా ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొద్ది నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల నిలిచిపోవడంతో ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. ఓ వైపు ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు కార్మికులకు వేతనాలు లేక ఇబ్బందులు తప్పడంలేదు.

News September 4, 2024

ఏజెన్సీలో 21 మంది ఉత్తమ ఉపాధ్యాయులు: DEO

image

రంపచోడవరం డివిజన్ 7 గిరిజన మండలాల్లో 21 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామని ఏజెన్సీ DEO.మల్లేశ్వరావు బుధవారం తెలిపారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసే ప్రతి మండలం నుంచి 3 సీనియర్ టీచర్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా గురువారం ITDA కార్యాలయంలో వీరిని సన్మానిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

News September 4, 2024

7,480 గృహాలు దెబ్బతిన్నాయి: మంత్రి

image

వరద ఉధృతి తగ్గడంతో శానిటేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. పది డివిజన్లలో మొత్తం 7,480 గృహాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 5 జీసీబీలు , 50 ట్రాక్టర్లు, 75 వాటర్ ట్యాంకర్లు, 8 ఫైర్ ఇంజిన్లు, 600 మంది శానిటేషన్ సిబ్బందితో పనులు సాగుతున్నాయన్నారు. ఇళ్లలో బురద తొలగించేందుకు వాటర్ ట్యాంకర్లు ద్వారా నీళ్ళు సరఫరా చేస్తున్నామన్నారు. 12 హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామన్నారు.

News September 4, 2024

సంగారెడ్డి: ‘టీచర్లకు బోధనేతర పనులు అప్పగించొద్దు’

image

ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించవద్దని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని బీసీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను పూర్తిగా బోధనకు పరిమితం చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. గురుకుల పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టైం టేబుల్ అమలు చేయాలని కోరారు.

News September 4, 2024

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను అభినందించిన కేటీఆర్

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన రక్షిత కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను అభినందించారు.

News September 4, 2024

WGL: మావోయిస్టు అగ్రనేత జగన్ మృతి

image

మావోయిస్టు అగ్రనేత, మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @దాదా రణదేవ్ దాదా మృతిచెందాడు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో అతను మృతిచెందినట్టు దంతేవాడ పోలీసులు ధ్రువీకరించారు. మరణించిన జగన్ స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాజీపేట మండలం టేకులగూడెమని దంతేవాడ ఎస్పీ ప్రకటించారు.

News September 4, 2024

ఖమ్మంలో సాధారణ పరిస్థితి: తుమ్మల

image

ఖమ్మంలో వరద బాధితులు ఎవరు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సుమారు 1000 మంది వర్కర్లతో 40 జెసీబీలు, 133 ట్రాక్టర్లతో సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ప్రస్తుతం ఖమ్మం నగరం నార్మల్ స్థితికి వచ్చిందని అన్నారు.