India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్లలో వసూలైన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం మార్కెట్ రూ.2,761 లక్షలు, వైరా మార్కెట్ రూ.578.59లక్షలు, కల్లూరు మార్కెట్ రూ.484.25 లక్షలు, సత్తుపల్లి మార్కెట్ రూ.478.37 లక్షలు, మధిర మార్కెట్ పరిధిలో రూ.455.03 లక్షలు, ఏన్కూరు మార్కెట్ రూ.449.99 లక్షలు నేలకొండపల్లి మార్కెట్ రూ.391.08లక్షలు, మద్దులపల్లికి రూ.182.39లక్షల ఆదాయం నమోదైంది.
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. గౌతమ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్(56) సోమవారం రాత్రి ఇంట్లో గొడవ పడి అర్ధరాత్రి తర్వాత మిర్చి కాంపౌండ్ రైల్వే గేట్ వద్ద జైపూర్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే SI సాయి రెడ్డి తెలిపారు. అతడు నగరంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో తాజాగా లక్ష్యాన్ని మించి ఆదాయం నమోదైంది. ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఎనిమిది మార్కెట్ల ద్వారా ఆదాయ లక్ష్యం రూ.5,439.72 లక్షలు కాగా, రూ.5,780.70 లక్షలు వసూలయ్యాయి. ఇందులో అత్యధికంగా ఖమ్మం మార్కెట్ నుంచి రూ.2,614 లక్షలకు రూ.2,761లక్షలు వసూలయ్యాయి. కాగా, గత ఏడాదితో పోలిస్తే మార్కెటింగ్ శాఖకు రూ.8లక్షల మేర ఆదాయం పెరిగిందని అధికారులు వెల్లడించారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,200 పలకగా.. మంగళవారం రూ.7240 పలికింది. అయితే పత్తి ధరలు పెరిగేలా వ్యాపారులు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి సరైన ధర రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉద్యోగులకు కేటాయింపు కొలిక్కి వస్తోంది. జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 1,456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో విధులు నిర్వర్తించేందుకు 7,280మంది ఉద్యోగులు అవసరం ఉండగా, అదనంగా 20శాతం మందితో కలిపి 9,972మందికి శిక్షణ ఇస్తున్నారు. కాగా, ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఈసారి ఐదుగురు ఉన్నతాధికారులను కేటాయిస్తున్నట్లు తెలిసింది.
ఎన్నికల కోడ్ ఉన్నందున శుభకార్యాల వేళ నగదు వెంట తీసుకెళ్లేవారు పెళ్లి కార్డులు, ఆ నగదు ఏ బ్యాంకు అకౌంట్ నుంచి డ్రా చేశారు..? ఎంత డ్రా చేశారు..? ఏం కొనుగోలు చేయబోతున్నారు..? వంటి వాటికి ఆధారాలు చూపించాలని ఉమ్మడి జిల్లా పోలీసులు పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వెళ్లేవారు పేషెంట్ వివరాలు వెంట తీసుకెళ్లాలి. తర్వాత సరైన ఆధారాలు చూపించి నగదును తిరిగి పొందవచ్చని వారు సూచిస్తున్నారు.
కరీంనగర్‌లో దారుణం జరిగింది. బొమ్మకల్‌కు చెందిన ఓ తల్లి శ్రీజ.. ఏడాదిన్నర వయసున్న కొడుకుకి విషమిచ్చి తాను బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలిసి శ్రీజ తల్లి జయప్రద విషం తాగింది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
✓ ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు.
✓ అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.
✓ శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహారాన్ని తీసుకోవద్దు.
✓ బయటకు వెళ్తే తెలుపు రంగు దుస్తులను ధరించండి.
HYDలో రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక లాంటి అనేక ప్రాంతాల్లో సోమవారం నుంచే రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెర లబ్ధిదారులకు అందజేశారు. గతంలో ప్రతి నెల 7వ తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాల్లో సరుకు కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొన్న పౌరసరఫరాల శాఖ 1వ తేదీ నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది.
HYDలో రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక లాంటి అనేక ప్రాంతాల్లో సోమవారం నుంచే రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెర లబ్ధిదారులకు అందజేశారు. గతంలో ప్రతి నెల 7వ తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాల్లో సరుకు కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొన్న పౌరసరఫరాల శాఖ 1వ తేదీ నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది.
Sorry, no posts matched your criteria.