Telangana

News September 4, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు రానున్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి సిబ్బంది లేకపోవడంతో.. విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఉమ్మడి జిల్లాలో 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో.. 3,01,693 మధ్య విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో స్కావెంజర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు అయ్యాయని డీఈఓ రవీందర్ తెలిపారు.

News September 4, 2024

వరంగల్: కటిక పేదరికం.. కాంస్య పతకం

image

జీవాంజీ దీప్తి. ఇప్పుడు ఏనోట విన్నా ఇదే పేరు. పారిస్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పథకాన్ని సాధించింది. విశ్వ క్రీడల్లో నెగ్గి ఓరుగల్లు మెడలో మొదటి మెడల్ వేసింది. దీప్తి స్వగ్రామం WGL జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. వీరిది నిరుపేద కుటుంబం. దీప్తి పతకం నెగ్గి ఓరుగల్లుకు గర్వకారణంగా నిలిచింది.

News September 4, 2024

HYD: చేనేత ఉత్పత్తులు ఉపయోగించాలి: మంత్రి

image

సెప్టెంబరు 5 ఉపాధ్యాయ దినోత్సవానికి చేనేత వస్త్రాలను, శాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యా శాఖ అధికారులకు సూచించారు. చేనేత వస్త్రాలను ఉపయోగించినట్లైతే నేతన్నలందరికీ ఆర్థికంగా సహకరించినట్లు అవుతుందని మంగళవారం పేర్కొన్నారు. టీచర్స్‌డేకు సింథటిక్ శాలువాలకు బదులు కాటన్ శాలువాలు వాడాలన్నారు.

News September 4, 2024

HYD: ఒక్కో జోన్లో 5 చెరువుల అభివృద్ధికి కార్యాచరణ

image

ఒక్కో జోన్‌లో 5 చెరువుల చొప్పున గుర్తించి సుందరీకరణ, అభివృద్ధికి కార్యాచరణ సిద్ధం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్ అధికారులను ఆదేశించారు. మహా నగరంలో చెరువుల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జోనల్ కమిషనర్లతో మంగళవారం టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు. కనీసం 50 చెరువులను గుర్తించి సీఎస్ఆర్ నిధులతో సుందరీకరణ, అభివృద్ధి చేపట్టాలన్నారు.

News September 4, 2024

ఖమ్మం విద్యాసంస్థలకు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని భారీ వర్ష సూచన దృష్ట్యా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు శుక్రవారం వరకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. సెలవు నిబంధనను అన్ని విద్యాసంస్థలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

News September 4, 2024

ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్‌ని కలవనున్న MLA వేముల

image

ప్రోటోకాల్ వివాదంపై ఎమ్మెల్యే వేముల వీవేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 30 న భువనగిరిలో మంత్రుల పర్యాటనకు ఎర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా పోలీసులువ ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే ఈ రోజు ప్రివిలేజ్ మోషన్‌ను స్పీకర్‌ని కలిసి అందించనున్నారు. పోలీసుల తీరుపై ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు.

News September 4, 2024

HYD: రాహుల్ ద్వంద్వ వైఖరి: కేటీఆర్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విమర్శించారు. ‘X’ వేదికగా మంగళవారం స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్‌తో జరుగుతున్న విధ్వంసంపై మాత్రం మౌనంగా ఉంటారు. ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ జీ’ అని ప్రశ్నించారు.

News September 4, 2024

మంచిర్యాల: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

image

కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. SI సురేశ్ వివరాలు.. పాల్వంచకు చెందిన రాధ(28), చెన్నూర్‌కి చెందిన రాముతో 9ఏళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజుల నుంచే భార్యను రాము వేధించడంతో తమ్ముడు ప్రసాద్ ఇంటికి వెళ్లింది. ఈ నెల 1న ఆమెను తీసుకెళ్లడానికి వచ్చిన రాము ఆమెతో గొడవపడి ముఖంపై దిండుతో అదిమి చంపేశాడు. ‘మీ అక్కకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది. అందుకే చంపేశా’ అని రాము ఆమె తమ్ముడికి చెప్పి పారిపోయాడు.

News September 4, 2024

నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగాలు

image

బాన్సువాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో టీజీటీ తెలుగు పోస్టు ఖాళీగా ఉందని హెచ్ఎం ధనలక్ష్మి తెలిపారు. ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 5 లోపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 4, 2024

HYD: ఫ్లడ్ కమిటీల ఏర్పాటుపై నేడు సమావేశం

image

ఫ్లడ్ కమిటీల ఏర్పాటుపై నేడు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ మేరకు ఆ శాఖ వర్గాలు మీడియాకు మంగళవారం వెల్లడించాయి. పారిశుద్ధ్య నిర్వహణ, తాగు నీటి సరఫరా, రాకపోకల పునరుద్దరణ ప్రణాళికపై చర్చలు జరగనున్నాయి. ఆయా శాఖల ఉన్నతాధికారులు హజరు కానున్నట్టు తెలిపాయి.