Telangana

News September 3, 2024

సిద్దిపేట : టీచర్‌గా మారిన కలెక్టర్

image

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి కాసేపు టీచరుగా మారి కేజీబీవీ విద్యార్థులకు పాఠాలు బోధించారు. మంగళవారం దుబ్బాక మండల కేంద్రంలో కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ స్వాతి అధికవర్షాలతో కురుస్తున్న డార్మెటరీని, అసంపూర్తిగా ఉన్న కాంపౌండ్ వాల్‌ను కలెక్టర్‌కు చూపించారు.

News September 3, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. చాంబర్స్ ఆఫ్ కామర్స్ కోరిక మేరకు ఈ నెల 4,5,6న సెలవు, 7,8న (శని, ఆదివారాలు) వారంతపు సెలవు సందర్బంగా మొత్తం ఐదు సెలవు ప్రకటించినట్లు పేర్కోన్నారు. తిరిగి 9న (సోమవారం) నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు.

News September 3, 2024

MBNR: లంచం తీసుకుంటూ దొరికిన GOVT అధికారి

image

ACB వలలో మరో అవినీతి చేప చిక్కింది. MBNR జిల్లా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి రూ.10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ వ్యాపారి సీడ్స్ అండ్ స్క్రాప్ వ్యాపారానికి సంబంధించి జీఎస్టీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా అధికారి వెంకటేశ్వర్ రెడ్డి రూ.50 వేలు డిమాండ్ చేయగా వ్యాపారి ఏసీబీని ఆశ్రయించినట్లు వెల్లడించారు.

News September 3, 2024

MBNR: అతిథి అధ్యాపకుల సేవలను వినియోగించుకునేందుకు ఉత్తర్వులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అతిథి ఆధ్యాపకుల సేవలను 2024-25 విద్యా సంవత్సరానికి వినియోగించుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్తగా జూనియర్ కళాశాలలో అధ్యాపకులను నియమించనుంది. ప్రస్తుతం వీరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. వీరు విధుల్లో చేరే వరకు అతిథి అధ్యాపకులను కొనసాగించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News September 3, 2024

NGKL: 14 కిలోమీటర్ల మేర నిలిచిన వరద నీరు..

image

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వట్టెం ప్యాకేజీ 7 సర్జిపుల్ పంప్ హౌస్‌లోకి దాదాపు 14 కిలోమీటర్ల మేర వరద నీరు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నీటిని మోటర్ల ద్వారా ఎత్తి పోయడానికి దాదాపు 15 రోజులు పట్టనున్నట్లు సమాచారం. పంప్ హౌస్‌లో ఉన్న మోటార్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ మీడియాకు తెలిపారు.

News September 3, 2024

ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా ట్రైనీ పోలీసులు

image

ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసరాలలోని రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, ఖమ్మం టౌన్ పరిధిలోని బొక్కలగడ్డ, ధంసాలపూరం కాలనీ తదితర వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు అండగా 525 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు పాల్గొంటున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొని బాధితుల సాదారణ జన జీవనానికి సహాయ సహకారం అందిస్తున్నారని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

News September 3, 2024

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు: మంత్రి పొన్నం

image

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ₹4 లక్షల నుంచి ₹5 లక్షలకు ఎక్స్‌గ్రేషియా పెంచామన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఎకరానికి ₹10 వేల నష్టపరిహారం, మృత్యువాత పడ్డ పాడిగేదెకు ₹30 నుంచి ₹50 వేలు మేక, గొర్రెకు మూడు నుంచి ₹5వేల ఆర్థికసాయం ప్రభుత్వమందిస్తుందన్నారు.

News September 3, 2024

కిన్నెరసానిలో పడి ఇద్దరు మృతి 

image

టేకులపల్లికి చెందిన సాయికుమార్, వెంకటేశ్వర్లు ఆదివారం సాయంత్రం రాయపాడు సమీపంలో గల్లంతవగా ఇవాళ వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయికుమార్ మృతదేహం బంగారుచిలక సమీపాన చింతకుంట వద్ద బోడిగుట్ట వాగు వద్ద లభించింది. వెంకటేశ్వర్లు మృతదేహం కిన్నెరసాని వాగు తోక బంధాల గ్రామ సమీపాన వాగు పక్కన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

News September 3, 2024

NZB: KCR ఎక్కడ?: మహేశ్ కుమార్ గౌడ్

image

ఇంతటి విపత్తులోనూ KCR ఎక్కడా కనిపించడం లేదని MLC, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. BRS బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయం ఇది అని, KCR ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చిన్న వర్షం పడినా గందరగోళ పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలా ఏం లేదని చెప్పారు. వర్షాలపై CM రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆరా తీస్తున్నారన్నారు. KCRకు అధికారముంటేనే తెలంగాణ కనిపిస్తుందా అని ప్రశ్నించారు.

News September 3, 2024

RRR భూముల విలువ భారీగా పెరిగాయి

image

రీజినల్ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగంలో భూసేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను సర్కారు భారీగా పెంచింది. ఏకంగా 2 నుంచి 5 రెట్ల వరకు పెంచేసింది. భూములు కోల్పోతున్న రైతులకు అధిక పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 28న స్పీడ్-19 ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి RRR దక్షిణ భాగంపై చర్చించి, ఆదేశాలు జారీ చేశారు.