Telangana

News September 4, 2024

HYD: 200 ఎకరాల్లో AI సిటీ: మంత్రి

image

తెలంగాణకు కృత్రిమ మేధ(ఏఐ)లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News September 4, 2024

HYD: 200 ఎకరాల్లో AI సిటీ: మంత్రి

image

తెలంగాణకు కృత్రిమ మేధ(ఏఐ)లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం 200 ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. ఈనెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

News September 4, 2024

HYD: హుస్సేన్‌సాగర్ పక్కన ఫెన్సింగ్ ఏర్పాటుకు పిటిషన్

image

హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన కౌంటరు దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్ పక్కన తమ పట్టా స్థలాల రక్షణకు ఫెన్సింగ్ ఏర్పాటుకు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ బి.శరణప్పస్వామి మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి. వినోద్ కుమార్ విచారణ చేపట్టి.. ఆదేశాలు ఇచ్చారు.

News September 4, 2024

HYD: కారొబార్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీకాంత్

image

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయితి కారొబార్ & సిబ్బంది అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడrగా సాదుల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శుల, ముఖ్య నాయకుల కారొబార్, జీపీ సిబ్బంది సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు.

News September 4, 2024

MBNR: ‘మట్టి మేలు’ తలపెట్టవోయ్!

image

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి ఆకట్టుకునే రూపాల్లో ఉన్న మట్టి గణపతి విగ్రహాలను ఇప్పటినుంచే మార్కెట్లో అమ్మకానికి ఉంచుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని నిపుణులు అంటున్నారు.

News September 4, 2024

రంగారెడ్డి: కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

image

రంగారెడ్డి జిల్లాలోని 100 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ పెండింగ్‌లో ఉందని కలెక్టర్ శశాంక అన్నారు. ఇప్పటి వరకు 925 చెరువుల్లో 99 చెరువులకు మాత్రమే ఫైనల్‌ నోటిఫికేషన్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా 820 చెరువులకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. 

News September 4, 2024

శ్రావణ మాసం.. రాజన్నకు రూ.6కోట్ల 87 లక్షల ఆదాయం

image

సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి శ్రావణ మాసం సందర్భంగా ఆయా ఆర్జిత సేవల ద్వారా రూ.6 కోట్ల 87 లక్షల 22 వేల 90లు సమకూరినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అభిషేకం టికెట్ల ద్వారా రూ.21,16,500, కల్యాణాల టికెట్ల ద్వారా రూ.34 లక్షల 44 వేలు, కేశఖండనం ఒకటవ కౌంటర్ ద్వారా రూ.12,12,450, వివిధ ఆర్జిత సేవల ద్వారా ఆదాయం సమకూరినట్టు చెప్పారు.

News September 4, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు రానున్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి సిబ్బంది లేకపోవడంతో.. విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఉమ్మడి జిల్లాలో 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో.. 3,01,693 మధ్య విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో స్కావెంజర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు అయ్యాయని డీఈఓ రవీందర్ తెలిపారు.

News September 4, 2024

వరంగల్: కటిక పేదరికం.. కాంస్య పతకం

image

జీవాంజీ దీప్తి. ఇప్పుడు ఏనోట విన్నా ఇదే పేరు. పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పథకాన్ని సాధించింది. విశ్వ క్రీడల్లో నెగ్గి ఓరుగల్లు మెడలో మొదటి మెడల్ వేసింది. దీప్తి స్వగ్రామం WGL జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. వీరిది నిరుపేద కుటుంబం. దీప్తి పతకం నెగ్గి ఓరుగల్లుకు గర్వకారణంగా నిలిచింది.

News September 4, 2024

HYD: చేనేత ఉత్పత్తులు ఉపయోగించాలి: మంత్రి

image

సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవానికి చేనేత వస్త్రాలను, శాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యా శాఖ అధికారులకు సూచించారు. చేనేత వస్త్రాలను ఉపయోగించినట్లైతే నేతన్నలందరికీ ఆర్థికంగా సహకరించినట్లు అవుతుందని మంగళవారం పేర్కొన్నారు. టీచర్స్‌డేకు సింథటిక్ శాలువాలకు బదులు కాటన్ శాలువాలు వాడాలన్నారు.