Telangana

News September 4, 2024

శ్రీశైలం UPDATE.. నీటి మట్టం 883.80 అడుగులు

image

శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్లను ఎత్తి 2,70,470 క్యూసెక్కులు, కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా 67,217 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జలాశయంలో నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. జూరాల నుంచి 2,08,511 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 10,326 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.

News September 4, 2024

‘గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి’

image

త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి విధుల కేటాయింపు వంటి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

News September 4, 2024

MBNR: బీఆర్ఎస్ నేతలకు సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్

image

విపత్కర పరిస్థితుల్లో BRS నేతలు రాజకీయాలు చేయొద్దని AICC కార్యదర్శి సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24 గంటలు తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తున్నారు. BRS నేతలు KTR, హరీశ్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధి కోసం విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. జనాలు తిరగబడి చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని’ ఆయన హెచ్చరించారు.

News September 4, 2024

MDK: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

image

వినాయక నవరాత్రి వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. జోగిపేటలో శాంతి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబి, వినాయక నిమజ్జనం ఒకేసారి రావడంతో ఇరువర్గాలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. సమావేశంలో జోగిపేట సిఐ అనిల్ కుమార్, ఎస్సై పాండు, తహసిల్దార్ మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.

News September 4, 2024

మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలి: జనగామ కలెక్టర్

image

వినాయక చవితి పండుగ పురస్కరించుకొని ప్రజలు మట్టి వినాయక ప్రతిమలనే ప్రతిష్ఠించాలని, కాలుష్య నియంత్రణకు సహకరించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలని వినియోగించాలని రూపొందించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలతో ఉన్న ప్రతిమలను వినియోగించొద్దన్నారు.

News September 4, 2024

చేనేత వస్త్రాలను ఉపయోగించాలి: మంత్రి పొన్నం

image

సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలు, శాలువాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చేనేత వస్త్రాలను ఉపయోగిస్తే నేతన్నలందరికి ఆర్థికంగా సహకరించినట్లు ఉంటుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజు సింథటిక్ శాలువాల బదులు కాటన్ శాలువాలని వాడాలని, కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు.

News September 4, 2024

నల్లగొండ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లకు గడుపు పెంపు

image

డాక్టర్ BR. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో డిగ్రీ, PG, డిప్లమా కోర్సులలో చేరుటకు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త డా. అంతటి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ పరీక్ష ఫీజుని ఈనెల 20 లోపు చెల్లించాలని, కొత్తగా అడ్మిషన్ కోరే వారు ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత ఆయా స్టడీ సెంటర్లలో ఒరిజినల్స్ వెరిఫై చేయించుకోవాలన్నారు

News September 3, 2024

నిజామాబాద్ సీపీ కీలక సూచనలు

image

ఈ నెల 7న వినాయక చవితి పురస్కరించుకొని అన్ని గణేష్ మండపాలకు భద్రత ఇవ్వడానికి పాయింట్ బుక్ ఏర్పాటు కోసం సమాచారం ఇవ్వాలని నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్ పేర్కొన్నారు. నిజామాబాద్,ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే వారు https://policeportal.tspolice.gov.in లింక్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సహకరించాలని కోరారు.

News September 3, 2024

గద్వాల: వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో ACB సోదాలు

image

MBNR జిల్లాలో ఏసీబీ రైడింగ్‌లో పట్టుబడిన DSTO దిన్నె వెంకటేశ్వర్ రెడ్డి స్వస్థలమైన గద్వాల పట్టణంలోని ఆయన ఇంట్లోACB అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలలో నల్గొండ ఏసీబీ ఎస్ఐలు వెంకట్రావు, రామారావు ఆధ్వర్యంలో మొత్తం 9మంది బృందం పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి భార్య ప్రవీణను విచారిస్తున్నారు.

News September 3, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> JN: పాలకుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
> WGL: నెక్కొండ మండలంలో వాగులో పడి వ్యక్తి గల్లంతు
> HNK: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: పరకాల ఆర్డిఓ
> WGL: చైన్స్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న నలుగు అరెస్ట్
> JN: గోడ కూలడంతో విరిగిపోయిన విద్యుత్ నియంత్రిక
> MHBD: 15 లక్షల రూపాయల విలువ చేసే కోళ్లు మృతి
> WGL: బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం
> JN: రోడ్డు ప్రమాదంలో 3కి చేరిన మృతుల సంఖ్య