India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేసి ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తారా? లేక అహ్మదాబాద్లో పెడతారా? అని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురికాకుండా రక్షణ చర్యలు పాటించాలని ప్రజలకు కలెక్టర్ ప్రియాంక అలా సూచించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ ఫోర్స్ మీటింగ్ అన్ని మండలాల్లోని వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో గద్వాల జిల్లాలోని బార్డర్ చెక్ పోస్టుల వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.11,54,200 పట్టుబడినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు. వాటికి సంబంధించి అనుమతి పత్రాలు లేకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రూ.11 లక్షలు, కేటీ దొడ్డి మండలం నందిన్నె బార్డర్ చెక్ పోస్ట్ వద్ద రూ.54,200 సీజ్ చేశామని నగదును గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు.
ఖమ్మం నగరంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్లో ముస్లిం యువత ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం లోక్ సభ ఎన్నికల పీఓ, ఏపీఓల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మొదటిరోజు శిక్షణ కార్యక్రమానికి మొత్తం 4740 మంది హాజరు కావాల్సి ఉండగా 4064 మంది మాత్రమే హాజరయ్యారు. 676 మంది శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరు కావడంతో వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిచందన ఆదేశించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై సంగారెడ్డి పట్టణ పోలీసులు ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భాస్కర్ తెలిపారు.
ఓ ప్రేమజంట ఆత్మహత్య ఘటన RR జిల్లా కొందుర్గులో జరిగింది. SI తెలిపిన వివరాలు.. ఉత్తరాశిపల్లి వాసి శ్రీకాంత్, కిస్మత్‌పురకు చెందిన బాలిక ప్రేమించుకుంటున్నారు. మార్చి 27న వారు పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో తమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భయపడిన వారు 30న రాత్రి పురుగు మందు తాగారు. అదే రోజు బాలిక చనిపోగా ఈరోజు శ్రీకాంత్ ఆస్పత్రిలో చనిపోయాడు. అబ్బాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
ఓ ప్రేమజంట ఆత్మహత్య ఘటన RR జిల్లా కొందుర్గులో జరిగింది. SI తెలిపిన వివరాలు.. ఉత్తరాశిపల్లి వాసి శ్రీకాంత్, కిస్మత్‌పురకు చెందిన బాలిక ప్రేమించుకుంటున్నారు. మార్చి 27న వారు పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి మైనర్ కావడంతో తమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భయపడిన వారు 30న రాత్రి పురుగు మందు తాగారు. అదే రోజు బాలిక చనిపోగా ఈరోజు శ్రీకాంత్ ఆస్పత్రిలో చనిపోయాడు. అబ్బాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
గద్వాల జిల్లా ధరూర్ మండలం గార్లపాడులో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం.. గ్రామానికి చెందిన మమత(11) నేడు గ్రామ శివారులోని బావిలో ఈతకు స్నేహితులతో కలిసి వెళ్లింది. ఈత కొడుతున్న మమత ఎంతకీ బయటకు రాకపోవడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు వచ్చి బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 154 అగ్ని ప్రమాద కేసులు విచారణ ప్రారంభం కాగా.. 71 కేసుల్లో జరిమానాలు, 56 కేసుల్లో న్యాయస్థానం మార్పులు చేసి సమర్పించాలని సూచించింది. 18 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా..9 కేసులను ఉపసంహరించుకున్నారు. HYD పరిధిలో 36 మందికి ఉల్లంఘన నోటీసులు, 31 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.