Telangana

News September 4, 2024

ప్రకృతి ప్రేమిద్దాం.. మట్టి వినాయకులను పూజిద్దాం: హరీష్ రావు

image

సిద్దిపేటలోని గాంధీ చౌరస్తాలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రకృతి ప్రేమిద్దాం.. మట్టి వినాయకులను పూజిద్దాం అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని అన్నారు. 

News September 4, 2024

జగిత్యాల : మట్టి విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మట్టి విగ్రహాల పోస్టర్లను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించాలన్నారు. జిల్లాలో 2000 మట్టి విగ్రహాలను పంపిణి చేయడం జరుగుతుందని తెలిపారు.

News September 4, 2024

HYD: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు, సూచనలు

image

✓HYD హిమాయత్‌సాగర్ జలాశయం 4 ఫీట్ల నీటిమట్టం పెరిగితే నిండిపోతుంది ✓వర్షాలు తగ్గడంతో ఇన్‌ఫ్లో తగ్గింది
✓ఒక్క వర్షం వచ్చినా జలాశయం పూర్తిగా నిండి పోతుంది
✓జలయశయం నిండితే దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
✓HYD, RR జిల్లా కలెక్టర్లు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి
✓ఎప్పటికప్పుడు అధికారిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షించాలి.

News September 4, 2024

HYD: సెప్టెంబర్ 17న ప్రత్యేక కార్యక్రమాలు

image

HYD నగరంలోని పరేడ్ గ్రౌండ్ వద్ద సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలలో భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. మరోవైపు HYD,RR, MDCL,VKB జిల్లాల వ్యాప్తంగా అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డుల పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ప్రభుత్వం,వీటికి సంబంధించిన వివరాలు సేకరించనుంది.

News September 4, 2024

శ్రీకృష్ణుడి శోభయాత్రలో ఎమ్మెల్యేలు

image

భూత్పూర్ మండలం మదిగట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి బుధవారం నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, శ్రీకృష్ణుని శోభాయాత్రలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేశ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News September 4, 2024

ఖైరతాబాద్: గ్రేటర్ పరిధి విస్తరణకు తొలి అడుగు

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించే దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ORR సమీపంలోని 51 గ్రామాలను మున్సిపాలిటీల్లోకి కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. తరువాత మున్సిపాలిటీలనూ జీహెచ్ఎంసీలో విలీనం చేసి ‘మహా’ బల్దియాను ఏర్పాటు చేయనున్నారు, ORR లోపల, వెలుపలున్న గ్రామాలను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు కసరత్తు చేశారు.

News September 4, 2024

KNR: రోడ్డు ప్రమాదంలో నవ వరుడి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. మేడిపల్లి మండలం వల్లంపల్లికి చెందిన నవీన్(27), భూమేశ్వర్, పార్థసారథిలు మాచాపూర్ నుంచి గుంలాపూర్ వైపునకు బైకుపై వెళ్తూ గ్రామశివారులో ఆటోను ఢీకొట్టారు. ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే నెల క్రితమే సింగపూర్ నుంచి వచ్చిన నవీన్‌కు గతనెల 18న పెళ్లయింది.

News September 4, 2024

మారేడ్‌పల్లి: నలుగురు ఇంజినీర్లపై క్రమశిక్షణ చర్యలు

image

అవినీతికి పాల్పడటం, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులతో ఒకేసారి నలుగురు విద్యుత్తు ఇంజినీర్లపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నార్సింగి ఏఈ సందీప్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇబ్రహీంబాగ్ డీఈ శివశంకర్, ఏఏఈ జ్ఞానేశ్వరావులకు మెమోలు జారీ చేశారు. ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేడ్కర్‌ను కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

News September 4, 2024

HYD: పార్కులు, ఆట స్థలాల కబ్జాపై హైడ్రా దృష్టి!

image

పార్కులు, ఆట స్థలాల కబ్జాపై అతి త్వరలో హైడ్రా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. చెరువుల్లో కబ్జాల తొలగింపు తర్వాత పార్కుల ఆక్రమణలపై కొరడా ఝళిపించే అవకాశం ఉంది. ఈ లోపు ఆక్రమణలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని లేఔట్‌లపై దృష్టి సారించింది. ఆయా లేఔట్లలో పార్కు స్థలంలో పాటు, ప్రజా అవసరాలకు కేటాయించాల్సిన స్థలాలపై దృష్టి సారించనున్నారు.

News September 4, 2024

ఖానాపూర్: పేపర్ బాయ్ టు MLA

image

పేపర్ బాయ్ టు MLA వరకు ఎదిగిన ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శనీయం. నేడు పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆయన చిన్నతనంలో చదువుతోపాటు పేపర్ బాయ్‌గా, కాలేజీ రోజుల్లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరోవైపు విలేకరిగా పనిచేశారు. అనంతరం ITDA పైసా చట్టం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలుపొందారు.