Telangana

News August 28, 2025

పాఠశాలల బలోపేతానికి చర్యలు: కలెక్టర్‌

image

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం తన కార్యాలయంలో డీఈవో బిక్షపతి, జిల్లా సెక్టోరియల్ అధికారులు, ఎంఈవోలతో ఆమె విద్యా విషయక సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న పుస్తకాలు, యూనిఫాంలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై ఆమె సమీక్షించారు. విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

News August 28, 2025

సురక్ష బీమా యోజన నమోదు చేయించాలి: శేఖర్ రెడ్డి

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరినీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై)లో నమోదు చేయించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి ఆదేశించారు. ఉపాధి సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం కింద నమోదైన వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News August 28, 2025

దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్‌

image

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై గురువారం ఆమె ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2017 నుంచి ఇప్పటి వరకు 33,600 మరణాలు సంభవించినప్పటికీ, ఈ పథకం కింద కేవలం 3,121 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని కలెక్టర్ అన్నారు. దరఖాస్తుల సంఖ్య మరింత పెరగాలని ఆమె సూచించారు.

News August 28, 2025

పగిడేరు వాగు వరద ఉద్ధృతిని పరిశీలించిన సీపీ

image

కొణిజర్ల మండలం లాలాపురం- తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని గురువారం సీపీ సునీల్ దత్ పరిశీలించారు. వరద తీవ్రతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమయమైన రోడ్లు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100, 1077కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించకుండా నిరోధించాలని ఆదేశించారు.

News August 28, 2025

WGL: గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ

image

హనుమకొండ జిల్లాలోని వచ్చే నెల 5న నిర్వహించనున్న గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. హనుమకొండలోని కాజీపేట బంధం చెరువు, సిద్ధేశ్వర గుండం, హసన్‌పర్తి చెరువులను ఆయన సందర్శించి, నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఆయనతో పాటు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ట్రాఫిక్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

News August 28, 2025

ఖమ్మం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే 1077 లేదా 9063211298 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.

News August 28, 2025

మెదక్: రేపు విద్యా సంస్థలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌కి సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తల్లిదండ్రులు, పిల్లలను అవసరం లేని ప్రయాణాలకు దూరంగా ఉంచాలని సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.

News August 28, 2025

గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కార్యాచరణ: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన PM ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. గిరిజన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే 5 ఏళ్లలో రూ.79,156 కోట్లతో ఈ పథకం అమలవుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 9 మండలాల్లోని 35 గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది. గిరిజనులకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు.

News August 28, 2025

ఓయూ: ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్ తదితర కోర్సుల రెండో సెమిస్టర్, రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
SHARE IT

News August 28, 2025

ధర్పల్లి: ముంపు గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ

image

ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. వరద నీటి ఉద్ధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో ధర్పల్లి మండలంలో వాడి, నడిమి తండా, బీరప్ప తండాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.