Telangana

News September 4, 2024

మారేడ్‌పల్లి: నలుగురు ఇంజినీర్లపై క్రమశిక్షణ చర్యలు

image

అవినీతికి పాల్పడటం, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులతో ఒకేసారి నలుగురు విద్యుత్తు ఇంజినీర్లపై టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నార్సింగి ఏఈ సందీప్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇబ్రహీంబాగ్ డీఈ శివశంకర్, ఏఏఈ జ్ఞానేశ్వరావులకు మెమోలు జారీ చేశారు. ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేడ్కర్‌ను కార్పొరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

News September 4, 2024

HYD: పార్కులు, ఆట స్థలాల కబ్జాపై హైడ్రా దృష్టి!

image

పార్కులు, ఆట స్థలాల కబ్జాపై అతి త్వరలో హైడ్రా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. చెరువుల్లో కబ్జాల తొలగింపు తర్వాత పార్కుల ఆక్రమణలపై కొరడా ఝళిపించే అవకాశం ఉంది. ఈ లోపు ఆక్రమణలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని లేఔట్‌లపై దృష్టి సారించింది. ఆయా లేఔట్లలో పార్కు స్థలంలో పాటు, ప్రజా అవసరాలకు కేటాయించాల్సిన స్థలాలపై దృష్టి సారించనున్నారు.

News September 4, 2024

ఖానాపూర్: పేపర్ బాయ్ టు MLA

image

పేపర్ బాయ్ టు MLA వరకు ఎదిగిన ఖానాపూర్ శాసనసభ్యుడు వెడ్మ బొజ్జు జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శనీయం. నేడు పేపర్ బాయ్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆయన చిన్నతనంలో చదువుతోపాటు పేపర్ బాయ్‌గా, కాలేజీ రోజుల్లో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటూ మరోవైపు విలేకరిగా పనిచేశారు. అనంతరం ITDA పైసా చట్టం ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి MLAగా గెలుపొందారు.

News September 4, 2024

భారీగా తగ్గిన మున్నేరు వరద

image

ఖమ్మం మున్నేరు వరద ప్రవాహం భారీగా తగ్గింది. 2 రోజుల క్రితం 36 అడుగుల మేర ప్రవహించిన వరద తగ్గుకుంటూ తాజాగా 10 అడుగులకు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు వరదనీటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మున్నేరు పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఇళ్లకి చేరుకుంటున్నారు. తమ ఇంట్లోకి వెళ్లి పరిస్థితిని చూసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News September 4, 2024

HYD: SEP-21 నుంచి కోటి మంది మహిళలకు AIలో శిక్షణ

image

కోటి మంది మహిళలకు కృత్రిమ మేద(AI)లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థలతో సవిత్ ఏఐ (సౌత్ ఏసియన్ ఉమెన్ ఇన్‌ టెక్) చేతులు కలిపింది. ఈ మేరకు టీ హబ్‌లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని పత్రాలు మార్చుకున్నారు. గూగుల్ ఉమెన్ టెక్ మేకర్స్, ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, నాస్కామ్, మీటై, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (పిక్కీ ఎఫ్ఎల్), షీరోస్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. సెప్టెంబరు 21 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు.

News September 4, 2024

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో రికార్డు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మొక్కజొన్న ధర ఎవరూ ఊహించని ధర పలికి రికార్డు క్రియేట్ చేసింది. కాగా, గత వారం రూ.2,910 ధర పలికి రికార్డు నమోదు చేసిన మొక్కజొన్న నిన్న రూ.2,858కి తగ్గింది. అయితే ఈరోజు మార్కెట్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.2,970 ధర పలికింది. దీంతో మొక్కజొన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News September 4, 2024

దీప్తిని ప్రశంసించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

image

పారిస్ వేదికగా జరుగుతోన్న Paralympics2024లో దేశానికి మరో పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జీవాంజి దీప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 రేసులో దీప్తి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ విశ్వ క్రీడా వేదికపై విజేతగా నిలిచిన జీవాంజి దీప్తి మనందరికి గొప్ప స్ఫూర్తి అని ముఖ్యమంత్రి ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.

News September 4, 2024

నిజామాబాద్: షబ్బీర్ అలీకి తప్పిన ప్రమాదం

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రమాదం తప్పింది. బుధవారం ఆయన నిజామబాద్ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. నగరంలోని ఆనంద్ నగర్‌లో ఇటీవల డ్రైనేజీలో పడి మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా అటవీ శాఖ రేంజ్ ఆఫీస్ ముందు కాన్వాయ్‌లోని 3 కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లు స్వలంగా దెబ్బతిన్నాయి. కాగా ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 

News September 4, 2024

HYD: 4 రోజుల్లో 12 నెలలకు సరిపడేంత వర్షం

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలో జూన్, జూలై, ఆగస్టు లోటు వర్షపాతం నమోదు కాగా.. SEP-1 నుంచి 4 వరకు వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 4 రోజుల్లో ఏడాదికి సరిపోయేంత కురిసిందని అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు. అత్యధికంగా తాండూరులో 859.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట-843, యాలాల-824, దుండిగల్ గండి మైసమ్మ-812, శంకర్పల్లి-736.4, ఘట్కేసర్-713.9, ముషీరాబాద్-709.1, SEC-701.1 మి.మీ నమోదైంది.

News September 4, 2024

HYD: 4 రోజుల్లో 12 నెలలకు సరిపడేంత వర్షం

image

HYD, RR, MDCL,VKB జిల్లాలలో జూన్, జూలై, ఆగస్టు లోటు వర్షపాతం నమోదు కాగా.. SEP-1 నుంచి 4 వరకు వర్షం బీభత్సం సృష్టించింది. కేవలం 4 రోజుల్లో ఏడాదికి సరిపోయేంత కురిసిందని అధికారులు రిపోర్ట్ విడుదల చేశారు. అత్యధికంగా తాండూరులో 859.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. మోమిన్‌పేట-843, యాలాల-824, దుండిగల్ గండి మైసమ్మ-812, శంకర్పల్లి-736.4, ఘట్కేసర్-713.9, ముషీరాబాద్-709.1, SEC-701.1 మి.మీ నమోదైంది.