Telangana

News September 3, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోనరావుపేట మండలంలో అంబులెన్స్ లో మహిళ ప్రసవం. @ ఎల్లారెడ్డిపేట మండలంలో బోల్తాపడిన ట్రాలీ ఆటో. @ కోరుట్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ వేములవాడ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ. @ కొండగట్టు అంజన్న ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ. @ జగ్గాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్. @ కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్ సంస్కృతిని తీసుకొస్తుందన్న గంగుల కమలాకర్.

News September 3, 2024

ఉమ్మడి జిల్లాల్లో ముఖ్యాంశాలు.!

image

☞MBNR: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్దం. ☞MBNR:రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిఎస్టీఓ ☞WNP:9న వనపర్తి కిరణాషాప్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాక ☞అయిజ:ప్రమాదకరంగా మారిన ఐజ చౌరస్తా విద్యుత్ వైర్లు ☞వట్టెం:నీట మునిగిన వేంకటాద్రి రిజర్వాయర్.
 ⁠☞KLKY:ఎల్లికలు లో ఘనంగా ఎల్లమ్మ బోనాలు

News September 3, 2024

NZB: చెరువు కబ్జా కేసు.. కార్పోరేటర్ భర్తతో పాటు ఐదుగురి అరెస్ట్

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బొందెం చెరువు ఆక్రమణల కేసులో 10వ డివిజన్ కార్పొరేటర్ కోమలి భర్త నరేశ్‌తో పాటు కోటగల్లి జావిద్, మహిళా లీడర్ కమలమ్మ, BRS నాయకుడి ప్రధాన అనుచరుడైన మక్కల గోపాల్, మస్తాన్ ను మంగళవారం 5వ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులు, దళారులు, నకిలీ పట్టాలు తయారు చేసేవారు కుమ్మక్కై తమకు చెరువు శిఖం భూమిలో ప్లాట్లు విక్రయించారని బాధితులు ఆరోపించారు.

News September 3, 2024

నల్గొండ మున్సిపాలిటీకి స్వచ్ఛవాయు సర్వేక్షన్లో దేశంలో రెండో స్థానం

image

పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎంసీఏపి ) కింద నిర్వహించబడిన స్వచ్ఛ్ వాయు సర్వేక్షణ్-2024లో నల్గొండ మున్సిపాలిటీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ జనాభా కేటగిరీ-3 (<3 లక్షలు)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి ఘనత సాధించింది. ఈనెల 7న రాజస్థాన్‌లోని జైపూర్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్‌లో నల్లగొండ మున్సిపాలిటీ నగదు పురస్కారాన్ని అందుకోనున్నారు.

News September 3, 2024

WOW: అయోధ్య మందిరంలో బాలాపూర్‌ గణేశుడు!

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్‌ గణేశుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా ప్రముఖ పుణ్యక్షేత్రాల థీమ్‌తో డెకరేషన్ చేస్తారు. 2023లో బెజవాడ దుర్గమ్మ గుడి సెట్టింగ్ వేశారు. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి ఆలయ ఆకారంలో మండపం నిర్మిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఈ సెట్టింగ్ వేస్తున్నారు. భక్తులకు మరింత కనువిందుగా మండప నిర్మాణం ఉంటుందన్నారు.

News September 3, 2024

WOW: అయోధ్య మందిరంలో బాలాపూర్‌ గణేశుడు!

image

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్‌ గణేశుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా ప్రముఖ పుణ్యక్షేత్రాల థీమ్‌తో డెకరేషన్ చేస్తారు. 2023లో బెజవాడ దుర్గమ్మ గుడి సెట్టింగ్ వేశారు. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి ఆలయ ఆకారంలో మండపం నిర్మిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఈ సెట్టింగ్ వేస్తున్నారు. భక్తులకు మరింత కనువిందుగా మండప నిర్మాణం ఉంటుందన్నారు.

News September 3, 2024

సర్టిఫికెట్స్ కోల్పోయిన వారు ఫిర్యాదు చేయండి: CM రేవంత్

image

మున్నేరు వరదల్లో సర్టిఫికేట్స్ కోల్పోయిన వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వాటిని అందిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఆకేరు వాగు వరద ఉద్ధృతి కారణంగా పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికెట్స్ తడిచి పాడైన పోయిన వారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్నారు. వారికి కొత్త కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వవలసిందిగా అధికారులను అదేశించారు.

News September 3, 2024

ఆదిలాబాద్: DEGREEలో చేరేందుకు చివరి అవకాశం

image

DOST ద్వారా DEGREE కళాశాలలో స్పెషల్ ఫేజ్ ద్వారా ప్రవేశాలు పొందేందుకు మరొక సువర్ణ అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సంగీత పేర్కొన్నారు. SEP 9లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని SEP 4 నుంచి 9 వరకు వెబ్ అప్షన్లు పెట్టుకోవాలన్నారు. SEP 11న సీట్ల కేటాయింపు ఉంటుందని SEP 11 నుంచి 13 వరకు ఆన్ లైన్ పేమెంట్ పూర్తి చేయాలని, SEP 12 నుంచి 13లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు.

News September 3, 2024

సత్తుపల్లి చెరువులోకి దూకిన మహిళ.. కాపాడిన పోలీసులు..

image

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పోలీసులు కాపాడిన ఘటన సత్తుపల్లిలో జరిగింది. జవహర్ నగర్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో సమీపంలోని తామర చెరువులోకి దూకింది. సమాచారం అందుకున్న సత్తుపల్లి పోలీసులు ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మహిళను కాపాడిన పోలీసులు ఇజ్జగాని చెన్నారావు, శ్రీనివాస్, ఇమ్రాన్, కరుణాకర్, రమాదేవిలను స్థానికులు అభినందించారు.

News September 3, 2024

వరంగల్: మక్కలు క్వింటా రూ.2,858

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రికార్డుల పరంపరకు బ్రేక్ పడింది. మార్కెట్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని గతవారం శుక్రవారం క్వింటా మక్కలకు రూ.2,960 ధర రాగా నేడు భారీగా పడిపోయింది. ఈరోజు మక్కలు (బిల్టి) క్వింటాకు రూ. 2858 పలికినట్లు అధికారులు తెలిపారు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలుపుతున్నారు.