Telangana

News April 2, 2024

వరంగల్ మార్కెట్‌లో పలు ఉత్పత్తుల ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు పలు ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. నం.5 రకం మిర్చి క్వింటాకి రూ.13 వేలు, సింగిల్ పట్టి రకం క్వింటాకు రూ.42,500 పలికింది. అలాగే మక్కలు క్వింటాకు రూ.2,175 ధర పలికాయి. కాగా గతవారంతో పోలిస్తే ఈరోజు మక్కల ధర భారీగా తగ్గింది. ఎండ తీవ్రత నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 2, 2024

వైద్య కళాశాలలో బోధన సిబ్బంది పోస్టులకు ఇంటర్వ్యూ

image

మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన(కాంట్రాక్ట్) భర్తీ చేయుటకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ లకావత్ వెంకట్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 6న ప్రభుత్వ వైద్య కళాశాల మహబూబాబాద్‌లో ఉ. 10 గంటల నుంచి సా.4 గంటల వరకు హాజరు కావాలన్నారు. వివరాలకు http://gmcmahabubabad.org/ సంప్రదించాలన్నారు.

News April 2, 2024

జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నామని ప్రిన్సిపల్ మంగళవారం తెలిపారు. ప్రొఫెసర్స్- 5, అసోసియేట్ ప్రొఫెసర్స్- 17, అసిస్టెంట్ ప్రొఫెసర్స్- 10, సీనియర్ రెసిడెంట్స్- 4, ట్యూటర్స్- 11 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గలవారు ఈ నెల 4న ఉదయం 10 గంటల నుంచి వైద్య కళాశాలలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

News April 2, 2024

అలంపూర్ చౌరస్తాలో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. జాతీయ రహదార- 44పై అలంపూర్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ పై వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానాన్ని పరిశీలించారు. కాగా ఈ ప్రమాదం, మృతుడికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2024

ఖమ్మం: డిగ్రీ విద్యార్థులకు గమనిక

image

కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని పొడగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News April 2, 2024

మల్కాజిగిరిలో BRS జెండా పాతేనా?

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?

News April 2, 2024

మల్కాజిగిరిలో BRS జెండా పాతేనా?

image

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?

News April 2, 2024

NZB: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన సులోచన అనే మహిళ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరంతా ఒక కారులో మంగళవారం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు కారంపొడి కోసం వెళ్లి తిరిగి వస్తుండగా నవీపేట్ మండలం జగ్గారావు ఫారం వద్ద వీరి కారు ప్రమాదవశాత్తు చెట్టును బలంగా ఢీ కొంది. సులోచన స్పాట్ లోనే మృతిచెందగా అనిత, సునీత, కవితకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

News April 2, 2024

సిద్దిపేట: బండి సంజయ్ మోడీ దగ్గర దీక్ష చేయాలి: మంత్రి పొన్నం

image

రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని, తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర దీక్ష చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకురావాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాలని మోదీ దగ్గర దీక్ష చేయాలన్నారు.

News April 2, 2024

కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: డీకే అరుణ

image

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తాను జాతీయహోదా తీసుకురాలేదని కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. నారాయణపేటలో ఆమె మాట్లాడుతూ.. పాలమూరు పార్లమెంటులోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే తాను మంత్రిగా ఉన్నప్పుడే పాలమూరు ప్రాజెక్టు సర్వే పనులు ప్రారంభానికి కృషిచేశానని అన్నారు. కాంగ్రెస్ నేతలు అవగాహన లేని మాటలు మానుకోవాలన్నారు.