Telangana

News September 4, 2024

HYD: రాహుల్ ద్వంద్వ వైఖరి: కేటీఆర్

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR విమర్శించారు. ‘X’ వేదికగా మంగళవారం స్పందిస్తూ.. ‘రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగ విరుద్ధమంటూ.. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్‌తో జరుగుతున్న విధ్వంసంపై మాత్రం మౌనంగా ఉంటారు. ఇదేం ద్వంద్వ వైఖరి రాహుల్ జీ’ అని ప్రశ్నించారు.

News September 4, 2024

ఖైరతాబాద్: వరద నష్టాలపై వారాంతంలోగా వివరాలివ్వాలి

image

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను ఈ వారాంతంలోగా సమర్పించాలని సీఎస్ శాంతి కుమారి అన్ని శాఖలను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి వివరాలు సేకరించి నివేదికలు సమర్పించాలి. ప్రతి జిల్లాలో విపత్తు నిర్వహణ బృందాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు.

News September 4, 2024

హిమాయత్ నగర్: జాతీయ విపత్తుగా ప్రకటించాలి: తమ్మినేని

image

రాష్ట్రంలో వరదలను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. నెల రోజులుగా సీజనల్ వ్యాధులతో లక్షల మంది ప్రజలు ఇబ్బందిపడుతున్న దృష్ట్యా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

News September 4, 2024

HYD: నేడు విద్యుత్తు సౌధ వద్ద ధర్నా

image

తెలంగాణ విద్యుత్తు బీసీ, ఓసీ ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో బుధవారం (నేడు) ఖైరతాబాద్‌లోని విద్యుత్తు సౌధ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు ఐకాస కన్వీనర్ వెంకన్నగౌడ్ మంగళవారం తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో షరతులతో కూడిన పదోన్నతులపై ప్రభుత్వం న్యాయ విచారణ, బీసీ, ఓసీ ఉద్యోగులు నష్టపోయిన పదోన్నతులు కల్పించడం తదితర డిమాండ్లపై ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

News September 4, 2024

HYDను క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యం: CM

image

HYD నగరాన్ని భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలిలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం ప్రసంగించారు. 4 దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని జట్లకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

News September 4, 2024

HYDను క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యం: CM

image

HYD నగరాన్ని భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలిలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం ప్రసంగించారు. 4 దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని జట్లకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

News September 4, 2024

చిన్నశంకరంపేట: ఆశావర్కర్‌పై సూపర్వైజర్ దాడి

image

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశావర్కర్‌పై ఆసుపత్రి పర్యవేక్షకుడు అనిల్ డేవిడ్ దాడికి పాల్పడ్డాడు. ఆశాల సమావేశానికి వచ్చిన వారిపై విచక్షణ కోల్పోయి బూతులు తిడుతూ బయటికి గెంటేశాడు. దాడికి పాల్పడిన అనిల్ డేవిడ్‌ను విధుల నుంచి తొలగించాలని మండల వైద్యాధికారి సాయి సింధుకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆశాలు తెలిపారు.

News September 4, 2024

కొనసాగుతున్న జూరాల విద్యుత్ ఉత్పత్తి

image

జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం ఎగువ జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ ఈలు సురేశ్, సూరిబాబు వివరించారు. ఎగువలో 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 130,116 ఎం. యూ. దిగువలో ఇప్పటి వరకు 99,710 ఎంయూ విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 228.909 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామని తెలిపారు.

News September 4, 2024

మత్స్యకారులు హెల్ప్‌లైన్ నంబర్‌ సేవ్ చేసుకోండి

image

తెలంగాణ మత్స్యకారుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ సేవలను ఆ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మత్స్య భవన్‌లో మత్స్య శాఖ కమిషనర్ డా.ప్రియాంక అలా, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ హెల్ప్ లైన్ నెంబర్‌ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు సహాయార్థం 8090199299 హెల్ప్ లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు.

News September 4, 2024

జగిత్యాల: విష జ్వరంతో కోనాపూర్ పీఎసీఎస్ సీఈవో మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన రాజ్ కుమార్(27) విష జ్వరంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడు కొనాపూర్ పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్నాడు. తల్లి కొమురక్క సైతం జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొడుకు అంత్యక్రియల నిమిత్తం తల్లిని ఆస్పత్రి నుంచి తీసుకురావడం చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు.