Telangana

News September 4, 2024

జగిత్యాల: విష జ్వరంతో కోనాపూర్ పీఎసీఎస్ సీఈవో మృతి

image

జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన రాజ్ కుమార్(27) విష జ్వరంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడు కొనాపూర్ పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్నాడు. తల్లి కొమురక్క సైతం జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొడుకు అంత్యక్రియల నిమిత్తం తల్లిని ఆస్పత్రి నుంచి తీసుకురావడం చూసి గ్రామస్థులు కంటతడి పెట్టారు.

News September 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వరద ప్రభావిత ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ పర్యటన
∆} వైరాలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే
∆} సత్తుపల్లి  ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవులు  ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News September 4, 2024

మహబూబ్ నగర్-విశాఖ ఎక్స్‌ ప్రెస్ రద్దు

image

భారీ వర్షాల కారణంగా MBNR- విశాఖపట్నం, విశాఖపట్నం- MBNR(12862/61) ఎక్స్ ప్రెస్ రైళ్లను నిరవధికంగా రద్దు చేశారు. వరంగల్-ఖమ్మం మధ్యన వరదలకు పట్టాలు దెబ్బతినడంతో ఈ రైలును ఆది, సోమతో పాటు మంగళవారం కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు(12862) రోజూ సాయంత్రం 6.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి, విశాఖపట్నం నుంచి వచ్చే రైలు (12861) రోజూ ఉదయం 6.45 గంటలకు కాచిగూడకు వస్తుంది.

News September 4, 2024

విద్యుత్ శాఖ ఇబ్బంది పెట్టొద్దు: కేంద్ర మంత్రి

image

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పట్టణంలో గణేశ్ మండపాలకు అయ్యే ఖర్చు అంతా తానే చెల్లించనున్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వినాయక మండప నిర్వాహకులను విద్యుత్ శాఖ ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకుందామని పిలుపునిచ్చారు.

News September 4, 2024

వరదలతో గ్రేటర్ వరంగల్‌కు రూ.20 కోట్ల పైనే నష్టం

image

భారీ వర్షాలు, వరదలతో గ్రేటర్ వరంగల్‌కు రూ.20 కోట్ల పైనే నష్టం వాటిల్లిందని ఇంజినీర్లు తాత్కాలిక అంచనాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో పూర్తిస్థాయి నష్టం అంచనా వేసేందుకు మంగళవారం బల్దియా ఇంజినీర్లు రంగంలోకి దిగారు. ఇంజినీరింగ్, ప్రజా రోగ్యం, డీఆర్ఎఫ్ విభాగాల నుంచి వరద నష్టం వివరాలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ అశ్విని తానాజీ ఆదేశించారు.

News September 4, 2024

ఖమ్మం: వరదల్లో పోయిన సర్టిఫికెట్లు ఈ నెల 11న జారీ

image

ఖమ్మం జిల్లాలో వరదతో సర్టిఫికెట్లు కోల్పోయిన వారి
కోసం ఈనెల 11న కలెక్టరేట్లో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అయితే, విదేశాల్లో ప్రవేశాలు, తదితర అవసరాలకు అత్యవసరంగా సర్టిఫికెట్లు అవసరమైతే హాట్ లైన్ నంబర్ తెలియజేయాలని.. వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు సమకూరుస్తామని చెప్పారు. మిగతా వారు ఈనెల 11న జరిగే శిబిరానికి హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.

News September 4, 2024

HYD: గెజిట్‌ను విడుదల చేసిన ప్రభుత్వం

image

రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని ఔటర్ రింగ్ రోడ్డు సమీప గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని 51 గ్రామ పంచాయతీలను వాటి సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేయడం ద్వారా పట్టణ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

News September 4, 2024

కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 304 ఇళ్లు ధ్వంసం

image

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 304 ఇళ్లు కూలిపోయాయి. 45 విద్యుత్ స్తంభాలు ధ్వంసం కాగా 3 నియంత్రికలు దెబ్బతిన్నాయి. కాగా జిల్లాలో ఏర్పాటు చేసిన 11 పునరావాస కేంద్రాలకు ఇప్పటి వరకు 188 మంది బాధితులను తరలించారు. మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు పూర్తి నివేదిక అందిన వెంటనే నష్టం విలువ అంచనా వేస్తామన్నారు.

News September 4, 2024

KNR: భారీ వర్షం.. ఇళ్లలోకి నీరు

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా 3రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గంగాధర మండలం మధురానగర్‌కు సమీపంలోని కుడి కాలువ తెగి వరద నీరు ఇళ్లలోకి, వీధుల్లోకి చేరింది. ఐదేళ్లుగా వరదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని 9వ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 ఇళ్లలోకి నీరు చేరిందని, సాగునీటి పారుదల శాఖ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News September 4, 2024

HNK: ఉపకార వేతనానికి దరఖాస్తుల ఆహ్వానం

image

దీన్ దయాళ్ స్పర్శ్ యోజన ఉపకార వేతనం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ వి.హనుమంతు తెలిపారు. 6 నుంచి 9వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు www.india-post.gov.in గల వెబ్‌సైట్లో పరిశీలించవచ్చన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 13లోపు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, హనుమకొండ చిరునామాలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.