India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NLG: ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎలాంటి సమస్యలు రాకుండా లోకసభ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. మంగళవారం ఆమె నల్గొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లోకసభ ఎన్నికల విధుల నిర్వహణకు నియమించబడిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎంసీఏ, రెండేళ్ల ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షలను ఏప్రిల్ 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీన పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

HYD శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు పోగొట్టుకున్న లగేజీ, మర్చిపోయిన వస్తువులను అధికారులు భద్రపరిచి, వాటి వివరాలను https://bit.ly/3k3sY1X ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచారు. విమానాశ్రయంలో ఏవైనా మర్చిపోయినట్లయితే.. 040-66606064 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. ghiallost&found@gmrgroup.in మెయిల్ ద్వారా సైతం సందేహాలను తెలపవచ్చని పేర్కొన్నారు. SHARE IT
ఇది కాలం తెచ్చిన కరవు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరవేనని, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి అడుగడుగున అన్యాయమే జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రైతాంగం ఎదురుకుంటున్న సమస్యల పట్ల కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణమన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం నారాయణపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పిఓ, ఏపిఓ లకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికలను సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
HYD శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు పోగొట్టుకున్న లగేజీ, మర్చిపోయిన వస్తువులను అధికారులు భద్రపరిచి, వాటి వివరాలను https://bit.ly/3k3sY1X ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచారు. విమానాశ్రయంలో ఏవైనా మర్చిపోయినట్లయితే.. 040-66606064 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. ghiallost&found@gmrgroup.in మెయిల్ ద్వారా సైతం సందేహాలను తెలపవచ్చని పేర్కొన్నారు. SHARE IT
నల్గొండ జిల్లాలో గాంజయి, డ్రగ్స్ రవాణా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విడుదల చేసిన గంజాయి, కల్తీ కల్లుని నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుదాం అనే పోస్టర్ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపీడ అన్నారు.
ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలోనే సాధ్యమైనంత మేర ఆస్తిపన్ను రాబట్టేలా అధికారులు ఏటా మాదిరిగా ఎర్లీ బర్డ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదుశాతం రాయితీ లభించనుంది. అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభం మొదటి రోజు నుండే పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ఎర్లీ బర్డ్ ద్వారా ఈనెల 30 వరకు అవకాశం ఉందన్నారు.
జిల్లాలోని 1013 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మహిళా సంఘాలలోని సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకమిటీ ఆద్వర్యంలో స్కూల్లో తాగునీరు, తరగతిగదుల్లో చిన్నచిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు సమస్యలను గుర్తించాలన్నారు. ఆ కమిటీల ఆధ్వర్యంలో అన్ని మరమ్మతు పనులు చేయించాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.